Maruti Suzuki Discount Offers in May 2023; Check Details - Sakshi
Sakshi News home page

Maruti Suzuki: మారుతి కారు కొనాలా? ఇంతకంటే మంచి సమయం రాదు!

Published Sat, May 6 2023 2:37 PM | Last Updated on Sat, May 6 2023 3:00 PM

Maruti suzuki 2023 may discounts full details - Sakshi

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి ఈ నెలలో (2023 మే) ఎంపిక చేసిన నెక్సా లైనప్ మోడల్స్‌పై గొప్ప ఆఫర్స్ ప్రకటించింది. ఇందులో మారుతీ సుజుకి ఇగ్నిస్, సియాజ్, బాలెనో మోడల్స్ ఉన్నాయి. కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మారుతి సుజుకి ఇగ్నిస్:
మారుతి సుజుకి ఇప్పుడు ఇగ్నిస్ కొనుగోలుపై రూ. 47,000 తగ్గింపుని అందిస్తుంది. ఇందులో రూ. 25,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్, రూ. 7,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తాయి. అంతే కాకుండా ఇగ్నిస్ ఆటోమాటిక్ వేరియంట్స్ మీద రూ. 42,000 డిస్కౌంట్స్ లభిస్తుంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 20,000 వరకు మాత్రమే ఉంటుంది. మిగిలిన ఎక్స్చేంజ్ ఆఫర్, కార్పొరేట్ డిస్కౌంట్ ఒకేలా ఉంటుంది.

మారుతి సుజుకి సియాజ్:
మారుతి సుజుకి సియాజ్ కొనుగోలుపైన ఇప్పుడు రూ. 35,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో మ్యాన్యువల్, ఆటోమాటిక్ వేరియంట్స్ ఉన్నాయి. ఇందులో ఎక్స్‌ఛేంజ్ అఫర్ కింద రూ. 25,000, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ. 10,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ కారు మంచి డిజైన్, అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. దీని ధర రూ. 9.30 లక్షల నుంచి రూ. 12.29 లక్షల మధ్య ఉంటుంది.

మారుతి సుజుకి బాలెనొ:
ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న మారుతి సుజుకి బాలెనొ కొనుగోలుపై కంపెనీ రూ. 20,000 బెనిఫీట్స్ అందిస్తుంది. ఇందులోని డెల్టా & జీటా వేరియంట్స్ మీద రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 10వేలు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ లభిస్తుంది. అయితే CNG మోడల్స్ మీద ఎటువంటి ప్రయోజనాలు అందుబాటులో లేదు. కొనుగోలుదారులు దీనిని తప్పకుండా గమనించాలి.

(ఇదీ చదవండి: చదివిన కాలేజీ ముందు పాలు అమ్మాడు.. ఇప్పుడు రూ. 800 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడిలా!)

కంపెనీ అందిస్తున్న ఆఫర్స్, బెనిఫీట్స్ వంటి వాటిని గురించి ఖచ్చితమైన వివరాలను తెలుసుకోవడానికి మీ సమీపంలో ఉన్న మారుతి  డీలర్షిప్ సందర్శించవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలను తప్పకుండా మాతో పంచుకోండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement