
Discounts: భారతీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' (Tata Motors) దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లను విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. కాగా కంపెనీ ఇప్పుడు ఎంపిక చేసిన కొన్ని కార్ల మీద అద్భుతమైన ఆఫర్స్ ప్రకటించింది. ఇందులో టాటా టియాగో, టిగర్, ఆల్ట్రోజ్, హారియర్, సఫారీ వంటి కార్లు ఉన్నాయి. అయితే సంస్థ టాటా పంచ్ మరియు నెక్సాన్ కార్ల మీద ఎటువంటి తగ్గింపులను అందించడం లేదు. కాగా కంపెనీ ఏ కారు మీద ఎంత డిస్కౌంట్ అందిస్తోంది? ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుంది? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
టాటా టియాగో (Tata Tiago)
భారతీయ మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతున్న హ్యాచ్‌బ్యాక్స్ లో ఒకటైన టియాగో మీద కంపెనీ రూ. 43000 వరకు తగ్గింపును అందిస్తోంది. అయితే ఇది మల్టిపుల్ వేరియంట్లలో లభిస్తుంది. కావున వేరియంట్‌ని బట్టి డిస్కౌంట్ మారుతుంది. టియాగో పెట్రోల్ వేరియంట్ మీద రూ. 30,000 తగ్గింపు లభిస్తుంది. ఇందులో రూ. 10,000 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్, రూ. 20000 వరకు కంజ్యుమర్ స్కీమ్ కింద తగ్గింపు లభిస్తుంది.
ఇక CNG వేరియంట్ మీద 43000 తగ్గింపు లభించగా.. ఇందులో కంజ్యుమర్ స్కీమ్ కింద రూ. 30 వేలు, ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ రూ. 10,000, రూ. 3000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉంటుంది. దేశీయ మార్కెట్లో ఈ హ్యాచ్‌బ్యాక్ మారుతి స్విఫ్ట్, ఇగ్నీస్, గ్రాండ్ ఐ వంటి వాటికి ఇది ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.
టాటా టిగోర్ (Tata Tigor)
టాటా మోటార్స్ ఇప్పుడు టిగోర్ పెట్రోల్ మోడల్ మీద రూ. 33,000 తగ్గింపుని సిఎన్‌జీ మోడల్ మీద రూ. 48000 తగ్గింపుని ప్రకటించింది. ఈ రెండు మోడల్స్ మీద ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్, కంజ్యుమర్ స్కీమ్ లభించే డిస్కౌంట్ మాత్రమే కాకుండా కార్పొరేట్ తగ్గింపులు కూడా లభిస్తాయి.
(ఇదీ చదవండి: సగం జీతానికి పనిచేసిన 'నారాయణ మూర్తి' బిలీనియర్ ఎలా అయ్యాడంటే?)
టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz)
టాటా ఆల్ట్రోజ్ మీద ఇప్పుడు రూ. 30000 వరకు బెనిఫీట్స్ లభిస్తున్నాయి. ఈ తగ్గింపులు కేవలం పెట్రోల్, డీజిల్ మోడల్స్‌కి మాత్రమే వర్తిస్తాయి. అయితే ఈ మధ్య కాలంలో విడుదలైన సిఎన్‌జీ మోడల్ మీద మాత్రం ఎటువంటి తగ్గింపులు లభించవు. పెట్రోల్ వేరియంట్ మీద రూ. 25,000 తగ్గింపు, డీజిల్ మోడల్ మీద రూ. 30,000 తగ్గింపు లభిస్తుంది.
(ఇదీ చదవండి: ట్రక్కులందు ఈ ట్రక్కు వేరయా.. దీని గురించి తెలిస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తది!)
టాటా హారియర్ & సఫారి (Tata Harrier and Safari)
టాటా హారియర్ & సఫారి కార్ల కొనుగోలుపైన రూ. 35000 వరకు బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు SUVల మీద రూ. 25,000 ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. అదే సమయంలో కార్పొరేట్ తగ్గింపు కింద రూ. 10,000 తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ రెండు మోడల్స్ మీద ఎటువంటి కంజ్యుమర్ బెనిఫిట్స్ లభించవు.
"డిస్కౌంట్‌లు నగరం నుంచి నగరానికి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. కావున ఖచ్చితమైన డిస్కౌంట్స్ గురించి తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న డీలర్షిప్ సందర్శించండి.''