Mahindra Thar 4x4 Gets Rs 40,000 Discount This Month - Sakshi
Sakshi News home page

మహీంద్రా కార్లపై కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్! థార్ కొనుగోలుపై ఏకంగా..

Published Thu, Apr 6 2023 7:04 PM | Last Updated on Thu, Apr 6 2023 7:31 PM

Mahindra april 2023 discounts full details - Sakshi

దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' తమ ఉత్పత్తుల కొనుగోలు మీద ఈ నెలలో (ఏప్రిల్ 2023) భారీ తగ్గింపులను ప్రకటించింది. ఈ ఆఫర్స్, బెనిఫీట్స్ అన్నీ మహీంద్రా మొరాజో, బొలెరో, బొలెరో నియో, థార్ 4RD, XUV300 కొనుగోలుపై పొందవచ్చు. 

మహీంద్రా మొరాజో:
మహీంద్రా కంపెనీ ఇప్పుడు మొరాజో కొనుగోలుపైన ఏకంగా రూ. 72,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తుంది. ఈ తగ్గింపు టాప్ స్పెక్ M6 వేరియంట్‌పై లభిస్తుంది. అయితే బేస్ వేరియంట్ M2, మిడ్-స్పెక్ వేరియంట్ M4+ మీద వరుసగా రూ. 58,000, రూ. 34,000 తగ్గింపుని పొందవచ్చు.

మహీంద్రా బొలెరో:
మహీంద్రా బొలెరో కొనుగోలుపైన ఇప్పుడు రూ. 66,000 డిస్కౌంట్స్ లభిస్తాయి. ఇందులో టాప్ స్పెక్ వేరియంట్ మీద రూ. 51,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 విలువైన యాక్ససరీస్ లభిస్తాయి. ఇక మిడ్-స్పెక్ B6 వేరియంట్ మీద రూ. 24000, ఎంట్రీ-లెవల్ B4 వేరియంట్‌ మీద రూ. 37000 తగ్గింపు లభిస్తుంది.

మహీంద్రా XUV300:
XUV300 కొనుగోలుపై కంపెనీ ఇప్పుడు రూ. 52,000 ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో కూడా W8 డీజిల్ వేరియంట్‌ కొనుగోలుపై రూ. 42,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 10,000 విలువైన యాక్ససరీస్ లభిస్తాయి. అదే సమయంలో W8(O), W6 డీజిల్ వేరియంట్‌ల మీద వరుసగా రూ. 22000, రూ. 10000 తగ్గింపు & పెట్రోల్ వేరియంట్స్ అయిన డబ్ల్యూ8(ఓ), డబ్ల్యూ8, డబ్ల్యూ6 వేరియంట్‌లపై వరుసగా రూ. 25000, రూ. 20000, రూ. 20000 తగ్గింపు లభిస్తుంది.

మహీంద్రా బొలెరో నియో:
బొలెరో నియో టాప్ స్పెక్ వేరియంట్స్ N10, N10 (O) మీద రూ. 48,000 డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇందులో రూ. 36,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 12,000 విలువైన యాక్ససరీస్ లభిస్తాయి. మిడ్ స్పెక్ వేరియంట్, ఎంట్రీ లెవెల్ మోడల్ మీద రూ. 30000, రూ. 22,000 డిస్కౌంట్ లభిస్తుంది. 

మహీంద్రా థార్ 4X4:
దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన మహీంద్రా థార్ కొనుగోలుపై కూడా ఇప్పుడు రూ. 40,000 వరకు డిస్కౌంట్స్ లభిస్తాయి. ఇది కేవలం థార్ 4WD వేరియంట్ మీద మాత్రమే లభిస్తాయి. ఇందులో కూడా AX(O), LX అనే రెండు ట్రిమ్‌ల మీద తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి.

మహీంద్రా కంపెనీ అందించే డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. కావున ఖచ్చితమైన డిస్కౌంట్స్ గురించి తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న కంపెనీ అధికారిక డీలర్‌ను సంప్రదించి తెలుసుకోవచ్చు. ఇది కూడా స్టాక్ ఉన్నంత వరకు ఏప్రిల్ నెలలో మాత్రమే  డిస్కౌంట్స్ వర్తిస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement