టాటా మోటార్స్ తమిళనాడులోని రాణిపేటలో సరికొత్త తయారీ కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సదుపాయంలో టాటా మోటార్స్, జేఎల్ఆర్ రెండింటికీ వాహనాలను తయారు చేస్తుంది. ఇక్కడ తయారయ్యే వాహనాలను దేశీయ మార్కెట్లో విక్రయించడమే కాకుండా.. విదేశాలకు ఎగుమతి చేయనున్నట్లు సమాచారం. శంకుస్థాపన కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, టాటాకు చెందిన సీనియర్ ప్రతినిధులతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
2024 మార్చిలో టాటా మోటార్స్ తమిళనాడు ప్రభుత్వంతో ఒక అవగాహనా ఒప్పందం (MOU)పై సంతకం చేసింది. కంపెనీ నిర్మించనున్న కొత్త ప్లాంట్‌లో ఐదు సంవత్సరాల వ్యవధిలో మొత్తం రూ.9,000 కోట్లను పెట్టుబడి పెట్టనుంది. నిర్మాణం పూర్తయిన తరువాత రాష్ట్రంలో సుమారు 5000 ఉద్యోగాలు లభించనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: అక్టోబర్‌లో బ్యాంకులు పనిచేసేది సగం రోజులే!.. ఎందుకంటే?
ఈ సందర్భంగా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్, లగ్జరీ వాహనాలతో సహా మా తర్వాతి తరం కార్లు, ఎస్‌యూవీలకు త్వరలో పూర్తికానున్న ప్లాంట్ నిలయంగా మారుతుంది. తమిళనాడు ప్రగతిశీల విధానాలతో ప్రముఖ పారిశ్రామిక రాష్ట్రంగా ఉంది. అనేక టాటా గ్రూప్ కంపెనీలు ఇక్కడ నుండి విజయవంతంగా పనిచేస్తున్నాయన్నారు. మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తూ.. వివిధ స్థాయిల్లో మహిళా ఉద్యోగులను నియమించుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా చేయనున్నట్లు పేర్కొన్నారు.
I can proudly say that Tamil Nadu leads India in both automobile production and #EV manufacturing.
With a 35% share of the nation’s total automobile output and 40% of all EVs sold, we are pivotal in shaping India’s mobility future.@TataMotors, along with industry giants like… pic.twitter.com/pdZ47rcel8— M.K.Stalin (@mkstalin) September 28, 2024
Comments
Please login to add a commentAdd a comment