సెలబ్రిటీలతో ఎయిర్‌బీఎన్‌బీ జట్టు.. | Janhvi Kapoor Chennai home now listed on Airbnb | Sakshi
Sakshi News home page

సెలబ్రిటీలతో ఎయిర్‌బీఎన్‌బీ జట్టు..

Published Fri, May 3 2024 5:56 AM | Last Updated on Fri, May 3 2024 11:58 AM

Janhvi Kapoor Chennai home now listed on Airbnb


లిస్టులో జాన్వీ కపూర్‌ చెన్నై ఇల్లు 

న్యూఢిల్లీ: భారత్‌లో కార్యకలాపాలు విస్తరించే దిశగా ఆతిథ్య సేవల ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం ఎయిర్‌బీఎన్‌బీ మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా సినిమా, స్పోర్ట్స్, మ్యూజిక్‌ తదితర రంగాల సెలబ్రిటీలతో జట్టు కడుతోంది. తాజాగా బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌తో చేతులు కలిపింది. ’భారత్‌లో బాలీవుడ్‌ స్టార్‌ జాన్వి కపూర్‌లా జీవించండి’ స్లోగన్‌తో ఆమె బాల్యంలో నివసించిన చెన్నై ఇంటిని బస కోసం ప్రమోట్‌ చేస్తోంది. 

తమ కార్యకలాపాలకు సంబంధించి భారత్‌ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటని, టాప్‌ 10 మార్కెట్ల జాబితాలోకి చేరే అవకాశాలు ఉన్నాయని ఎయిర్‌బీఎన్‌బీ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ డేవ్‌ స్టీఫెన్సన్‌ తెలిపారు. 2022తో పోలిస్తే 2023లో బుకింగ్స్‌ 30 శాతం పెరిగాయని ఆయన పేర్కొన్నారు. విదేశాలు వెళ్లేవారితో పాటు దేశీయంగా కూడా పర్యటించే టూరిస్టులను ఆకట్టుకునేందుకు భారత్‌లో గణనీయంగా ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు స్టీఫెన్సన్‌ వివరించారు. తమ కార్యకలాపాల ద్వారా భారత్‌లో 85,000 పైచిలుకు ఉద్యోగాలకు, జీడీ పీ వృద్ధికి 920 మిలియన్‌ డాలర్ల మేర తోడ్పా టు అందించినట్లు పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement