మొన్న గూగుల్.. నేడు విస్టన్‌: తమిళనాడుకు దిగ్గజ కంపెనీలు | CM MK Stalin Signs MoUs For Rs 850 Crores With Lincoln Electric Vishay Precision and Visteon | Sakshi
Sakshi News home page

మొన్న గూగుల్.. నేడు విస్టన్‌: తమిళనాడుకు దిగ్గజ కంపెనీలు

Published Fri, Sep 6 2024 1:26 PM | Last Updated on Sat, Sep 14 2024 6:32 PM

CM MK Stalin Signs MoUs For Rs 850 Crores With Lincoln Electric Vishay Precision and Visteon

గూగుల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న తరువాత తమిళనాడు ప్రభుత్వం.. ఇప్పుడు అమెరికాకు చెందిన లింకన్ ఎలక్ట్రిక్, విషయ్ ప్రెసిషన్, విస్టన్‌లతో రూ.850 కోట్ల విలువైన ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా సీఎం తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.

గురువారం రోజు కూడా స్టాలిన్ ప్రభుత్వం ట్రిలియంట్‌తో రూ. 2000 కోట్ల అవగాహనా ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. ఈ కంపెనీ రాష్ట్రంలో తయారీ యూనిట్‌ను మాత్రమే కాకుండా.. డెవలప్‌మెంట్ అండ్ గ్లోబల్ సపోర్ట్ సెంటర్‌ను ప్రారభించనుంది. చెన్నైలో పాదరక్షల ఉత్పత్తి, విస్తరణ గురించి నైక్‌తో కూడా చర్చలు జరిపినట్లు సీఎం స్టాలిన్ పేర్కొన్నారు.

అంతకుముందు బుధవారం, స్టాలిన్ చెన్నైలోని రూ. 200 కోట్ల ఆర్&డీ ఇంజనీరింగ్ సెంటర్ విస్తరణ కోసం బహుళజాతి పవర్ మేనేజ్‌మెంట్ కంపెనీ అయిన ఈటన్‌తో కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం రాష్ట్రంలో ఉద్యోగాల సంఖ్యను పెంచుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

ఇదీ చదవండి: ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి: కొత్త ధరలు ఇవే..

రాష్ట్ర శ్రేయస్సును పెంపొందించే లక్ష్యంతో విదేశీ పెట్టుబడులను పొందేందుకు స్టాలిన్ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్‌లో అధికారిక పర్యటనలో ఉన్నట్లు సమాచారం. 2024 ఆగష్టు 31న చెంగల్‌పట్టు జిల్లాలో ఎలక్ట్రోలైజర్‌లు మరియు గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి ఓహ్మియంతో కొత్త ఫ్యాక్టరీ స్థాపనకు ఒప్పందం జరిగింది. దీని ద్వారా 500 ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement