Tata Motors offers huge discounts in March 2023 - Sakshi
Sakshi News home page

టాటా కార్లు కొనేవారికి శుభవార్త.. ఆకర్షణీయమైన డిస్కౌంట్స్, అంతకుమించిన బెనిఫిట్స్

Mar 10 2023 5:29 PM | Updated on Mar 10 2023 6:31 PM

Tata motors march 2023 discounts - Sakshi

దేశీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' ఉగాదికి ముందే కొనుగోలుదారుల కోసం అద్భుతమైన ఆఫర్స్ తీసుకువచ్చింది. టాటా హారియర్, సఫారి, ఆల్ట్రోజ్, టియాగో, టిగోర్ వంటి మోడల్స్ కొనుగోలుపై ఇప్పుడు రూ. 65,000 వరకు డిస్కౌంట్స్, బెనిఫిట్స్ పొందవచ్చు.

టాటా సఫారీ:

అత్యంత ప్రజాదరణ పొందిన సఫారీ అన్ని 2023 మోడల్స్ మీద కంపెనీ రూ. 35,000 డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇందులో రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 25,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఉన్నాయి. ఇక 2022 మోడల్స్ మీద ఏకంగా రూ. 65,000 తగ్గింపును కంపెనీ అందిస్తోంది.

టాటా హారియర్:

టాటా మోటార్స్ తన 2023 హారియర్ మీద రూ. 35,000 డిస్కౌంట్స్ అందిస్తుంది. ఇందులో 10,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 25,000 ఎక్స్ఛేంజ్ తగ్గింపు ఉన్నాయి. 2022 హారియర్ మోడల్ కొనుగోలు మీద ఇప్పుడు మీద రూ. 65,000 డిస్కౌంట్ లభిస్తుంది.

టాటా టిగోర్:

2023 టాటా టిగోర్ సిఎన్‌జి మోడల్ కొనుగోలు మీద రూ. 30,000, పెట్రోల్ మోడల్ మీద రూ. 25,000 తగ్గింపు పొందవచ్చు. పెట్రోల్, సిఎన్‌జి మోడల్స్ కొనుగోలుపై కస్టమర్లు ఇప్పుడు బెనిఫీట్స్ పొందవచ్చు. అదే సమయంలో 2022 మోడల్ మీద రూ. 45,000 మాత్రమే తగ్గింపు పొందవచ్చు.

టాటా టియాగో:

ఇటీవల కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్స్‌లో ఒకటైన టాటా టియాగో కొనుగోలుపై కూడా కంపెనీ ఆకర్షణీయమైన ఆఫర్స్ అందిస్తోంది. టియాగో సిఎన్‌జి మీద రూ. 30,000, పెట్రోల్ వేరియంట్‌ మీద రూ. 25,000 తగ్గింపు లభిస్తుంది. ఇక 2022 మోడల్ కొనుగోలు చేస్తే రూ. 40,000 వరకు బెనిఫీట్స్ లభిస్తాయి.

టాటా ఆల్ట్రోజ్:

2023 టాటా ఆల్ట్రోజ్ కొనుగోలుపై రూ. 25,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఆల్ట్రోజ్ పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్‌ల మీద సమానంగా డిస్కౌంట్స్ పొందవచ్చు. 2022 మోడల్ కొనుగోలుపై రూ. 35,000 పొదుపు చేయవచ్చు. మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న హ్యాచ్‌బ్యాక్ కార్లలో టాటా ఆల్ట్రోజ్ చెప్పుకోదగ్గ మోడల్.

కంపెనీ అందిస్తున్న ఈ డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఖచ్చితమైన డిస్కౌంట్స్, బెనిఫిట్స్ గురించి తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న స్థానిక డీలర్‌ను సంప్రదించి తెలుసుకోవచ్చు. ఈ డిస్కౌంట్స్ కూడా పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement