భారతీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ భారతదేశంలో తన మొదటి 'రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ' (RVSF)ని రాజస్థాన్‌లోని జైపూర్‌లో ప్రారంభించింది. దీనిని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి 'నితిన్ గడ్కరీ' ప్రారంభించారు.
టాటా మోటార్స్ ప్రారంభించిన ఈ ఆధునిక సదుపాయంతో సంవత్సరానికి 15,000 వాహనాలను స్క్రాప్ చేయవచ్చు. ఇందులో ప్యాసింజర్ వాహనాలు, కమర్షియల్ వాహనాలను స్క్రాప్ చేయవచ్చు. అంతే కాకుండా పేపర్‌లెస్ కార్యకలాపాల కోసం పూర్తిగా డిజిటలైజ్ చేయబడింది.
స్క్రాప్ చేయాల్సిన వెహికల్స్ యొక్క టైర్లు, బ్యాటరీలు, ఫ్యూయెల్, ఆయిల్స్ వంటి వాటిని విడదీయడానికి కూడా ఇందులో ప్రత్యేకమైన స్టేషన్స్ ఉన్నాయి. ఇందులో వెహికల్ స్క్రాపింగ్‌కి అయ్యే ఖర్చులను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు, అంతే కాకుండా ఇది ఎప్పుడు అమలులోకి వస్తుందనేది కూడా ప్రకటించలేదు.
టాటా వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ ప్రారంభ సమయంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి దశలవారీగా స్క్రాపేజ్ విధానం ఉపయోగపడుతుంది. ఇలాంటి సదుపాయాలను ఏర్పాటు చేసిన టాటా మోటార్స్‌ని అభినందిస్తున్నానన్నారు. అంతే కాకుండా దక్షిణాసియా ప్రాంతంలో భారతదేశాన్ని వాహన స్క్రాపింగ్ హబ్‌గా మార్చడానికి కృషి చేస్తున్నట్లు, భారతదేశంలో ఇలాంటి అత్యాధునిక స్క్రాపింగ్, రీసైక్లింగ్ యూనిట్లు మరిన్ని అవసరమని గడ్కరీ ఈ సందర్భంగా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment