తమిళనాడుకు దిగ్గజ కంపెనీలు.. రూ.7618 కోట్ల పెట్టుబడులు | Tamil Nadu CM Stalin Says 19 MoUs Signed For Investment of Rs 7618 Crore | Sakshi
Sakshi News home page

తమిళనాడుకు దిగ్గజ కంపెనీలు.. రూ.7618 కోట్ల పెట్టుబడులు

Published Sat, Sep 14 2024 6:54 PM | Last Updated on Sat, Sep 14 2024 7:52 PM

Tamil Nadu CM Stalin Says 19 MoUs Signed For Investment of Rs 7618 Crore

గత కొన్ని రోజులుగా అమెరికా పర్యటనలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ పర్యటనలో సుమారు రూ. 7618 కోట్ల విలువైన 19 అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో 11,516 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆయన అన్నారు.

వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం.. తమిళనాడులోని తిరుచ్చి, మధురై మొదలైన ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు ఏర్పడుతాయని.. ఫోర్డ్ కంపెనీ మళ్ళీ తన ఉత్పత్తిని రాష్ట్రంలో ప్రారంభిస్తుందని సీఎం స్టాలిన్ వెల్లడించారు.

ఇదీ చదవండి: ఫోర్డ్ కంపెనీ మళ్ళీ ఇండియాకు: ఎందుకంటే?    

అవగాహన ఒప్పందాలు
👉రూ.100 కోట్ల పెట్టుబడితో హోసూర్‌లో లేటెస్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్ తయారీ యూనిట్‌ను స్థాపించడానికి ఆర్జీబీఎస్ఐతో ఒప్పందం.
👉రాక్‌వెల్ ఆటోమేషన్ కంపెనీ కాంచీపురంలో రూ. 666 కోట్ల పెట్టుబడితో దాని తయారీని విస్తరించనుంది. దీని ద్వారా దాదాపు 365 ఉద్యోగాలు లభిస్తాయి.
👉లింకన్ ఎలక్ట్రిక్, విషయ్ ప్రెసిషన్, విస్టన్‌లతో రూ.850 కోట్ల విలువైన ఎంఓయూలు
👉డెవలప్‌మెంట్ అండ్ గ్లోబల్ సపోర్టు సెంటర్‌ను రూపొందించడానికి ట్రిలియంట్‌తో రూ. 2000 కోట్ల అవగాహనా ఒప్పందం
👉తమిళనాడులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ల్యాబ్‌లను ఏర్పాటు చేసేందుకు గూగుల్‌తో ఎంఓయూ
👉రూ. 200 కోట్ల ఆర్&డీ ఇంజనీరింగ్ సెంటర్ విస్తరణ కోసం బహుళజాతి పవర్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఈటన్‌తో ఒప్పందాలు
👉చెంగల్‌పట్టు జిల్లాలో ఎలక్ట్రోలైజర్‌లు అండ్ గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి ఓహ్మియంతో కొత్త ఫ్యాక్టరీ స్థాపనకు ఒప్పందం 
👉రూ. 900 కోట్ల పెట్టుబడి కోసం నోకియా, పేపాల్, ఈల్డ్ ఇంజినీరింగ్ సర్వీసెస్, మైక్రోచిప్, ఇన్ఫింక్స్ హెల్త్‌కేర్ అండ్ అప్లైడ్ మెటీరియల్స్ అనే ఆరు ప్రముఖ ప్రపంచ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement