
దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) భారతదేశంలో తన మూడవ రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (RVSF) ప్రారంభించింది. గుజరాత్ సూరత్‌లో ప్రారంభమైన ఈ ఫెసిలిటీ పేరు Re.Wi.Re Recycle with Respect. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
టాటా మోటార్స్ ఇప్పటికీ ఈ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీలను భువనేశ్వర్, జైపూర్ ప్రాంతాల్లో ప్రారంభించింది. కాగా ఇప్పుడు తన మూడవ ఫెసిలిటీని సూరత్‌లో ఏర్పాటు చేసింది. ఇందులో ప్రతి ఏటా 15,000 వాహనాలను స్క్రాప్ చేయడానికి అనుకూలంగా నిర్మించారు.
ఆర్‌విఎస్‌ఎఫ్‌ని టాటా మోటార్స్ భాగస్వామి శ్రీ అంబికా ఆటో అన్ని నిర్వహించనుంది. ఇందులో భాగంగానే దాదాపు అన్ని బ్రాండ్లకు సంబంధించిన ఎండ్ ఆఫ్ లైఫ్ ప్యాసింజర్, కమర్షియల్ వాహనాలను స్క్రాప్ చేస్తుంది.
ఈ సందర్భంగా టాటా మోటార్స్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బాలాజీ మాట్లాడుతూ.. Re.Wi.Re లాంచ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. సూరత్‌లో ఈ ఫెసిలిటీ రానున్న రోజుల్లో మరింత వృద్ధి చెందుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: భారత్ మీదే ఆశలన్నీ.. జర్మన్, జపనీస్ కంపెనీల తీరిది!
నిజానికి పాత వస్తువులు కాలుష్య కారకాలుగా మారతాయి. వీటిని తుక్కు కింద మార్చి మళ్ళీ రీ-సైకిల్ పద్దతిలో ఉపయోగిస్తారు. ఈ విధానంలో పనికిరాని వస్తువులు మళ్ళీ ఉపయోగించడానికి అనుకూలంగా మారతాయి. స్క్రాపింగ్ పాలసీ కింద 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న కమర్షియల్ వాహనాలు & 20 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వాహనాలు తుక్కు చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా పర్యావరణంలో కాలుష్యాన్ని తగ్గించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment