పండుగ సీజన్‌లో గొప్ప ఆఫర్స్ - కార్లు కొనటానికి ఇదే మంచి సమయం | Festival Discounts On Tata Maruti Renault Hyundai And More | Sakshi
Sakshi News home page

పండుగ సీజన్‌లో గొప్ప ఆఫర్స్ - కార్లు కొనటానికి ఇదే మంచి సమయం

Nov 5 2023 8:39 PM | Updated on Nov 5 2023 8:59 PM

Festival Discounts On Tata Maruti Renault Hyundai And More - Sakshi

విజయదశమితో మొదలైన పండుగ సీజన్ జోరుగా ముందుకు సాగుతోంది. ఈ తరుణం కోసం ఎదురు చూస్తున్న కంపెనీలు తమ ఉత్పత్తులను ఎక్కువ సంఖ్యలో విక్రయించుకోవడానికి అద్భుతమైన ఆఫర్స్ లేదా బెనిఫిట్స్ అందిస్తున్నాయి. ఇప్పటికే మహీంద్రా, సిట్రోయెన్, స్కోడా కంపెనీలు ఆఫర్స్ ప్రకటించేసాయి. తాజాగా ఇప్పుడు ఈ జాబితాలోకి మరి కొన్ని సంస్థలు చేరాయి.

ఈ పండుగ సీజన్‌లో టాటా, మారుతి, హ్యుందాయ్ వంటి కార్ డీలర్లు తమ లైనప్‌లో కొన్ని ఎంపిక చేసిన కార్ల మీద ఆకర్షణీయమైన తగ్గింపులు, ప్రయోజనాలను అందిస్తున్నారు. ఇందులో క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ ఆఫర్‌లు ఉన్నాయి.

ఏ కారు మీద ఎంత డిస్కౌంట్..
👉టాటా ఆల్ట్రోజ్ - రూ. 30,000
👉టాటా టియాగో - రూ. 40,000
👉రెనాల్ట్ క్విడ్ - రూ. 50,000
👉హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ - రూ. 55,000
👉మారుతి సుజుకి బాలెనో - రూ. 55,000
👉మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ - రూ. 58,000
👉మారుతి సుజుకి ఇగ్నిస్ - రూ. 65,000
👉మారుతి సుజుకి ఆల్టో కే10 - రూ. 70,000
👉మారుతి సుజుకి సెలెరియో - రూ. 73,000

Note: పండుగ సీజన్‌లో వాహన తయారీ సంస్థలు అందిస్తున్న డిస్కౌంట్‌లు ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఖచ్చితమైన డిస్కౌంట్ వివరాలు తెలుసుకోవడానికి తప్పకుండా సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్‌ను సంప్రదించి తెలుసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement