Scrapping
-
మొక్కుబడిగా స్క్రాప్ పాలసీ.. ఈ ప్రశ్నలకు బదులేదీ సారూ!
సాక్షి, హైదరాబాద్: రవాణాశాఖ కొత్తగా రూపొందించిన వాహనాల స్క్రాప్ పాలసీ గందరగోళంగా ఉంది. వాహనాల తుక్కు ప్రక్రియలో స్పష్టత కొరవడింది. ఆర్టీఏ అంచనాల మేరకు గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 18 లక్షల వరకు కాలపరిమితి ముగిసిన వాహనాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని వాటి యజమానులు రిజిస్ట్రేషన్లను పునరుద్ధరించుకొని వినియోగిస్తున్నారు. మరికొన్ని వాహనాలు వినియోగానికి పనికి రాకుండా మూలనపడ్డాయి. ఆర్టీఏ ప్రమేయం లేకుండానే తుక్కు కింద మారాయి. మరోవైపు లక్షలాది వాహనాలు గల్లంతయ్యాయి. చోరీకి గురైన వాహనాల జాడ లేదు. ఇలా వివిధ రకాలుగా వినియోగంలో లేని వాహనాలపైన తాజా స్క్రాప్ పాలసీలో ఎలాంటి స్పష్టత లేదని వాహనదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కొత్త పాలసీ వల్ల కనిపించని ప్రయోజనం రవాణాశాఖ లెక్కల్లో మాత్రమే కనిపించే ఈ వినియోగంలో లేని వాహనాలపైన వాహనదారులు పెద్దమొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కొత్త బండి కొనుగోలు చేసే సమయంలో రెండో వాహనంగా పరిగణించి 2 శాతం పన్నును అదనంగా విధిస్తున్నారు. దీంతో కార్లు, తదితర నాలుగు చక్రాల వాహనాలను కొనుగోలు చేసే వారు రూ.వేలల్లో పన్నులు చెల్లించాల్సి వస్తుంది. మరోవైపు రెండో బండి కింద ద్విచక్ర వాహనాల కొనుగోలుపై కూడా భారం మోపుతున్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. వినియోగంలో లేని వాహనాలను తుక్కుగా పరిగణించకుండానే రూపొందించిన కొత్త పాలసీ వల్ల వాహనదారులకు ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. పాత వాహనాలపై ఫిర్యాదుల వెల్లువ.. మోటారు వాహన చట్టంలోని నిబంధనల ప్రకారం 15 ఏళ్లు దాటిన రవాణా వాహనాలను కాలపరిమితి ముగిసినవిగా పరిగణిస్తారు. తాజా నిబంధనల మేరకు వాటిని తుక్కు చేయాల్సి ఉంటుంది. ఇక వ్యక్తగత వాహనాల కేటగిరీలోకి వచ్చే కార్లు, ద్విచక్ర వాహనాల కాలపరిమితిని పొడిగించుకోవచ్చు. వద్దనుకుంటే స్వచ్ఛందంగా తుక్కు చేసి కొత్త వాహనం కొనుగోలు చేసుకోవచ్చు. పాతబండి స్క్రాబ్ చేయడం వల్ల 2 శాతం అదనపు పన్ను నుంచి ఊరట లభిస్తుంది. అలాగే కొత్త వాహనం జీవితకాల పన్నులోనూ రాయితీ ఇస్తారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ వినియోగంలో లేని వాహనాల సంగతేంటనేది ప్రశ్నార్థకంగా మారింది. కాలపరిమితి ముగిసి వినియోగానికి పనికి రాకుండా ఉన్నవి ఆటోమేటిక్‌గానే తుక్కుగా మారాయి. పెద్ద సంఖ్యలో చోరీకి గురయ్యాయి. అలాంటి వాటిపైన పోలీస్స్టేషన్లలో, ఆర్టీఏ కార్యాలయాల్లో వేల సంఖ్యలో ఫిర్యాదులు నమోదై ఉన్నాయి. దశాబ్దాలుగా ఈ ఫిర్యాదులు పరిష్కారానికి నోచడం లేదు.ఊరించి ఉస్సూరుమనిపించారు.. కాలపరిమితి ముగిసిన వాటిలో ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు, లారీలు, డీసీఎంలు, లారీలు, టాటాఏస్‌లు వంటి వివిధ కేటగిరీలకు చెందిన రవాణా వాహనాల కంటే వ్యక్తిగత వాహనాలే ఎక్కువగా ఉన్నాయి. రవాణా వాహనాలకు 15 ఏళ్లు కాలపరిమితి కాగా, వ్యక్తిగత వాహనాలకు నిర్దిష్టమైన పరిమితి లేదు. 15 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఐదేళ్లకు ఒకసారి పునరుద్ధరించుకోవచ్చు. దీంతో ఈ కేటరికీ చెందినవి ఎక్కువ. అదే సమయంలో వినియోగంలో లేనివి కూడా వ్యక్తిగత వాహనాల కేటగిరీలోనే అత్యధికంగా ఉన్నాయి. అలాంటి వాటిపైన ఈ పాలసీ ఊరించి ఉస్సూరుమనిపించింది.చదవండి: 15 ఏళ్లు దాటిన వాహనాల్లో బైక్‌లదే అగ్రస్థానం.. హైదరాబాద్ జిల్లాలోనే అధికం అపహరణకు గురైనప్పటికీ.. పోగొట్టుకున్న వాహనాలు లభించకపోవడంతో కొత్తవి కొనుగోలు చేసే సమయంలో 2 శాతం అదనపు పన్ను చెల్లించాల్సి వస్తుంది. అపహరణకు గురైనప్పటికీ ఆ వాహనం సదరు యజమాని పేరిట నమోదై ఉందనే సాకుతో రవాణా అధికారులు అదనపు భారం మోపుతున్నారు. వినియోగంలో లేకపోయినా పన్ను చెల్లించాల్సి రావడం అన్యాయమని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా రూపొందించిన స్క్రాప్ పాలసీలో తమకు ఊరట లభించవచ్చని చాలామంది భావించారు. కానీ వాటిపైన ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు. వాహనదారులు స్వచ్ఛందంగా స్క్రాప్ చేయవచ్చని మాత్రం వెల్లడించారు. -
తెలంగాణలో నవంబర్ నుంచే ‘వాహనాల స్క్రాపింగ్’
సాక్షి, హైదరాబాద్: కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చే ప్రక్రియ నవంబరు మొదటివారంలో ప్రారంభం కానుంది. వారం రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాహన తుక్కు విధానాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు వాహనాలను తుక్కుగా మార్చే కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇందుకోసం ప్రైవేటు కేంద్రాలకు అనుమతి ఇవ్వనున్నారు. పదిహేనేళ్లు దాటిన వాహనాలను తుక్కుగా (స్వచ్ఛంద విధానం) మార్చాల్సి ఉంటుంది. ఇందుకోసం రిజిస్టర్డ్ వెహికిల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.ఈ విధానం కింద తెలంగాణకు మూడు కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం అనుమతించింది. ప్రస్తుతానికి నాలుగు ప్రైవేట్ సంస్థలు దరఖాస్తు చేశాయి. ఆయా కేంద్రాలు కేంద్ర నిబంధనల మేరకు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని తేల్చేందుకు ఇటీవల అధికారులు వాటిని తనిఖీ చేశారు. మరో పది రోజుల్లో వాటిల్లో అనుకూలమైన కేంద్రాలకు పచ్చజెండా ఊపనున్నారు. ఆ వెంటనే వాహనాలను తుక్కుగా మార్చే ప్రక్రియ మొదలవుతుంది. కేవలం ఐదుగురు వాహనదారులే ముందుకు..కేంద్ర ప్రభుత్వం 2021లో చట్ట సవరణ చేయగా, దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో స్క్రాపింగ్ విధానం అమలవుతోంది. తుక్కు విధానం ప్రకటించిన ఈ వారం రోజుల్లో తెలంగాణలో కేవలం ఐదుగురు వాహనదారులు మాత్రమే తమ 15 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు ఆసక్తి చూపారు.చదవండి: 15 ఏళ్లు దాటిన వాహనాల్లో బైక్‌లదే అగ్రస్థానం.. హైదరాబాద్ జిల్లాలోనే అధికంనిర్బంధం కాకపోవటంతో.. పదిహేనేళ్లు దాటిన వాహనాలకు ఫిట్నెస్ చేయించి గ్రీన్ ట్యాక్స్ చెల్లించి మరో ఐదేళ్లు నడుపుకొనే విధానం అమలవుతోంది. గ్రీన్ ట్యాక్స్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దీంతో చాలా రాష్ట్రాలు స్క్రాపింగ్ విధానంలో దాన్ని కొనసాగిస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసిన తెలంగాణ ప్రభుత్వం కూడా దాన్నే అనుసరించాలని నిర్ణయించి పాలసీలో పొందుపరిచింది. దీంతో కాలం తీరిన వాహనాలను తుక్కుగా మార్చటం కంటే గ్రీన్ ట్యాక్స్ చెల్లించి ఐదేళ్లు చొప్పున రెండు దఫాలు అనుమతి పొంది నడుపుకొనేందుకే ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. కేంద్రం ఈ విధానం తెచ్చిన తర్వాత (ఢిల్లీ మినహా) దేశవ్యాప్తంగా కేవలం 44,900 వాహనాలను మాత్రమే తుక్కుగా మార్చారు.అధికారులు అడిగినా స్పందించని ఓ సెంటర్ఓ బడా వాహన తయారీ సంస్థకు నగర శివారులో స్క్రాపింగ్ సెంటర్ ఉంది. వెహికిల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ సెంటర్ నిర్వహణకు అనుమతి ఇవ్వాల్సిందిగా దరఖాస్తు చేసింది. కానీ ఆ తర్వాత స్పందించటం మానేసింది. దీంతో దరఖాస్తు చేసిన మరో మూడు కేంద్రాల వద్దకు వెళ్లి అక్కడి వసతులను తనిఖీ చేసి వచ్చారు. -
తుక్కుగా మార్చాల్సిన వాణిజ్య వాహనాలు ఎన్నంటే..
ముంబై: దేశంలో ఈ ఏడాది మార్చి నాటికి 15 ఏళ్ల జీవిత కాలం పూర్తయిన మధ్యస్థ, భారీ వాణిజ్య వాహనాలు (ఎంఅండ్హెచ్సీవీలు) 11 లక్షల మేర ఉంటాయని, నిబంధనల ప్రకారం ఇవన్నీ తుక్కు కిందకు వెళ్లాల్సి ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. కానీ, గడువు ముగిసిన తర్వాత కూడా వాటిని నడిపిస్తుండడం వల్ల తుక్కు కిందకు మారేవి వాస్తవంగా ఇంతకంటే తక్కువగా ఉండొచ్చని అంచనా వేసింది.వీటిల్లో కొంత మేర తుక్కుగా మారినా కానీ, వాణిజ్య వాహన అమ్మకాల డిమాండ్‌కు కొంత మేర మద్దతుగా నిలవొచ్చని పేర్కొంది. ‘వాలంటరీ వెహికల్ ఫ్లీట్ మోడరేషన్ ప్రోగ్రామ్’ లేదా స్క్రాపేజీ పాలసీని 2021 మార్చిలో ప్రకటించగా.. 2023 ఏప్రిల్ 1 నుంచి దశలవారీగా అమలు చేస్తుండడం గమనార్హం. మొదటి దశలో 15 ఏళ్ల జీవిత కాలం ముగిసిన ప్రభుత్వ వాహనాలను తుక్కుగా మార్చనున్నారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి అమల్లోకి వచి్చన రెండో దశలో భాగంగా.. వాహనం వయసుతో సంబంధం లేకుండా ఫిట్నెస్ ఆధారంగా తుక్కుగా మార్చడం తప్పనిసరి చేశారు. అంటే నిబంధనలకు మించి కాలుష్యం విడుదల చేసే వాహనాలను కాలంతో సంబంధం లేకుండా తుక్కుగా మార్చనున్నారు.మరో 5.7 లక్షల వాహనాలు.. 2027 మార్చి నాటికి మరో 5.7 లక్షల వాహనాలు 15 ఏళ్ల జీవిత కాలం పూర్తి చేసుకుంటాయని ఇక్రా తెలిపింది. మొదటి దశలో భాగంగా 9 లక్షల ప్రభుత్వ వాణిజ్య వాహనాలు తుక్కుగా మార్చడం వంటివి కొత్త వాహన కొనుగోళ్ల డిమాండ్‌ను పెంచనున్నట్టు అంచనా వేసింది. ఇక ప్యాసింజర్ వాహనాలు, తేలికపాటి వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహనాల వినియోగం తక్కువగా ఉన్నందున ఈ విభాగాల నుంచి తుక్కుగా మారేవి తక్కువగానే ఉండొచ్చని ఇక్రా తెలిపింది. స్క్రాపేజీ పాలసీ అమల్లోకి వచ్చినప్పటికీ వాహన యజమానుల నుంచి స్పందన పరిమితంగానే ఉన్నట్టు ఇక్రా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2024 ఆగస్ట్ 31 నాటికి వాహన తుక్కు కేంద్రాలు కేవలం 44,803 ప్రైవేటు వాహనాలు, 41,432 ప్రభుత్వ వాహనాలకు సంబంధించిన స్క్రాప్ దరఖాస్తులనే అందుకున్నట్టు ఇక్రా నివేదిక తెలిపింది.దీర్ఘకాలంలో ప్రయోజనాలు.. ‘‘వాహన తుక్కు విధానంతో దీర్ఘకాలంలో పలు ప్రయోజనాలున్నాయి. పాత వాహనాలను తుక్కు గా మార్చడం వల్ల వాయు కాలుష్యం తగ్గుతుంది. ఫ్లీట్ ఆధునికీకరణ (కొత్త వాహన కొనుగోళ్లు) కార్యక్రమానికి ఇది దారితీస్తుంది. మొత్తం మీద ఆటో పరిశ్రమలో అమ్మకాలకు మద్దతుగా నిలుస్తుంది. ఆటోమోటివ్ ఓఈఎంలకు ముడి సరుకుల వ్యయాలను గణనీయంగా తగ్గిస్తుంది’’అని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కింజాల్ షా వివరించారు. -
15 ఏళ్లు దాటిన వాహనాల్లో బైక్‌లదే అగ్రస్థానం.. హైదరాబాద్ జిల్లాలోనే అధికం
vehicle scrapping policy 2024: పదిహేను ఏళ్లు దాటిన వాహనాల విషయంలో ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ‘వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ’ ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలంగాణ రవాణాశాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 15 ఏళ్లు గడువు తీరిన వాహనాలు దాదాపు 21 లక్షలకుపైగా ఉన్నాయి. వీటిలో సింహభాగం గ్రేటర్ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. స్క్రాపింగ్ తప్పనిసరి కాదనడంతో కొందరు వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (ఆరీ్వఎస్ఎఫ్) పేరిట స్క్రాపింగ్‌కు రాష్ట్రవ్యాప్తంగా సదుపాయాలు కల్పించనున్నారు. ద్విచక్రవాహనాలే అధికం మొత్తంగా 21.27 లక్షల వాహనాల కాలం తీరిపోయింది. అయితే వీటిని ఇప్పటికిప్పుడు స్క్రాప్‌నకు పంపాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. వీటిలో ఫిట్నెస్ బాగుంటే మునుపటిలా నడుపుకోవచ్చు రూ.5 వేలు చెల్లించి ఐదేళ్లు, ఆ తర్వాత కూడా ఫిట్‌గా ఉంటే.. రూ.10 వేలు చెల్లించి మరో ఐదేళ్లు నడుపుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 21,27,912 వాహనాలు 15 ఏళ్లు వయసు పైబడ్డాయి. ఇందులో 9 లక్షల వాహనాలు హైదరాబాద్‌లో ఉండగా.. రంగారెడ్డిలో 2.3 లక్షల వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాల్లో అధికశాతం ద్విచక్ర వాహనాలే కావడం గమనార్హం.మళ్లీ అందులోనూ 1.3 లక్షల బైకులు హైదరాబాద్‌కు చెందినవి కాగా, 1.8 లక్షల ద్విచక్రవాహనాలు రంగారెడ్డిలో ఉన్నాయి. ఈ రెండు జిల్లాల తర్వాత 15 ఏళ్లు పైబడిన వాహనాలు వరుసగా మేడ్చల్ (1.5 లక్షలు), కరీంనగర్ (1.5 లక్షలు) నిజామాబాద్ (1.2 లక్షలు) జిల్లాల్లో ఉన్నాయి. ఈ లెక్కన గ్రీన్ ట్యాక్స్ అత్యధికంగా గ్రేటర్ పరిధిలోనే వసూలు కానుందని రవాణాశాఖ అధికారులు తెలిపారు. -
స్క్రాప్ స్వచ్ఛందమే: మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదిహేనేళ్లు దాటిన వాహనాలను తప్పనిసరిగా తుక్కుగా మార్చాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ‘వలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ’ని అమల్లోకి తెచ్చింది. వాహనాన్ని తుక్కుగా మార్చాలా, వద్దా అన్నదానిపై యజమానులే నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించింది. వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకుని, గ్రీన్‌ట్యాక్స్ చెల్లించి మరో ఐదేళ్లపాటు వినియోగించుకునే ప్రస్తుత విధానం కొనసాగుతుందని ప్రకటించింది. అయితే ఎవరైనా తమ వాహనాన్ని తుక్కుగా మార్చి, అదే కోవకు చెందిన కొత్త వాహనాన్ని కొంటే.. జీవితకాల పన్ను (లైఫ్ ట్యాక్స్)లో కొంతమొత్తం రాయితీగా ఇస్తామని తెలిపింది. కొన్నినెలల పాటు వివిధ రాష్ట్రాల్లోని వెహికల్ స్క్రాపింగ్ పాలసీలను అధ్యయనం చేశాక.. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను మిళితం చేసి అధికారులు ఈ విధానాన్ని రూపొందించారు. మంగళవారం రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ శాఖ అధికారులతో కలసి ఈ వివరాలను వెల్లడించారు. ఏ వాహనాలకు ఏ విధానం? ఎవరైనా 15 ఏళ్లు దాటిన తమ వాహనాన్ని తుక్కుగా మార్చాలని భావిస్తే.. దీనిపై రవాణా శాఖకు సమాచారమిచ్చి, అదీకృత తుక్కు కేంద్రానికి వెళ్లి స్క్రాప్ చేయించుకోవాలి. ఆ కేంద్రం సంబంధిత వాహనానికి నిర్ధారిత స్క్రాప్ విలువను చెల్లిస్తుంది. ఈ మేరకు సర్టిఫికెట్ ఇస్తుంది. యజమానులు అదే కేటగిరీకి చెందిన కొత్త వాహనం కొన్నప్పుడు.. ఈ సర్టిఫికెట్ చూపితే కొత్త వాహనానికి సంబంధించిన జీవితకాల పన్నులో నిర్ధారిత మొత్తాన్ని రాయితీగా తగ్గిస్తారు.రవాణా వాహనాలను ఎనిమిదేళ్లకే స్క్రాప్‌కు ఇవ్వవచ్చు. వీటికి సంబంధించి ఎంపీ ట్యాక్స్‌లో 10% రాయితీ ఉంటుంది. మిగతా నిబంధనలు నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనాల తరహాలోనే వర్తిస్తాయి. – ప్రభుత్వ వాహనాల విషయంలో మాత్రం నిర్బంధ స్క్రాప్ విధానమే వర్తిస్తుంది. పదిహేనేళ్లు దాటిన ప్రతి ప్రభుత్వ వాహనాన్ని ఈ–ఆక్షన్ పద్ధతిలో తుక్కు కింద తొలగించాల్సిందే. అవి రోడ్డెక్కడానికి వీలు లేదు. – ఏ కేటగిరీ వాహనాన్ని స్క్రాప్‌గా మారిస్తే.. అదే కేటగిరీ కొత్త వాహనంపై మాత్రమే రాయితీ వర్తిస్తుంది. ఉదాహరణకు ద్విచక్రవాహనాన్ని తుక్కుగా మారిస్తే.. మళ్లీ ద్విచక్రవాహనం కొంటేనే రాయితీ వర్తిస్తుంది. అంతేకాదు వాహనాన్ని తుక్కుగా మార్చిన రెండేళ్లలోపే ఈ రాయితీ పొందాల్సి ఉంటుంది. కేంద్రం చట్టం చేసిన మూడేళ్ల తర్వాత.. దేశవ్యాప్తంగా వాహన కాలుష్యం పెరుగుతోందంటూ సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టానికి సవరణ చేసింది. 15 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కుగా మార్చాలన్న విధాన నిర్ణయం తీసుకుంది. దీనిపై 2021లో రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ చట్టం అమలుపై రాష్ట్రాలకు స్వేచ్ఛ కల్పించింది. చాలా రాష్ట్రాలు దశలవారీగా దీని అమలు ప్రారంభించాయి. కానీ నిర్బంధంగా తుక్కు చేయకుండా.. స్వచ్ఛంద విధానానికే మొగ్గు చూపాయి. తెలంగాణలో మూడేళ్ల తర్వాత ఇప్పుడు పాలసీని అమల్లోకి తెచ్చారు. – ‘రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (ఆర్వీఎ‹స్ఎఫ్)’ కేంద్రాల్లో వాహనాలను తుక్కుగా మారుస్తారు. ఈ కేంద్రాల ఏర్పాటు కోసం గత ఆగస్టులో నోటిఫికేషన్ జారీ చేయగా.. మహీంద్రా కంపెనీ సహా నాలుగు సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ఆ కేంద్రాలు నిబంధనల ప్రకారం ఉన్నాయా, లేదా అన్నది పరిశీలించి అనుమతిస్తారు. యజమానులు ఈ కేంద్రాల్లోనే వాహనాలను అప్పగించి, సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. వాహనాల ‘ఫిట్నెస్’ పక్కాగా తేల్చేందుకు... 15 ఏళ్లు దాటిన వాహనాలను మరికొంతకాలం నడుపుకొనేందుకు ఫిట్నెస్ తనిఖీ తప్పనిసరి. ఇప్పటివరకు మ్యాన్యువల్‌గానే టెస్ట్ చేసి సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఇది సరిగా జరగడం లేదని, అవినీతి చోటుచేసుకుంటోందన్న ఫిర్యాదుల నేపథ్యంలో.. ఆటోమేటెడ్ స్టేషన్లలో కంప్యూటరైజ్డ్ పద్ధతిలో ఫిట్నెస్ టెస్టులు చేయించాలని కేంద్రం ఆదేశించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ఏర్పాటుకు రూ.293 కోట్లు అవుతాయని అంచనా వేశారు. అందులో కేంద్రం రూ.133 కోట్లను భరించనుంది. ఇక వాహనాల విక్రయానికి సంబంధించిన ఎన్ఓసీలు, లైసెన్సులు ఇతర సేవలను అన్ని రాష్ట్రాలతో అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం వాహన్, సారథి పోర్టల్‌లను ఏర్పాటు చేసింది. చాలా రాష్ట్రాలు వీటితో అనుసంధానమయ్యాయి. తాజాగా తెలంగాణ కూడా అందులో చేరుతున్నట్టు ప్రకటించింది. దీనిని తొలుత సికింద్రాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో ప్రారంభిస్తున్నారు. భద్రతపై దృష్టి సారించాం దేశవ్యాప్తంగా ఏటా 1.6 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. తెలంగాణలో కూడా ఆ సంఖ్య ఆందోళనకరంగానే ఉంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో రోడ్డు భద్రతపై దృష్టి సారించాం. నిబంధనల విషయంలో కచ్చితంగా ఉండాలని నిర్ణయించాం. రవాణా శాఖకు సంబంధించి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకున్నాం. రాష్ట్రంలో ఇప్పటివరకు వాహనాల తుక్కు విధానం లేదు. దాన్ని ప్రారంభించాలని నిర్ణయించాం. జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాలు ఎలా అమలు చేస్తున్నాయో పరిశీలించి మంచి విధానాన్ని తెచ్చాం. జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాలతో రవాణాశాఖకు సంబంధించిన సమాచార మార్పిడికి వీలుగా సారథి, వాహన్ పోర్టల్‌లో తెలంగాణ చేరాలని నిర్ణయించింది. ఏడాదిలో అన్ని విభాగాలను అనుసంధానం చేస్తాం. – రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రీన్‌ట్యాక్స్ మాఫీ..15 ఏళ్లుదాటిన వాహనాలు ఇంకా ఫిట్‌గా ఉన్నాయని భావిస్తే, వాటిని ఇక ముందు కూడా నడుపుకోవచ్చు. రూ.5 వేల గ్రీన్‌ట్యాక్స్ చెల్లించి తదుపరి ఐదేళ్లు, ఆ తర్వాత రూ.10 వేలు చెల్లించి మరో ఐదేళ్లు నడు పుకొనే వెసులుబాటు ఉంది. అయితే ఇప్ప టికే 15ఏళ్లు దాటేసిన వాహనాలను తుక్కుగా మార్పిస్తే.. వాటికి గ్రీన్‌ట్యాక్స్ బకాయి ఉన్నట్టుగా పరిగణించాల్సి వస్తుంది. దీంతో కొత్త పాలసీలో ఆ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేకుండా స్క్రాప్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అదే వాణిజ్య వాహనాలకు త్రైమాసిక పన్ను వంటి బకాయిలు ఉంటే.. ఆ బకాయిలపై పెనాల్టిని మాఫీ చేస్తారు. -
కొత్త వాహనాలపై రాయితీ.. ఇలా చేయండి
కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' ఇటీవల దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థల సీఈఓలు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. స్క్రాపేజ్ పాలసీ కింద డిస్కౌంట్స్ అందించాలని ఈ సమావేశంలో పేర్కొన్నారు. దీనిని 'ఐషర్' కంపెనీ ఎట్టకేలకు అమలుపరుస్తున్నట్లు ప్రకటించింది.ఇప్పుడు ఎవరైన మినీ ట్రక్కు, బస్సులను కొనుగోలు చేయాలనుకుంటే డిస్కౌంట్ పొందవచ్చు. ఎలా అంటే.. మీ దగ్గరున్న పాత వాహనాలను స్క్రాపేజ్ (తుక్కు) కింద మార్చి, దానికి సంబంధించిన సెర్టిఫికేట్ పొందాలి. ఆ తరువాత సర్టిఫికేట్‌ను కొత్త వాహనం కొనే సమయంలో కంపెనీలో (ఐషర్ కంపెనీ) చూపిస్తే.. 1.25 శాతం నుంచి 3 శాతం వరకు కొత్త వెహికల్ కొనుగోలుపైన రాయితీ పొందవచ్చు.స్క్రాపేజ్ పాలసీ కింద పొందే రాయితీలను.. 2024 సెప్టెంబర్ 1 నుంచి చెల్లుబాటు అవుతుంది. ఇది వచ్చే రెండేళ్ళు లేదా తరువాత నోటీస్ వచ్చేవరకు అమలులో ఉంటుందని ఐషర్ కంపెనీ పేర్కొంది.వెహికల్ స్క్రాపేజ్ పాలసీ కింద ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి, రోడ్డుపై పాతవాహనాల సంఖ్యను తగ్గించడానికి ఇది ఒక పరివర్తనాత్మక దశ అని వీఈ కమర్షియల్ వెహికల్స్ ఎండీ అండ్ సీఈఓ 'వినోద్ అగర్వాల్' పేర్కొన్నారు. కంపెనీ కూడా కస్టమర్లకు పూర్తిగా సహకరిస్తుందని ఆయన వెల్లడించారు. -
‘తుక్కు’కు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి: సియామ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 23న పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వివిధ రంగాలు తమ విజ్ఞప్తుల చిట్టాను ప్రభుత్వం ముందు ఉంచుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింతగా పెరిగేందుకు రాబోయే బడ్జెట్లో తగు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆటోమొబైల్ పరిశ్రమ సమాఖ్య సియామ్ కోరింది. అలాగే, వాహనాలను తుక్కు కింద మార్చే స్క్రాపింగ్ ప్రక్రియకు సంబంధించి అదనంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.ఈ సందర్భంగా సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ మాట్లాడుతూ..‘ఎలక్ట్రిక్ వాహనాల కోసం కేంద్రం ఫేమ్ 3 వంటి పథకాన్ని ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నాం. ఇప్పటికే అమలవుతున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) వంటి స్కీములు ఇకపైనా కొనసాగుతాయని ఆశిస్తున్నాం. వాహనాల స్క్రాపేజీ పాలసీ అమల్లో ఉన్నప్పటికీ పెద్దగా ప్రభావం లేనందున, స్క్రాపింగ్ విషయంలో మరిన్ని ప్రోత్సాహకాలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు ప్రకటించవచ్చని ఆశిస్తున్నాం. గ్రామీణ ఎకానమీకి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటే ఆటోమోటివ్, ఎఫ్ఎంసీజీ వంటి రంగాలకు మేలు జరుగుతుంది’ అని తెలిపారు.విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్ 2 గడువు ముగిసినందున దాని స్థానంలో ఫేమ్ 3ని అమలు చేస్తే పరిశ్రమకు తోడ్పాటు లభిస్తుందనే ఆశలు నెలకొన్నాయి. ద్విచక్ర, త్రిచక్ర ఎలక్ట్రిక్ వాహనాల కోసం కేంద్రం రూ.10,000 కోట్లతో ఈ పథకాన్ని ప్రకటించవచ్చనే అంచనాలు ఉన్నాయి.ఇదీ చదవండి: వేడి టీ పడి ఒళ్లంతా గాయాలు.. రూ.12.5 కోట్ల దావాతరుగుదల ప్రయోజనాలు కల్పించాలి: ఫాడావ్యక్తిగత ట్యాక్స్‌పేయర్లకు వాహనాల తరుగుదలను (డిప్రిసియేషన్) క్లెయిమ్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాలని ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఫాడా కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. పన్ను చెల్లింపుదార్ల సంఖ్య పెరగడంతో పాటు వాహనాలకు డిమాండ్ పెరిగేందుకు కూడా ఇది తోడ్పడుతుందని ఫాడా ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు. మరోవైపు, ఎల్ఎల్పీ (లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్), ప్రొప్రైటరీ, భాగస్వామ్య సంస్థలకు సైతం కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గించాలని కోరారు. -
పాతదాన్ని తుక్కుగా మారిస్తే కొత్త వాహనానికి రాయితీ..ఎంతంటే..
కాలంచెల్లిన వాహనాలను తుక్కుగా మార్చి వాటిస్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేసే వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది. వెహికల్ స్క్రాపేజ్ పాలసీ ప్రకారం..పాత వ్యక్తిగత వాహనాన్ని తుక్కుగా మార్చి కొత్తది కొనుగోలు చేయాలనుకునే వారు వాహన ధరలో లేదా రోడ్డు పన్నులో 25 శాతం వరకు రాయితీ పొందవచ్చు. అదే వాణిజ్య వాహనాలకు 15 శాతం రాయితీ పొందే వీలుంది.ఫిట్నెస్ లేని, కాలం చెల్లిన వాహనాలను దశలవారీగా తొలగించి వాయు కాలుష్యాన్ని తగ్గించడం, ఆటోమొబైల్ రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ స్క్రాపేజ్ విధానాన్ని తీసుకొచ్చారు. భారతీయ రోడ్లపై గత 15 ఏళ్లగా 5 కోట్ల ప్రైవేట్ మోటారు వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయని అంచనా. దాంతో గణనీయమైన వాయు కాలుష్యం ఏర్పడుతోంది. కాలంచెల్లిన ఈ వాహనాలను తుక్కుగా మార్చాల్సి ఉంటుంది. వాహనదారులు తిరిగి కొత్తవాటిని కొనుగోలు చేసేలా వారికి ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు.తుక్కుగా మార్చిన వాహనం విలువలో 10-25శాతం కొత్త వాహన ధరల్లో లేదా రోడ్డు పన్ను చెల్లింపులో రాయితీ ఇస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది. వాణిజ్య, ప్రైవేట్ వాహనాలకు వేర్వేరు కాలాలు నిర్ణయించారు. ప్రభుత్వ వెహికల్ స్క్రాపింగ్ విధానం ప్రకారం.. పెట్రోల్ లేదా డీజిల్ ఇంధనంతో నడిచే వ్యక్తిగత వాహనాలను 15 ఏళ్ల తర్వాత మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తిరిగి రెన్యువల్ అయిన తర్వాత 5 ఏళ్లు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. 20 ఏళ్ల తర్వాత వాహనాన్ని వినియోగించాలనుకుంటే ప్రతి ఐదేళ్లకు ఒకసారి తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలి. ఇదీ చదవండి: అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!దిల్లీ-ఎన్సీఆర్కు ఈ నిబంధనల్లో మార్పులున్నాయి. అక్కడ పెట్రోల్ వాహనాలకు గరిష్ట వయోపరిమితి 15 ఏళ్లు కాగా, డీజిల్ వాహనాలకు గరిష్ట వయోపరిమితి 10 ఏళ్లు. దిల్లీ రోడ్లపై పరిమితికి మించి పాత కారు కనిపిస్తే రూ.10,000 చెల్లించాల్సి ఉంటుంది. దాంతోపాటు ఆ వాహనాన్ని నేరుగా స్క్రాపింగ్ కోసం పంపించాలి. -
‘తృణమూల్’ మేనిఫెస్టో రిలీజ్.. కీలక హామీలివే..
కలకత్తా: లోక్‌సభ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మేనిఫెస్టో విడుదల చేసింది. మేనిఫెస్టోలో టీఎంసీ పశ్చిమబెంగాల్ ప్రజలకు 10 హామీలిచ్చింది. బీజేపీ ప్రధాన హామీలైన సీఏఏ, యూనిఫామ్ సివిల్ కోడ్లతో పాటు ఎన్ఆర్సీలను బెంగాల్లో అమలు చేయబోమని మేనిఫెస్టోలో తెలిపింది. పేద కుటుంబాలకు ఉచితంగా ఏడాదికి 10 వంట గ్యాస్ సిలిండర్లు, పేద కుటుంబాలకు ఉచిత ఇల్లు, రేషన్‌కార్డుదారులకు ఇంటి వద్దే రేషన్, పెట్రోలియం ఉత్పత్తుల ధరల స్థిరీకరణకు ప్రత్యేక ఫండ్ ఏర్పాటు లాంటి హామీలు టీఎంసీ మేనిఫెస్టోలో ఉన్నాయి. మేనిఫెస్టో విడుదల సమయంలో టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ అస్సాంలో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సీఏఏ, ఎన్ఆర్సీలను రద్దు చేస్తాం. మళ్లీ నరేంద్రమోదీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం, ఎన్నికలు ఉండవు. ఇంత ప్రమాదకర ఎన్నికలను నేనుఎప్పుడూ చూడలేదు. బీజేపీ దేశం మొత్తాన్ని డిటెన్షన్ క్యాంపుగా మార్చేసింది’అన్నారు. కాగా, బెంగాల్లో ఏప్రిల్ 19న తొలి దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇదీ చదవండి.. బీజేపీ 150 సీట్లకే పరిమితం.. రాహుల్ -
Zee-Sony Merger Deal: సోనీతో విలీన డీల్‌కు కట్టుబడి ఉన్నాం
న్యూఢిల్లీ: సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియాతో (ప్రస్తుతం కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ – సీఎంఈపీఎల్) విలీన డీల్‌కు కట్టుబడి ఉన్నామని జీ ఎంటర్టైన్మెంట్ (జీల్) స్పష్టం చేసింది. ఈ ఒప్పందాన్ని విజయవంతంగా పూర్తి చేసుకునేందుకు కృషి చేస్తున్నామని స్టాక్ ఎక్సే్చంజీలకు తెలిపింది. విలీన సంస్థకు జీల్ సీఈవో పునీత్ గోయెంకా సారథ్యం వహించడం ఇష్టం లేని కారణంగా సోనీ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనే యోచనలో ఉన్నట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో జీల్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. జీల్‌తో తమ భారత విభాగం సీఎంఈపీఎల్ను విలీనం చేసేందుకు జపాన్‌కు చెందిన సోనీ గ్రూప్ రెండేళ్ల క్రితం డీల్ కుదుర్చుకుంది. అప్పట్నుంచి వివిధ కారణాలతో అది వాయిదా పడుతూ వస్తోంది. జీల్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర, ఆయన తనయుడైన గోయెంకా .. కంపెనీ నిధులను మళ్లించారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. దీనిపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విచారణ జరిపింది. గోయెంకాను ఏ లిస్టెడ్ కంపెనీ బోర్డులో చేరరాదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై అప్పిలేట్ న్యాయస్థానంలో ఆయనకు ఊరట లభించింది. అయితే, ఈ మొత్తం వ్యవహారాన్ని కార్పొరేట్ గవర్నెన్స్ వైఫల్యంగా భావిస్తున్న సోనీ.. విలీన సంస్థకు గోయెంకాను సీఈవోగా చేసేందుకు ఇష్టపడటం లేదని, ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని భావిస్తోందని వార్తలు వచ్చాయి. ఒప్పందం పూర్తి కావడానికి జనవరి 20 వరకు గడువు ఉండటంతో ఏం జరగనుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
వెహికల్ స్క్రాపింగ్, మరో యూనిట్ ప్రారంభించిన టాటా మోటార్స్
ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ యూనిట్‌ను చండీగడ్‌లో ప్రారంభించింది. ఇప్పటికే టాటా జైపూర్, భువనేశ్వర్, సూరత్‌లో స్క్రాపింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. తాజాగాచండీగడ్లో ప్రారంభించిన ఈ స్క్రాపింగ్ యూనిట్లో ఏడాదికి 12,000 వాహనాల్ని చెత్తగా మార్చనుంది. దేశంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు, అన్‌ఫిట్‌గా ఉన్న వాహనాలను తీసివేసేందుకు కేంద్రం స్క్రాపింగ్ పాలసీని తీసుకువచ్చింది. ఈ స్క్రాపింగ్ పాలసీ ప్రకారం.. ఎవరైనా తమ వాహనాలను తుక్కుకు ఇస్తే.. వారికి ప్రోత్సహాకాలు ఇస్తామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రకటించినట్లుగా ఈ ఏడాది నుంచి కేంద్రం స్క్రాపింగ్ పాలసీ సైతం అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా పాత వాహనాల్ని తుక్కుగా మార్చేందుకు కేంద్రం 72 కంపెనీలకు అనుమతి ఇస్తే వాటిల్లో 38 సంస్థలు కార్యకలాపాల్ని ప్రారంభించాయి. స్క్రాపింగ్ పాలసీతో పాత వాహనాల్ని తుక్కుగా మార్చి.. వాటి నుంచి వచ్చే ఇనుము, అల్యూమినియం, రబ్బర్, ప్లాస్టిక్ కేబుల్స్‌తో మళ్లీ వినియోగించగలిగితే .. కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. ఆటోమొబైల్ సంస్థలు గతంలో ఒక కారును తయారు చేసేందుకు రోజులు పాటు శ్రమించేవి. టెక్నాలజీ కారణంగా ఆ సమయం కాస్త గంటలకు (35)తగ్గింది. ఇప్పుడీ ఈ స్క్రాపింగ్ పాలసీలో పాత కారుని తుక్కుగా మార్చేందుకు 3గంటల సమయం పడుతుంది. -
దేశంలో వెహికల్ స్క్రాపింగ్ పాలసీ..ఆచరణ సాధ్యమేనా?
దేశంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు, అన్‌ఫిట్‌గా ఉన్న వాహనాలను తీసివేసేందుకు కేంద్రం స్క్రాపింగ్ పాలసీని తీసుకువచ్చింది. ఈ స్క్రాపింగ్ పాలసీ ప్రకారం.. ఎవరైనా తమ వాహనాలను తుక్కుకు ఇస్తే.. వారికి ప్రోత్సహాకాలు ఇస్తామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రకటించినట్లుగా ఈ ఏడాది నుంచి కేంద్రం స్క్రాపింగ్ పాలసీ సైతం అమల్లోకి తెచ్చింది. మరి దీనివల్ల కలిగే లాభాలేంటి? పాత వాహనాల్ని తుక్కుగా మార్చేందుకు కేంద్రం 72 కంపెనీలకు అనుమతి ఇస్తే వాటిల్లో 38 సంస్థలు కార్యకలాపాల్ని ప్రారంభించాయి. స్క్రాపింగ్ పాలసీతో పాత వాహనాల్ని తుక్కుగా మార్చి.. వాటి నుంచి వచ్చే ఇనుము, అల్యూమినియం, రబ్బర్, ప్లాస్టిక్ కేబుల్స్‌తో మళ్లీ వినియోగించగలిగితే .. కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. ఆటోమొబైల్ సంస్థలు గతంలో ఒక కారును తయారు చేసేందుకు రోజులు పాటు శ్రమించేవి. టెక్నాలజీ కారణంగా ఆ సమయం కాస్త గంటలకు (35) తగ్గింది. ఇప్పుడీ ఈ స్క్రాపింగ్ పాలసీలో పాత కారుని తుక్కుగా మార్చేందుకు 3గంటల సమయం పడుతుంది. అయితే, యజమానులు తమ వద్ద ఉన్న పాత వాహనాల్ని ఈ స్క్రాపింగ్‌కి ఇస్తారా? అనేదే ప్రశ్నార్ధకంగా మారింది. ఎందుకంటే ఆటోమొబైల్ పరిశ్రమ నివేదికల ప్రకారం.. అనధికారికంగా దేశంలో 90కి పైగా పాత వాహనాలున్నాయి. ఇవి కాకుండా ఇళ్లల్లో, గ్యారేజీలలో మూలుగుతున్న వాహనాల సంఖ్య లక్ష నుంచి కోట్లలో ఉండొచ్చనేది అంచనా. -
వాహన స్క్రాపేజీ పాలసీ: కంపెనీలకు నితిన్ గడ్కరీ కీలక సూచనలు
న్యూఢిల్లీ: కాలం చెల్లిన పాత వాహనాలను తుక్కుగా మార్చే (వాహన స్క్రాపేజీ) విధానానికి మద్దుతగా నిలవాలని ఆటోమొబైల్ పరిశ్రమ, భాగస్వాములు అందరికీ కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. ఇది అందరి విజయానికి దారితీసే విధానమని పేర్కొన్నారు. పరిశ్రమ భాగస్వాములతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. 15-20 ఏళ్ల జీవిత కాలం ముగిసిన వాహనాలను తొలగించి, కొత్త వాటి కొనుగోలును ప్రోత్సహించడమే ఈ విధానం లక్ష్యమని తెలిపారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన రహదారుల నిర్మాణం, వాహనాల విద్యుదీకరణ, వాహనాల ఫిట్నెస్ టెస్టింగ్‌ను తప్పనిసరి చేయడం తదితర చర్యలతో వాహనాలకు స్థిరమైన బలమైన డిమాండ్‌ను నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్టు గడ్కరీ పేర్కొన్నారు. ఆటోమొబైల్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులు (ఓఈఎంలు) తయారీని పెంచుకోవడం ద్వారా ప్రపంచంలో అతిపెద్ద ఆటోపరిశ్రమగా అవతరించేందుకు కృషి చేయాలని కోరారు. వాహన స్కాప్రేజీతో పరిశ్రమే ఎక్కువ ప్రయోజనం పొందుతుందని గుర్తు చేశారు. కనుక మూడు స్తంభాలను నిర్మించేందుకు పరిశ్రమ ముందుకు రావాలన్నారు. ఆటోమేటెడ్ టెస్టింగ్ కేంద్రాలు, వాహన తుక్కు కేంద్రాల ఏర్పాటుపై పెట్టుబడులు పెట్టాలని పరిశ్రమను కోరారు. నూతన విధానంతో కలిగే ప్రయోజనాలపై పౌరుల్లో అవగాహన పెంచేందుకు తమ డీలర్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. వాహనాన్ని తుక్కుగా మార్చుకునేందుకు ముందుకు వచ్చే వినియోగదారులకు డిస్కౌంట్ ఇవ్వాలని కోరారు. -
దేశీయ దిగ్గజం కొత్త స్క్రాపింగ్ ప్లాంట్ - ఏడాదికి 15,000 వాహనాలు తుక్కు.. తుక్కు!
దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) భారతదేశంలో తన మూడవ రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (RVSF) ప్రారంభించింది. గుజరాత్ సూరత్‌లో ప్రారంభమైన ఈ ఫెసిలిటీ పేరు Re.Wi.Re Recycle with Respect. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా మోటార్స్ ఇప్పటికీ ఈ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీలను భువనేశ్వర్, జైపూర్ ప్రాంతాల్లో ప్రారంభించింది. కాగా ఇప్పుడు తన మూడవ ఫెసిలిటీని సూరత్‌లో ఏర్పాటు చేసింది. ఇందులో ప్రతి ఏటా 15,000 వాహనాలను స్క్రాప్ చేయడానికి అనుకూలంగా నిర్మించారు. ఆర్విఎస్ఎఫ్ని టాటా మోటార్స్ భాగస్వామి శ్రీ అంబికా ఆటో అన్ని నిర్వహించనుంది. ఇందులో భాగంగానే దాదాపు అన్ని బ్రాండ్లకు సంబంధించిన ఎండ్ ఆఫ్ లైఫ్ ప్యాసింజర్, కమర్షియల్ వాహనాలను స్క్రాప్ చేస్తుంది. ఈ సందర్భంగా టాటా మోటార్స్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బాలాజీ మాట్లాడుతూ.. Re.Wi.Re లాంచ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. సూరత్‌లో ఈ ఫెసిలిటీ రానున్న రోజుల్లో మరింత వృద్ధి చెందుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: భారత్ మీదే ఆశలన్నీ.. జర్మన్, జపనీస్ కంపెనీల తీరిది! నిజానికి పాత వస్తువులు కాలుష్య కారకాలుగా మారతాయి. వీటిని తుక్కు కింద మార్చి మళ్ళీ రీ-సైకిల్ పద్దతిలో ఉపయోగిస్తారు. ఈ విధానంలో పనికిరాని వస్తువులు మళ్ళీ ఉపయోగించడానికి అనుకూలంగా మారతాయి. స్క్రాపింగ్ పాలసీ కింద 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న కమర్షియల్ వాహనాలు & 20 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వాహనాలు తుక్కు చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా పర్యావరణంలో కాలుష్యాన్ని తగ్గించవచ్చు. -
వాహన డీలర్లకు కీలక ఆదేశాలు.. ఇక ఆ సౌకర్యం కూడా..
దేశంలోని వాహన డీలర్లకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆటోమొబైల్స్ డీలర్లు కూడా వాహనాల స్క్రాపింగ్ సౌకర్యాలను తెరవాలని కోరారు. ఐదో ఆటో రిటైల్ కాంక్లేవ్‌ను ఉద్దేశించి గడ్కరీ మాట్లాడుతూ.. ప్రభుత్వం సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహిస్తోందని, తదనుగుణంగా వాహన స్క్రాపింగ్ సౌకర్యాలను ప్రారంభించడానికి ప్రభుత్వం డీలర్లకు అనుమతి ఇస్తుందని పేర్కొన్నారు. భారత్ ప్రత్యామ్నాయ, జీవ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోందని, దేశాన్ని గ్రీన్ హైడ్రోజన్‌లో అతిపెద్ద తయారీదారుగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని, భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో ఆటో డీలర్లు ముఖ్యమైన పాత్ర పోషించాలని గడ్కరీ పిలుపునిచ్చారు. ప్యాసింజర్ వాహనాల తయారీలో నాలుగో స్థానంలో, వాణిజ్య వాహనాల తయారీలో ఆరో స్థానంలో ఉన్న భారత్‌ను ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆటోమొబైల్ హబ్‌గా మార్చడమే తన కల అని గడ్కరీ పేర్కొన్నారు. -
తుక్కు డబ్బుల గొడవతోనే గుర్తు తెలియని వ్యక్తి హత్య
శంషాబాద్: తుక్కు సామాన్లు విక్రయించిన డబ్బుల పంపకంలో జరిగిన గొడవే కొత్తూరులో చోటు చేసుకున్న గుర్తు తెలియని వ్యక్తి(55) హత్యకు కారణంగా తేలింది. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి సోమవారం కేసు వివరాలు వెల్లడించారు. కర్నాటక రాష్ట్రం, రాయచూర్‌కు చెందిన తెలుగు నాగప్ప ఇరవై రోజుల కిందట కాచిగూడకు వచ్చి అక్కడే నివాసముంటున్నాడు. ఇనుప సామాన్లు, తక్కు ఏరుకుని వాటిని విక్రయించేవాడు. ఈ నెల 23న రాత్రి అతడికి కొత్తూరులో గుర్తు తెలియని వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి చేగూరు సమీపంలోని స్క్రాప్ దుకాణంలో తాము సేకరించిన తుక్కును విక్రయించారు. డబ్బుల పంపకం విషయంలో ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. అప్పటికే ఇద్దరు మద్యం మత్తులో ఉన్నారు. గుర్తు తెలియని వ్యక్తి నాగప్పను కట్టెతో కొట్టడమేగాక డబ్బులు అడిగితే చంపేస్తానని బెదిరించాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత కొత్తూరు సమీపంలోని మెగాఫ్లోర్ మిల్ వద్ద అతను మరోమారు నాగప్పపై కర్రతో దాడి చేశాడు. దీంతో ఆగ్రహానికి లోనైన నాగప్ప అతడి వద్ద ఉన్న కర్ర లాక్కుని చితకబాదాడు. అనంతరం తలపై రాయితో మోదడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శంషాబాద్ ఏసీపీ భాస్కర్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు ఆదివారం రాత్రి శంషాబాద్ పాలమాకుల వద్ద అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా మృతుడి వివరాలు గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
ఇక వాహనాల తుక్కు యూనిట్లు
సాక్షి, అమరావతి: కాలం చెల్లిన వాహనాలకు సెలవు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వాహనాల తుక్కు విధానం’ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. అందుకోసం జిల్లాస్థాయిలో ‘వెహికల్ స్క్రాపింగ్ యూనిట్లు’ నెలకొల్పనుంది. దాంతోపాటు ప్రైవేట్ రంగంలోనూ వెహికల్ స్క్రాపింగ్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహించాలని తాజాగా నిర్ణయించింది. అందుకోసం ఔత్సాహిక వ్యాపారులకు అనుమతులు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. కేంద్ర విధానం ప్రకారం 15 ఏళ్ల జీవిత కాలం దాటిన వాణిజ్య వాహనాలు, 20 ఏళ్ల జీవిత కాలం దాటిన వ్యక్తిగత వాహనాలను తుక్కుగా మార్చాల్సి ఉంది. ఈ ఏడాది నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం స్పష్టంగా నిర్దేశించింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగంలో వాహనాల స్క్రాపింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ రిజిస్టర్ అథారిటీగా నిర్ణయించారు. అంటే స్క్రాపింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అనుమతులు మంజూరు చేసే అధికారం రవాణా శాఖ కమిషనర్‌కు అప్పగించారు. ఇక అప్పిలేట్ అథారిటీగా రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వ్యవహరిస్తారు. రవాణా శాఖ కమిషనర్ దరఖాస్తును తిరస్కరిస్తే ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించేందుకు అప్పిలేట్ అథారిటీని సంప్రదించవచ్చు. కాల పరిమితి దాటిన వాహనాలు 2 లక్షలు రాష్ట్రంలో దాదాపు 1.50 కోట్ల వాహనాలు ఉన్నాయి. వాటిలో 1.20 కోట్లు వ్యక్తిగతవి కాగా.. 30 లక్షలు వాణిజ్య వాహనాలు. 15 ఏళ్లు జీవిత కాలం దాటిన వాణిజ్య వాహనాలు, 20 ఏళ్ల జీవిత కాలం దాటిన వ్యక్తిగత వాహనాలు కలిపి దాదాపు 2 లక్షల వాహనాలు ఉంటాయని అంచనా. వాటిని తుక్కుగా మార్చాల్సి ఉందని గుర్తించారు. తరువాత ఏటా జీవిత కాలం ముగిసే వాహనాలను తుక్కు కింద మారుస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ వాహనాల్లోనే దాదాపు 3,500 వాహనాలకు జీవితకాలం ముగిసిందని ఇటీవల నిర్ధారించారు. మొదట ఆ వాహనాలను తుక్కుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం అన్ని శాఖలకు త్వరలోనే ఆదేశాలు జారీ చేయనుంది. జిల్లాకు రెండు యూనిట్లు జిల్లాకు కనీసం రెండు చొప్పున వెహికల్ స్క్రాపింగ్ యూనిట్లు నెలకొల్పాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అందుకు తగిన స్థలం, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే ఔత్సాహికులను ప్రోత్సహిస్తారు. వాహనాల ఫిట్నెస్ను పూర్తిగా కంప్యూటర్ ఆధారంగా నిర్ధారించేందుకు ఆటోమేటెడ్ వెహికిల్ చెకింగ్ యూనిట్లను నెలకొల్పాలి. అలా వాహనాల ఫిట్నెస్ను నిర్ధారించి సర్టిఫికెట్లు జారీ చేస్తారు. మరమ్మతులు, రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసేందుకు కూడా పనికిరావు అని నిర్ధారించే వాహనాలను తుక్కు కింద మార్చాల్సి ఉంది. వాటితోపాటు జీవితకాలం పూర్తయిన వాహనాలను కూడా యజమానులు తుక్కు కింద మార్చవచ్చు. తుక్కు కింద ఇచ్చే కార్లు, బస్సులు, లారీలు, ఆటోలకు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు సాŠక్రపింగ్ యూనిట్లు చెల్లిస్తాయి. స్క్రాపింగ్ యూనిట్లు జారీ చేసే సర్టిఫికెట్‌ను సమర్పిస్తే కొత్త వాహనం కొనుగోలుపై వాహనాల కంపెనీలు డిస్కౌంట్లు ఇస్తాయి. ఆ మేరకు వాహన తయారీ కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. స్క్రాపింగ్ యూనిట్లలో వాహనాల తుక్కును ఆ కంపెనీలకు విక్రయిస్తారు. స్క్రాపింగ్ సర్టిఫికెట్ సమర్పిస్తే కొత్త వాహనాల కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం పన్ను రాయితీ ఇస్తుంది. దాంతో కాలం చెల్లిన వాహనాలను తుక్కు కింద మార్చి, కొత్త వాహనాల కొనుగోలుకు ప్రోత్సాహం లభిస్తుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. రోడ్లపై తిరుగుతున్న కాలం చెల్లిన వాహనాలపై రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటారు. ఆ వాహనాల యజమానులపై జరిమానాలు విధిస్తారు. దాంతో కాలుష్య నియంత్రణ సాధ్యమవడంతోపాటు రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని రవాణా శాఖ భావిస్తోంది. -
బండి స్క్రాప్ కింద అమ్మేశారా? ఈ విషయం తెలుసుకోండి.. వారికి తెలపండి
వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక డ్రైవర్ కారు కొనుగోలు చేశాడు. కొంతకాలం తరువాత స్క్రాప్ కింద విక్రయించేశాడు. కానీ రవాణాశాఖ అధికారులు పన్ను చెల్లించాలని నోటీసు ఇచ్చారు. హడావిడిగా రవాణాశాఖ అధికారులను కలిసి కారును స్క్రాప్ కింద విక్రయించేశానని.. అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఆ విషయాన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉందని అధికారులు బదులిచ్చారు. ఆఖరికి నాలుగు త్రైమాసికాలు పన్నులు చెల్లించాడు. ఇలా చాలా మంది ఇబ్బంది పడుతుండటారు. దీనిపై అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కడప వైఎస్ఆర్ సర్కిల్ : నూతన వాహనం కొనుగోలు చేసే సమయంలో ధ్రువీకరణ పత్రాలు సరి చూసుకోవటమే కాదు.. వాహనాన్ని తీసేసినా.. స్క్రాప్ కింద వేసినా.. ఇతరులకు విక్రయించినా ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు తీసుకెళ్లినా అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిందే. జిల్లాలో 5 లక్షల 680 వాహనాలు ఉన్నాయి. వాటిలో లారీలు 21,771, మ్యాక్సీ క్యాబ్‌లు 1320, మోటారు క్యాబ్‌లు 3160, కమర్షియల్ ట్రాక్టర్లు 19,311, ఆటోలు 29,135, స్కూలు బస్సులు 1461తోపాటు ఇతరత్రా ట్రాన్స్‌పోర్టు వాహనాలు ఉన్నాయి. వాటిలో అనేక సంవత్సరాలుగా త్రైమాసిక పన్ను బకాయిలు ఉన్నారు. అధికారుల గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 8061 వాహనాలు పన్నులు చెల్లించనవిగా గుర్తించారు. అయితే ఇప్పటికే సదరు వాహన యజమానులకు నోటీసులు జారీ చేయడంతోపాటు నిత్యం పన్ను చెల్లించాలని సమాచారం అందజేస్తున్నారు. లేని వాహనాలు ఎన్నో.. జిల్లాలో త్రైమాసిక పన్నులు చెల్లించాల్సిన వాహనాలు 2061 ఉండగా, వాటిలో అనేక వాహనాలు లేనే లేవని అధికారులు గుర్తించారు. వేలాది వాహనాలు ప్రమాదాలకు గురైనవి, వదిలివేయడం, కాలం చెల్లిన వాహనాలను స్క్రాబ్ వేయడం, ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు తీసుకెళ్లిన వాహనాల గురించి పట్టించుకోకపోవడం, విక్రయించిన వాహనాల గురించి సమాచారం ఇవ్వకపోవడం వంటివి ప్రధానంగా గుర్తించారు. 8061 వాహ నాల్లో సుమారు 2000–3000 వాహనాలు స్క్రాబ్తోపాటు ఇతర అంశాలలో సంబంధిత యజమానుల వద్ద లేనట్లు, గుర్తించినట్లు సమాచారం. పన్ను పడుతూనే ఉంది.. వాహనాలకు సంబంధించి యజమానుల వద్ద వాహనం లేనప్పటికీ త్రైమాసిక పన్నులు మాత్రం పడుతూనే ఉంటాయని అఽధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో వాహనదారులు వాహనాలను స్క్రాబ్ వేసినా, ఇతరత్రా అంశాల్లో కోల్పోయినా, కనీసం అధికారులకు సమాచారం ఇవ్వకపోవడంతో వాటికి పన్నులు పడుతూనే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు వాహనాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. వాహనాన్ని స్క్రాబ్ కింద తీసివేసినా, ఫైనాన్స్ వారు తీసుకుపోయినా, ప్రమాదం జరిగి ఎక్కడైనా వాహనం నిలిచిపోయినా తప్పనిసరిగా తెలియజేయాల్సిన అవసరం ఉందని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే అధికం వాహనాలను తీసివేయడం, ఫైనాన్స్ సంస్థల వారు తీసుకెళ్లడం వంటివి గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉన్నాయి. వాటికి సంబంధించి యజమానులు దరఖాస్తు చేసుకోకపోవడం వల్ల పన్నులు పెరిగిపోతున్నాయని అధికారులు గుర్తించారు. స్క్రాబ్ చేసిన వాహనానికి సంబంధించి ఛాయిస్ నెంబర్లు దుర్వినియోగానికి పాల్పడితే దానికి సంంధించిన వాహన యజమానే బాధ్యత వహించాల్సి ఉంటుందని రవాణాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే క్రమంలో వాహనం స్క్రాబ్ వేసినట్లు దరఖాస్తు చేసుకుని రోడ్డుపై తిరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని, వాహనాన్ని సీజ్ చేయడంతోపాటు కేసులు నమోదుకు అవకాశం ఉందని చెబుతున్నారు. వాహన యజమానులు ఈ విషయాన్ని గుర్తించి వాహనాన్ని తీసివేసినా, ఫైనాన్షియర్లు తీసుకెళ్లినా, ఇతరత్రా అంశాలు జరిగితే దరఖాస్తు చేసుకోవడంతోపాటు అధికారుల దృష్టికి తీసుకు రావాలని సూచిస్తున్నారు. దరఖాస్తు చేసుకోవాలి వాహనాన్ని తీసివేసినా, స్క్రాబ్‌కు వేసినా, ఫైనాన్షియర్లు తీసుకెళ్లినా ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవడంతోపాటు అఽధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ట్రాన్స్‌పోర్టు వాహనాలైతే వాహనాలు మన దగ్గర లేకపోయినప్పటికీ త్రైమాసిక పన్నులు, ఆపైగా జరిమానాలు పడుతూనే ఉంటాయని యజమానులు గ్రహించాలి. స్క్రాబ్‌కు వేసినప్పటికీ ఛాయిస్ నెంబర్లు దుర్వినియోగం పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. యజమానులు గుర్తించి వాహనాల విషయంగా తగు జాగ్రత్తలు తీసుకుని నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకోవాలి. – ఇ.మీరప్రసాద్, జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్, కడప -
కొడుకు కష్టం చూడలేక.. తుక్కుతో ఎలక్ట్రిక్ బైక్ తయారు చేసిన తండ్రి
అతనో మధ్య తరగతి వ్యక్తి. రోజంతా కష్టపడితే గానీ బతుకు బండి ముందుకు సాగదు. తన కొడుకు రోజూ సుదూరం నడిస్తే గానీ కాలేజ్‌కి వెళ్లలేని పరిస్థితి. కొడుకుకి కొత్త బైక్ కొనిద్దామంటే తన స్థోమత సరిపోదు.. అలా అని చూస్తూ ఉండలేకపోయాడు ఆ తండ్రి. అందుకే ఆ వ్యక్తి స్వయంగా ఎలక్ట్రిక్ బైక్ తయారు చేసి తన కొడుకుకు బహుమతిగా ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని కరంజా పట్టణానికి చెందిన రహీమ్‌ఖాన్ చిన్న కొడుకు షఫిన్ఖాన్ ఇంటికి దూరంగా ఉన్న కాలేజీకి నడుస్తూ వెళ్లేవాడు. ఈ క్రమంలో అతను ఇంటి నుంచి కాలేజ్ వెళ్లి రావడం కష్టంగా ఉందంటూ తన తండ్రి వద్ద మొరపెట్టుకున్నారు. తన స్నేహితులకు ఉన్నట్లు తనకీ ఓ బైక్ ఉంటే బాగేండేదని తండ్రికి చెప్పుకున్నాడు. అయితే ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ రహీమ్‌ఖాన్ తన ఇంట్లోనే చిన్న దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. అతని ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. దీంతో రహీమ్‌ఖాన్ తన కొడుకు బాధ చూడలేక ఈ సమస్యకు పరిష్కారంగా.. తానే స్వయంగా ఓ ఎలక్ట్రిక్ బైక్ తయారు చేయాలని అనుకున్నాడు. స్వతహాగా అతను ఎలక్ట్రిషియన్ కావడంతో ఈ పని కాస్త సులువు అయ్యింది. రహీమ్ బైక్ తయారీకి ఉపయోగించిన దాదాపు అన్ని పదార్థాలు స్క్రాప్ డీలర్ల నుంచి తెచ్చుకున్నావే. పైగా చాలా వరకు మార్కెట్లో తక్కువ ధరకు దొరికే వస్తువులతో ఈ బైక్‌ని తయారు చేశాడు. దీన్ని తయారీకి అతనికి 2 నెలలు సమయం పట్టగా.. దాదాపు 20,000 రూపాయలు ఖర్చు అయ్యింది. ఇంట్లో తయారు చేసిన ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒకసారి ఛార్జ్ చేస్తే 25 కి.మీల వరకు ప్రయాణించవచ్చు. అత్యధికంగా 60 కిలోల వరకు బరువును ఈ బైక్ మోయగలదు. ఈ బైక్ వేగం, బరువు మోసే సామర్థ్యాన్ని పెంచడానికి మరింత శక్తివంతమైన బ్యాటరీ, మోటారును అమర్చాలని యోచిస్తున్నట్లు రహీమ్ చెప్పారు. ప్రస్తుతం షఫిన్ ఖాన్ రోజూ ఈ అద్భుతమైన ఎలక్ట్రిక్ బైక్‌పై కాలేజీకి వెళ్తున్నాడు. -
వెహికల్ స్క్రాపింగ్‌పై క్లారిటీ వచ్చేసింది.. చూశారా!
భారతదేశంలో కొత్త వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అదే సమయంలో పాత వాహనాల వినియోగం తగ్గుతోంది, దీనివల్ల నిరుపయోగంగా ఉన్న వాహనాల సంఖ్య ఎక్కువవుతోంది. ఇలాంటి వాహనాల వల్ల కాలుష్యం పెరిగే అవకాశం ఉంది. దేశంలో కాలుష్య తీవ్రతను తగ్గించడానికి కొంతకాలం క్రితమే స్క్రాప్ విధానాన్ని అమలులోకి వచ్చింది. వెహికల్ స్క్రాపేజ్ విధానంలో వాహనాలను స్క్రాప్ చేయడానికి ఎటువంటి వయోపరిమితిని నిర్దేశించలేదని, 10 సంవత్సరాల వినియోగం తర్వాత వ్యవసాయ ట్రాక్టర్లను విస్మరిస్తున్నట్లు వచ్చిన నివేదికలు నిరాధారమైనవని, రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. అంతే కాకుండా రిజిస్ట్రేషన్ వ్యవధి 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, మళ్ళీ ఒకేసారి ఐదేళ్లపాటు మళ్ళీ పునరుద్ధరించుకోవచ్చు ప్రస్తావించింది. పది సంవత్సరాల తరువాత వినియోగంలో ఉన్న ట్రాక్టర్లను తప్పనిసరిగా స్క్రాపింగ్ చేయడం గురించి ట్విటర్, వాట్సాప్‌తో సహా కొన్ని సోషల్ మీడియాలో వెల్లడవుతున్న వార్తలు నిజం కాదని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. భయాందోళనలు సృష్టించేందుకు ఎవరైనా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. (ఇదీ చదవండి: కియా నుంచి నాలుగు కొత్త కార్లు: సిఎన్జి, 5 సీటర్ ఇంకా..) కొన్ని ప్రభుత్వ వాహనాలకు కాకుండా ఇతర ఏ వాహనాలకు నిర్ణీత వయోపరిమితిని భారత ప్రభుత్వం నిర్ణయించలేదు, MoRTH వాలంటరీ వెహికల్ ఫ్లీట్ ఆధునీకరణ కార్యక్రమం లేదా వాహన స్క్రాపింగ్ విధానాన్ని రూపొందించింది, దీని ప్రకారం రవాణాకు పనికి రాకుండా ఉండే వాహనాలను స్క్రాప్ చేయవచ్చు. ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ద్వారా పరీక్షించిన తర్వాత వాహనం ఫిట్‌గా ఉన్నంత వరకు రోడ్డుపై నడపవచ్చని నివేదికలు చెబుతున్నాయి. -
ప్రపంచ ఆటో తయారీ హబ్‌గా భారత్
న్యూఢిల్లీ: భారత్‌ను ప్రపంచ ఆటో తయారీ కేంద్రం(హబ్)గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా వెల్లడించారు. సమీప భవిష్యత్‌లో దేశీ ఆటో పరిశ్రమ విలువ రూ. 15 లక్షల కోట్లకు చేరే అంచనాలున్నట్లు తెలియజేశారు. జైపూర్‌లో ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ ఏర్పాటు చేసిన వాహనాలను తుక్కుగా మార్చే(స్క్రాపింగ్) ప్లాంటును వర్చువల్‌గా ప్రారంభించిన గడ్కరీ ప్రస్తుతం ఆటో పరిశ్రమ దేశ జీడీపీలో 7.1 శాతం వాటాను సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు. రూ. 7.8 లక్షల కోట్ల పరిమాణంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలియజేశారు. 2025కల్లా ఈ సంఖ్య 5 కోట్లను తాకనున్నట్లు అభిప్రాయపడ్డారు. జైపూర్‌లో టాటా మోటార్స్ వార్షికంగా 15,000 వాహన స్క్రాపింగ్ సామర్థ్యంతో తొలిసారి రిజిస్టర్డ్ ప్లాంటును ఏర్పాటు చేసింది. రూ. 15 లక్షల కోట్లకు..: గ్లోబల్ ఆటో తయారీ కేంద్రంగా భారత్‌ను నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నట్లు గడ్కరీ పేర్కొన్నారు. సమీప కాలంలో పరిశ్రమ పరిమాణాన్ని రూ. 15 లక్షల కోట్లకు చేర్చనున్నట్లు చెప్పారు. పాత, పనికిరాని వాహనాలను తొలగించడం ద్వారా స్క్రాపేజ్ పాలసీ దశలవారీగా పర్యావరణ అనుకూల కొత్త వాహనాలకు దారి చూపుతుందని వివరించారు. తుక్కుగా మార్చే తాజా విధానాల వల్ల వాహన డిమాండు ఊపందుకుంటుందని, రూ. 40,000 కోట్ల ఆదనపు జీఎస్టీ ఆదాయానికి వీలుంటుందని తెలిపారు. -
భారతదేశంలో మొదటి టాటా వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ.. ఇదే!
భారతీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ భారతదేశంలో తన మొదటి 'రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ' (RVSF)ని రాజస్థాన్‌లోని జైపూర్‌లో ప్రారంభించింది. దీనిని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి 'నితిన్ గడ్కరీ' ప్రారంభించారు. టాటా మోటార్స్ ప్రారంభించిన ఈ ఆధునిక సదుపాయంతో సంవత్సరానికి 15,000 వాహనాలను స్క్రాప్ చేయవచ్చు. ఇందులో ప్యాసింజర్ వాహనాలు, కమర్షియల్ వాహనాలను స్క్రాప్ చేయవచ్చు. అంతే కాకుండా పేపర్‌లెస్ కార్యకలాపాల కోసం పూర్తిగా డిజిటలైజ్ చేయబడింది. స్క్రాప్ చేయాల్సిన వెహికల్స్ యొక్క టైర్లు, బ్యాటరీలు, ఫ్యూయెల్, ఆయిల్స్ వంటి వాటిని విడదీయడానికి కూడా ఇందులో ప్రత్యేకమైన స్టేషన్స్ ఉన్నాయి. ఇందులో వెహికల్ స్క్రాపింగ్‌కి అయ్యే ఖర్చులను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు, అంతే కాకుండా ఇది ఎప్పుడు అమలులోకి వస్తుందనేది కూడా ప్రకటించలేదు. టాటా వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ ప్రారంభ సమయంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి దశలవారీగా స్క్రాపేజ్ విధానం ఉపయోగపడుతుంది. ఇలాంటి సదుపాయాలను ఏర్పాటు చేసిన టాటా మోటార్స్‌ని అభినందిస్తున్నానన్నారు. అంతే కాకుండా దక్షిణాసియా ప్రాంతంలో భారతదేశాన్ని వాహన స్క్రాపింగ్ హబ్‌గా మార్చడానికి కృషి చేస్తున్నట్లు, భారతదేశంలో ఇలాంటి అత్యాధునిక స్క్రాపింగ్, రీసైక్లింగ్ యూనిట్లు మరిన్ని అవసరమని గడ్కరీ ఈ సందర్భంగా తెలిపారు. -
20 లక్షల వాహనాలు తుక్కు లోకి!
భువనేశ్వర్: రోడ్లపై రవాణాకు పట్టు కోల్పోయి, 15 ఏళ్లు పైబడిన 20 లక్షలకు పైగా వాహనాలను రద్దు చేయనున్నారు. రాష్ట్ర వాణిజ్య, రవాణాశాఖ మంత్రి టుకుని సాహు అసెంబ్లీలో ఈ విషయాన్ని వెల్లడించారు. రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ పాలసీ–2022 ప్రకారం, వాహన కాలుష్యాన్ని తగ్గించడానికి 20 లక్షలకు పైగా వాహనాలను దశల వారీగా రోడ్ల నుంచి తొలగిస్తామన్నారు. 15 ఏళ్లకు పైగా రవాణాలో ఉపయోగిస్తూ.. పట్టు కోల్పోయిన 20,39,500 వాహనాలను గుర్తించామన్నారు. రద్దు చేయనున్న వాహనాల్లో 12,99,351 ద్విచక్ర వాహనాలు ఉన్నాయని తెలిపారు. దీనికి సంబంధించి స్క్రాపింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. డొక్కు వాహనాలు రద్దు చేయడంతో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం స్క్రాపింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. పాలసీ మార్గదర్శకాల ప్రకారం పాత వాహనాల యజమానులు కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రోత్సాహకాలు కూడా పొందుతారని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. చదవండి వైద్యుల నిర్లక్ష్యం.. ఆస్పత్రి ఎదుటే ప్రసవమైన మహిళ! -
తుక్కు.. తక్కువేం కాదు.. టీఎస్ జెన్కోకు రూ.485 కోట్ల ఆదాయం
సాక్షి , భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో కాలం చెల్లిన, ప్రస్తుతం వినియోగంలో లేని పాత విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను తుక్కు కింద అమ్మేయడం ద్వారా టీఎస్ జెన్కోకు భారీగా ఆదాయం రానుంది. దీంతో పాటు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా స్థల లభ్యత పెరగనుంది. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో దేశ పారిశ్రామిక, గృహ అవసరాలను దృష్టిలో ఉంచుకుని థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాలకు అప్పటి ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఈ క్రమంలో 1966 సెప్టెంబర్ 4న పాల్వంచలో తొలి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని 60 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించారు. ఈ ప్లాంటు నిర్మాణానికి జపాన్ సాంకేతిక సహాయం అందించగా రూ.59.29 కోట్లు ఖర్చయింది. ఆ తర్వాత వరుసగా బీ, సీ యూనిట్ల నిర్మాణాన్ని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) సంస్థ చేపట్టింది. మొదటి నాలుగు ప్లాంటు సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించారు. ఈ మూడు ప్లాంట్లను ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్(ఓఅండ్ఎం)గా పేర్కొనేవారు. పాత టెక్నాలజీ కావడంతో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తక్కువ పైగా కాలుష్యం ఎక్కువగా ఉండేది. దీంతో పాత ప్లాంట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తిని క్రమంగా నిలిపేస్తూ వచ్చారు. అలా 2019 ఫిబ్రవరి నుంచి 2020 మార్చి నాటికి ఏ, బీ, సీ యూనిట్ల నుంచి విద్యుత్త్ ఉత్పత్తిని ఆపేశారు. తుక్కుకు రూ.485 కోట్లు కేటీపీఎస్‌లోని ఏ, బీ, సీ స్టేషన్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిన తర్వాత అప్పటి వరకు వినియోగిస్తూ వచ్చిన టర్బైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, కన్వేయర్ బెల్టులు, ఇతర యంత్ర సామగ్రి నిరుపయోగంగా మారాయి. దీంతో వాటిని తుక్కు కింద అమ్మేయాలని జెన్కో నిర్ణయం తీసుకుంది. దీంతో మరో కేంద్ర సంస్థ ఎంఎస్టీసీ రంగంలోకి దిగింది. ఏ, బీ, సీ ప్లాంట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇక్కడ లభించే ఐరన్, కాపర్, ఇతర యంత్ర విడిభాగాల విలువను మదింపు చేసింది. దీన్ని తుక్కు లెక్కన కొనేందుకు టెండర్లను ఆహ్వానించారు. మొత్తం ఐదు కంపెనీలో పోటీ పడగా కేటీపీఎస్‌లోని పాత మూడు ప్లాంట్లను తుక్కు కింద రూ.485 కోట్లకు కొనుగోలు చేసేందుకు ముంబైకి చెందిన హెచ్ఆర్ కమర్షియల్స్ సంస్థ ముందుకొచ్చింది. కేటీపీఎస్ ఓ అండ్ ఎంలో విడి భాగాలను తొలగిస్తున్న సిబ్బంది ముందుగా ‘ఏ’ ప్లాంటు తొలి దశలో ఏ ప్లాంటును పూర్తిగా తొలగించనున్నారు. ఇందుకుగాను హెచ్ఆర్ కమర్షియల్స్ సంస్థ రూ.144 కోట్లు చెల్లించి రంగంలోకి దిగింది. గత నెలలో పనులు ప్రారంభం కాగా, ప్రస్తుతం ప్లాంటులోకి బొగ్గు తీసుకొచ్చే కన్వేయర్ బెల్ట్ తొలగింపు ప్రక్రియ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఎక్కడికక్కడ భారీ కటింగ్ యంత్రాలతో కన్వేయర్ బెల్ట్ లైన్‌ను ముక్కలుగా చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగా పని జరిగే ప్రదేశంలో విద్యుత్ సరఫరా నిలిపేశారు. భారీ నిర్మాణాలను కటింగ్ చేసిన తర్వాత ఇనుము, ఇతర లోహాలను వేరు చేస్తున్నారు. ఇక్కడి నుంచి లారీల ద్వారా తుక్కును తరలిస్తున్నారు. జూన్ వరకు ఏ ప్లాంటు తొలగింపు పనులు సాగనున్నాయి. ఆ తర్వాత వరుసగా బీ, సీ ప్లాంట్లను తొలగిస్తారు. అనంతరం కూలింగ్ టవర్లు, చిమ్నీలను తొలగించాల్సి ఉంటుంది. మొత్తంగా మూడేళ్లలో ఏ, బీ, సీ ప్లాంట్లను పూర్తిగా తొలగించడంతో పాటు నేల మొత్తాన్ని చదును చేసి జెన్కోకు అప్పగించాలనే ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో జెన్కోకు సుమారు 400 ఎకరాల స్థలం లభించనుంది. ఇవి కీలకం.. కేటీపీఎస్ పాత ప్లాంట్లను తొలగించే పనిలో అత్యంత కీలకమైనది వందల మీటర్ల ఎత్తుతో నిర్మించిన చిమ్నీలు, కూలింగ్ టవర్ల తొలగింపు. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ నాలుగు కూలింగ్ టవర్లు, ఒక చిమ్నీని తొలగించాల్సి ఉంటుంది. అయితే జెన్కో విధించిన షరతుల ప్రకారం ఈ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు పేలుడు పదార్థాలను వినియోగించడం నిషిద్ధం. దీంతో బ్లాస్టింగ్ లేకుండా భారీ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అనువుగా ఉన్న మార్గాలపై ఇటు జెన్కో, అటు హెచ్ఆర్ కమర్షియల్స్ సంస్థలు అన్వేషిస్తున్నాయి. ప్రస్తుతానికి మన దేశంలో గతంలో చంద్రాపూర్‌లో ఉన్న పాత విద్యుత్ కేంద్రాన్ని తుక్కు కింద అమ్మేశారు. అక్కడ ఏ విధానం పాటించారనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించనున్నారు. -
Vehicle scrapping policy: డొక్కు బండ్లు తుక్కుకే..
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కర్బన ఉద్గారాల తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. కర్బన ఉద్గారాల విషయంలో ‘కాలం చెల్లిన వాహనాల’ వాటా గణనీయంగానే ఉంది. దేశంలో 4.50 కోట్లకు పైగా పాత వాహనాలు రోడ్లపై తిరుగున్నాయి. కాలుష్యానికి కారణమవుతున్న డొక్కు వాహనాలను రోడ్లపైకి అనుమతించరాదని నిపుణులు తేల్చిచెబుతున్నారు. 2021–22 బడ్జెట్లో ‘వెహికల్ స్క్రాపింగ్ పాలసీ’ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రవాణా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన 9 లక్షలకు పైగా డొక్కు వాహనాలను ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి తుక్కు(స్క్రాప్)గా మార్చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి చెందిన పాత వాహనాలను, పాత అంబులెన్స్‌లను తుక్కుగా మార్చడానికి, వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయడానికి అదనంగా నిధులు సమకూరుస్తామని 2023–24 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పాత వాహనాలను తుక్కుగా మార్చేందుకు అందుబాటులో ఉన్న విధానం ఏమిటో తెలుసుకుందాం.. పాత వాహనాలు అంటే? ► రవాణా వాహనం(సీవీ) రిజిస్ట్రేషన్ గడువు సాధారణంగా 15 సంవత్సరాలు ఉంటుంది. ఈ తర్వాత ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవడంలో విఫలమైతే స్క్రాపింగ్ పాలసీ ప్రకారం ఆ వాహనం రిజిస్ట్రేషన్ రద్దవుతుంది. అప్పుడు దాన్ని తుక్కుగా మార్చేయాల్సిందే. ► ప్యాసింజర్ వాహనాల(పీవీ) రిజిస్ట్రేషన్ గడువు 20 ఏళ్లు. గడువు ముగిశాక వెహికల్ అన్‌ఫిట్ అని తేలినా లేక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను రెన్యువల్ చేసుకోవడంలో విఫలమైనా రిజిస్ట్రేషన్ రద్దవుతుంది. వెహికల్‌ను స్క్రాప్‌గా మార్చాలి. ► 20 ఏళ్లు దాటిన హెవీ కమర్షియల్ వాహనాలకు(హెచ్‌సీవీ) ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లలో ఫిట్‌నెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ► ఇతర కమర్షియల్ వాహనాలకు, వ్యక్తిగత, ప్రైవేట్ వాహనాలకు జూన్ 1 నుంచి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ టెస్టులో ఫెయిలైన వాహనాలను ఎండ్–ఆఫ్–లైఫ్ వెహికల్(ఈఎల్వీ)గా పరిగణిస్తారు. ► ఫిట్నెస్ పరీక్షలో నెగ్గిన వాహనాలపై 10 శాతం నుంచి 15 శాతం దాకా గ్రీన్ ట్యాక్స్ విధిస్తారు. ► రిజిస్ట్రేషన్ అయిన తేదీ నుంచి 15 ఏళ్లు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, మున్సిపల్ కార్పొరేషన్ల, రాష్ట్ర రవాణా సంస్థల, ప్రభుత్వ రంగ సంస్థల, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలకు చెందిన అన్ని వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి, తుక్కుగా మార్చాలని స్క్రాపింగ్ పాలసీ నిర్దేశిస్తోంది. ► ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4.50 కోట్లకు పైగా పాత వాహనాలు రోడ్లపై తిరుగున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వాస్తవానికి వీటన్నింటినీ తుక్కుగా మార్చాలి. ► ప్రతి నగరంలో కనీసం ఒక స్క్రాపింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాహనదారులకు ప్రోత్సాహకాలు ► కాలం చెల్లిన వాహనాన్ని తుక్కుగా మార్చేందుకు ముందుకొచ్చిన వాహనదారులకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఇందుకోసం ఏం చేయాలంటే.. ► తొలుత ఏదైనా రిజిస్టర్డ్ స్క్రాపింగ్ కేంద్రానికి వాహనాన్ని తరలించి, తుక్కుగా మార్చాల్సి ఉంటుంది. ► ఆ వాహనం స్క్రాప్ విలువ ఎంత అనేది స్క్రాపింగ్ కేంద్రంలో నిర్ధారిస్తారు. సాధారణంగా కొత్త వాహనం ఎక్స్–షోరూమ్ ధరలో ఇది 4–6 శాతం ఉంటుంది. ఆ విలువ చెల్లిస్తారు. స్క్రాపింగ్ సర్టిఫికెట్ అందజేస్తారు. ► స్క్రాపింగ్ సర్టిఫికెట్ ఉన్న వాహనదారులు కొత్త వ్యక్తిగత వాహనం కొనుగోలు చేస్తే 25 శాతం వరకూ రోడ్డు ట్యాక్స్ రిబేట్, వాణిజ్య వాహనం కొంటే 15 శాతం వరకూ రోడ్డు ట్యాక్స్ రిబేట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. స్క్రాపింగ్ సర్టిఫికెట్ ఉన్న వాహనదారులకు కొత్త వాహనం విలువలో 5 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని వాహనాల తయారీ సంస్థలను కోరింది. ► పాత వాహనాన్ని తుక్కుగా మార్చి, కొత్తది కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ ఫీజులోనూ మినహాయింపు ఇస్తారు. స్క్రాప్ రంగంలో కొత్తగా 35,000 ఉద్యోగాలు! పాత వాహనాలను తుక్కుగా మార్చేయడం ఇప్పటికే ఒక పరిశ్రమగా మారింది. కానీ, ప్రస్తుతం అసంఘటితంగానే ఉంది. రానున్న రోజుల్లో సంఘటితంగా మారుతుందని, ఈ రంగంలో అదనంగా రూ.10,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, కొత్తగా 35,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ అంచనా వేస్తోంది. ప్రత్యామ్నాయాలు ఏమిటి? పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాలను దశల వారీగా తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. ప్రత్యామ్నాయ వాహనాలు క్రమంగా అందుబాటులోకి వస్తున్నాయి. విద్యుత్‌తో నడిచే (ఎలక్ట్రిక్) వాహనాల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్లో పలు రాయితీలు ప్రకటించారు. రాబోయే రోజుల్లో వీటి ధరలు భారీగా తగ్గనున్నాయి. సమీప భవిష్యత్తులో ఇథనాల్, మిథనాల్, బయో–సీఎన్జీ, బయో–ఎల్ఎన్జీ వాహనాలు విరివిగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్నెన్నో ప్రయోజనాలు ► కాలం తీరిన వాహనాలను తుక్కుగా మార్చడం ప్రధానంగా పర్యావరణానికి మేలు చేయనుంది. కాలుష్య ఉద్గారాలు భారీగా తగ్గుతాయి. ఆధునిక వాహనాలతో ఉద్గారాల బెడద తక్కువే. ► పర్యావరణహిత, సురక్షితమైన, సాంకేతికంగా ఆధునిక వాహనాల వైపు వాహనదారులను నడిపించాలన్నది ప్రభుత్వ ఆలోచన. ► పాత వాహనాల స్థానంలో కొత్తవి కొంటే వాహన తయారీ రంగం పుంజుకుంటుంది. ఈ రంగంలో నూతన పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయి. ► కొత్త వాహనాలతో యజమానులకు నిర్వహణ భారం తగ్గిపోతుంది. చమురును ఆదా చేయొచ్చు. తద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చు. ► స్క్రాప్ చేసిన వెహికల్స్ నుంచి ఎన్నో ముడిసరుకులు లభిస్తాయి. ► ఆటోమొబైల్, స్టీల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు తక్కువ ధరకే ఈ ముడిసరుకులు లభ్యమవుతాయి. – సాక్షి, నేషనల్ డెస్క్