Honda Motor Recalls 13 Lakh Cars Worldwide Over Rear Camera Issues - Sakshi
Sakshi News home page

హోండా సంచలన ప్రకటన.. దెబ్బకు 13 లక్షల కార్లు వెనక్కి - కారణం ఇదే!

Published Mon, Jun 26 2023 3:22 PM | Last Updated on Mon, Jun 26 2023 3:52 PM

Honda Motor Recall 2023: Know the Reasons for Honda Recalls 13 lakh Cars World wide - Sakshi

Honda Recall: ప్రపంచ మార్కెట్లో వాహన వినియోగం రోజురోజుకి పెరుగుతున్న తరుణంలో అనేక కొత్త వాహనాలు విడుదలవుతున్నాయి. అయితే ఈ సమయంలో ప్రముఖ జపనీస్ కార్ల తయారీ సంస్థ 'హోండా' (Honda) సుమారు 13 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. కంపెనీ రీకాల్ ఎక్కడ ప్రకటించింది? దాని వెనుక ఉన్న కారణం ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, హోండా అమెరికాలోనే 12 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. అంతే కాకుండా కెనడా నుంచి 88,000 & మెక్సికోలో 16,000 కార్ల మీద ఈ ప్రభావం పడినట్లు 'నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్' (NHTSA) తెలిపింది. ఇందులో 2018 నుంచి 2023 మధ్య నిర్మించిన 'ఒడిస్సి', 2019 నుంచి 2022 మధ్య తయారైన పైలట్, 2019 - 2023 మధ్య విడుదలైన హోండా పాస్‌పోర్ట్ మోడల్స్ ఉన్నాయి.

(ఇదీ చదవండి: పాకిస్థాన్‌లో ఎక్కువ అమ్ముడయ్యే కార్లు - ఇక్కడ చూడండి!)

రీకాల్ ప్రకటించడానికి ప్రధాన కారణం.. లోపభూయిష్టమైన కమ్యూనికేషన్ కోక్సియల్ కేబుల్ కనెక్టర్ కలిగి ఉండటం వల్ల 'రియర్ వ్యూ కెమెరా'లో సమస్య ఏర్పడే అవకాశం ఉండటమే. ఈ సమస్యను తొలగించడానికి కంపెనీ రీకాల్ ప్రకటించింది. సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం ఆ సంవత్సరాల్లో ఉత్పత్తయిన కార్లు కలిగిన వినియోగదారులు సమస్యను ఈ రీకాల్ ద్వారా పరిష్కరించుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించవలసిన ఏమిటంటే ఇప్పటి వరకు ఈ సమస్య మీద ఎవరు ఫిర్యాదు చేయలేదు. కానీ ముందుగానే కంపెనీ ఈ సమస్యను పరిష్కరించడం కోసం రీకాల్ ప్రకటించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా రీకాల్ భారతదేశంలో ప్రకటించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement