దేశీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' తన ఈవీ పోర్ట్‌ఫోలియో మీద సంవత్సరాంతంలో గణనీయమైన తగ్గింపులను ప్రకటించింది. ఈ లైనప్‌లో టియాగో ఈవీ హ్యాచ్‌బ్యాక్, టిగోర్ ఈవీ ఉన్నాయి. కంపెనీ ఈ కార్లపై అందిస్తున్న ఆఫర్లను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
టిగోర్ ఈవీ
టాటా టిగోర్ ఈవీ కొనుగోలుపైన కంపెనీ రూ. 1.10 లక్షల తగ్గింపుని అందిస్తోంది. ఇందులోని అన్ని వేరియంట్లపై రూ. 50,000 ఎక్స్చేంజ్ బోనస్‌తో పాటు రూ. 50,000 ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు. వీటితో పాటు రూ.10,000 వరకు కార్పొరేట్ ప్రయోజనాలు లభిస్తాయి. మంచి డిజైన్, ఫీచర్స్ కలిగిన ఈ కారు ఒక చార్జితో గరిష్టంగా 315 కిమీ రేంజ్ అందిస్తుంది.
టియాగో ఈవీ
టాటా టియాగో ఈవీ కొనుగోలుపైన కంపెనీ రూ. 77000 వరకు తగ్గింపుని అందిస్తోంది. ఎంపిక చేసిన కొన్ని వేరియంట్ల మీద కంపెనీ రూ. 1,5000 ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తుంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ లేదు. దీనికి బదులుగా కొనుగోలుదారులు రూ.55,000 వరకు గ్రీన్ బోనస్‌ను పొందవచ్చు. కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ. 7,000 తగ్గింపు లభిస్తుంది.
టియాగో ఈవీ మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. మీడియం రేంజ్ వేరియంట్ ఒక చార్జితో 250 కిమీ పరిధిని, లాంగ్ రేంజ్ వేరియంట్ ఒక చార్జితో 315 కిమీ రేంజ్ అందిస్తుంది.
NOTE: కంపెనీ అందించే ఆఫర్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన డిస్కౌంట్ వివరాలు తెలుసుకోవడానికి కొనుగోలుదారుడు సమీపంలోని సంస్థ అధీకృత డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment