ఉపాధి అవకాశాలున్నా సరైన నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులు లేక కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. దేశంలో ఏటా అత్యధిక మంది గ్యాడ్యుయేట్లను అందించే రాష్ట్రం ఇది. కానీ కంపెనీల అవసరాలకు తగిన నైపుణ్యాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
కేంద్ర గణాంకాల మంత్రిత్వశాఖ నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్) ప్రకారం..జులై 2022 నుంచి జూన్ 2023 ఏడాదికిగాను పని చేస్తున్న, పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవారిని పరిగణించి శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు(ఎల్‌ఎఫ్‌పీఆర్)ను లెక్కించారు. అందులో గరిష్ఠంగా 46 శాతంతో తమిళనాడు మొదటిస్థానంలో ఉంది. దేశంలో సగటున ఈ ఎల్‌ఎఫ్‌పీఆర్ 42.4 శాతంగా ఉంది. వర్కర్ పాపులేషన్ రేటు తమిళనాడులో 44 శాతంగా ఉంటే దేశంలో సరాసరి 41.1 శాతంగా నమోదైంది.
ఇదీ చదవండి: ఇల్లు కొంటున్నారా..? ఒక్క క్షణం..!
దేశవ్యాప్తంగా మొత్తం ఫ్యాక్టరీల్లో పనిచేసే జనాభాలో తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రలోనే 40 శాతం ఉంది. అయితే తమిళనాడులోని కంపెనీల్లో భారీగా ఖాళీలున్నాయని, కానీ ఆయా పోస్టులకు తగిన నైపుణ్యాలు అభ్యర్థుల వద్ద లేవని సంస్థలు చెబుతున్నాయి. రోజూ కొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయి. అందుకు తగినట్లు నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దానివల్ల ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment