Honda Car Discounts in 2023 March - Sakshi
Sakshi News home page

హాట్ సమ్మర్‌‌లో హోండా కార్లపై కూల్ ఆఫర్స్: ఈ నెల చివరి వరకే!

Published Sun, Mar 5 2023 5:09 PM | Last Updated on Sun, Mar 5 2023 6:26 PM

Honda car discounts in 2023 march - Sakshi

జపనీస్ కార్ల తయారీ సంస్థ హోండా దేశీయ మార్కెట్లో తమ వాహనాల కొనుగోలుమీద అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తున్నట్లు తెలిపింది. ఇందులో హోండా అమేజ్, జాజ్​, డబ్ల్యూఆర్​-వీ, సిటీ మోడల్స్ ఉన్నాయి. ఈ డిస్కౌంట్స్ ఈ నెల చివరిలోపు కొనుగోలు చేసే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయి.

హోండా అమేజ్​:

హోండా కంపెనీ తన అమేజ్ మోడల్ మీద రూ. 26,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో రూ. 10,000 వరకు ఎక్స్​ఛేంజ్​ బోనస్​ లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 6.89 లక్షలు (ఎక్స్​షోరూమ్). ఈ సెడాన్ 1.2 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్ కలిగి 88.5 హెచ్​పీ పవర్, 110 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హోండా జాజ్​:

ఇక హోండా జాజ్ విషయానికి వస్తే, దీని ప్రారంభ ధర రూ. 8.01 లక్షలు (ఎక్స్​షోరూమ్). ఈ మోడల్ మీద కంపెనీ రూ. 15,000 డిస్కౌంట్ అందిస్తుంది. ఇందులో రూ. 5,000 లాయల్టీ బోనస్ లభిస్తుంది. ఇది 1.2 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్ కలిగి 88.5 హెచ్​పీ పవర్​, 110 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హోండా డబ్ల్యూఆర్​-వీ:

హోండా కంపెనీ తన డబ్ల్యూఆర్​-వీ మోడల్ మీద రూ. 17,000 డిస్కౌంట్ అందిస్తుంది. ఇందులో రూ. 5,000 కార్పొరేట్​ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఎస్​యూవీ ప్రారంభ ధర రూ. 9.11 లక్షలు (ఎక్స్​షోరూమ్). ఇందులో 1.2 లీటర్ పెట్రోల్​ ఇంజిన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 88.5 హెచ్​పీ పవర్, 110 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హోండా సిటీ:

కంపెనీ పాపులర్ మోడల్ అయిన హోండా సిటీ సెడాన్​ కొనుగోలు చేసే కస్టమర్లు ఈ నెలలో రూ. 17,000 వరకు డిస్కౌంట్స్ పొందవచ్చు. ఇందులో రూ. 7,000 ఎక్స్​ఛేంజ్​ బోనస్ లభిస్తుంది. దీని ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్​షోరూమ్). ఇందులోని 1.5 లీటర్​ పెట్రోల్​ హైబ్రీడ్​ ఇంజిన్​ 125 హెచ్​పీ పవర్,​ 253 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది, ఇక 1.5 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ 119.35 హెచ్​పీ పవర్​, 145 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఈ నెలలో పైన తెలిపిన కార్లు కొనుగోలు చేయాలనునే కస్టమర్లు మరింత ఖచ్చితమైన సమాచారం కోసం సమీపంలో ఉన్న కంపెనీ డీలర్‌షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement