Honda Elevate Bookings: దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'హోండా ఇండియా' (Honda India) త్వరలోనే 'ఎలివేట్' (Elevate) ఎస్‌యువిని విడుదల చేయడానికి సిద్ధమైంది. కాగా ఇప్పుడు బుకింగ్స్ గురించి అధికారిక సమాచారం వెల్లడించింది.
బుకింగ్స్ & లాంచ్ టైమ్
నివేదికల ప్రకారం, హోండా ఎలివేట్ బుకింగ్స్ 2023 జులై 03 నుంచి ప్రారంభమవుతాయి. రూ. 21,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ మిడ్ సైజ్ ఎస్‌యువి ధరలు ఆగస్ట్ చివరిలో లేదా సెప్టెంబర్ ప్రారంభంలో ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంటే అప్పటికి ఈ కారు భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదలవుతుంది. అంతే కాకుండా ఈ నెల చివరి నాటికి డిస్‌ప్లే, ఆగష్టు చివరి నాటికి టెస్ట్ డ్రైవ్‌లు ప్రారంభమవుతాయి.
వేరియంట్స్ & ఇంజిన్ డీటైల్స్
హోండా ఎలివేట్ నాలుగు ట్రిమ్లలో విడుదలయ్యే అవకాశం ఉందని డీలర్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఖచ్చితమైన వివరాలు లాంచ్ నాటికి తెలుస్తాయి.
ఎలివేట్ ఎస్‌యువి 1.5-లీటర్, ఫోర్ సిలిండర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలిగి 121 హార్స్ పవర్, 145 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా ఆప్షనల్ సివిటీ గేర్‌బాక్స్ పొందనుంది. పవర్‌ట్రెయిన్ మాత్రం హోండా సిస్టయి మాదిరిగా ఉంటుందని భావిస్తున్నారు.
డిజైన్ & ఫీచర్స్
డిజైన్ అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే.. విశాలమైన ఫ్రంట్ గ్రిల్, మధ్యలో బ్రాండ్ లోగో, హెడ్ లైట్, ఫాగ్ లైట్స్, వంటివి ఇందులో గమనించవచ్చు. ఈ ఎస్‌యువి 4312 మిమీ పొడవు, 1790 మిమీ వెడల్పు, 1650 మిమీ ఎత్తు, 2650 మిమీ వీల్‌బేస్ కలిగి.. 220 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ పొందుతుంది. కావున పరిమాణం పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది.
(ఇదీ చదవండి: కనుమరుగవుతున్న 44 ఏళ్ల చరిత్ర.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీ విలీనం!)
హోండా ఎలివేట్ సాఫ్ట్ టచ్ ప్యానెల్స్, విశాలమైన సీటింగ్‌తో క్యాబిన్ చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్, 7 ఇంచెస్ సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, లేన్-వాచ్ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్‌ప్లే, కొలిషన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్‌తో కూడిన ADAS వంటి ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి. ఇది సింగిల్-పేన్ సన్‌రూఫ్‌ను మాత్రమే పొందుతుంది.
(ఇదీ చదవండి: ఈ నెలలో విడుదలైన బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ - వివో వై36 నుంచి వన్‌ప్లస్ నార్డ్ వరకు..)
ప్రత్యర్థులు
కొత్త హోండా ఎలివేట్ దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మొదలైన కార్లకు ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కారు ధరలు అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ ఇది రూ. 12 లక్షల ధర వద్ద విడుదలయ్యే వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment