MoUs
-
తమిళనాడుకు దిగ్గజ కంపెనీలు.. రూ.7618 కోట్ల పెట్టుబడులు
గత కొన్ని రోజులుగా అమెరికా పర్యటనలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ పర్యటనలో సుమారు రూ. 7618 కోట్ల విలువైన 19 అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో 11,516 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆయన అన్నారు.వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం.. తమిళనాడులోని తిరుచ్చి, మధురై మొదలైన ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు ఏర్పడుతాయని.. ఫోర్డ్ కంపెనీ మళ్ళీ తన ఉత్పత్తిని రాష్ట్రంలో ప్రారంభిస్తుందని సీఎం స్టాలిన్ వెల్లడించారు.ఇదీ చదవండి: ఫోర్డ్ కంపెనీ మళ్ళీ ఇండియాకు: ఎందుకంటే? అవగాహన ఒప్పందాలు👉రూ.100 కోట్ల పెట్టుబడితో హోసూర్‌లో లేటెస్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్ తయారీ యూనిట్‌ను స్థాపించడానికి ఆర్జీబీఎస్ఐతో ఒప్పందం.👉రాక్వెల్ ఆటోమేషన్ కంపెనీ కాంచీపురంలో రూ. 666 కోట్ల పెట్టుబడితో దాని తయారీని విస్తరించనుంది. దీని ద్వారా దాదాపు 365 ఉద్యోగాలు లభిస్తాయి.👉లింకన్ ఎలక్ట్రిక్, విషయ్ ప్రెసిషన్, విస్టన్‌లతో రూ.850 కోట్ల విలువైన ఎంఓయూలు👉డెవలప్మెంట్ అండ్ గ్లోబల్ సపోర్టు సెంటర్‌ను రూపొందించడానికి ట్రిలియంట్‌తో రూ. 2000 కోట్ల అవగాహనా ఒప్పందం👉తమిళనాడులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ల్యాబ్‌లను ఏర్పాటు చేసేందుకు గూగుల్‌తో ఎంఓయూ👉రూ. 200 కోట్ల ఆర్&డీ ఇంజనీరింగ్ సెంటర్ విస్తరణ కోసం బహుళజాతి పవర్ మేనేజ్మెంట్ కంపెనీ ఈటన్‌తో ఒప్పందాలు👉చెంగల్పట్టు జిల్లాలో ఎలక్ట్రోలైజర్లు అండ్ గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి ఓహ్మియంతో కొత్త ఫ్యాక్టరీ స్థాపనకు ఒప్పందం 👉రూ. 900 కోట్ల పెట్టుబడి కోసం నోకియా, పేపాల్, ఈల్డ్ ఇంజినీరింగ్ సర్వీసెస్, మైక్రోచిప్, ఇన్ఫింక్స్ హెల్త్‌కేర్ అండ్ అప్లైడ్ మెటీరియల్స్ అనే ఆరు ప్రముఖ ప్రపంచ కంపెనీలతో అవగాహన ఒప్పందాలుChennai | Tamil Nadu CM MK Stalin says "I have completed my official visit to America. This was a successful visit. 19 MoUs have been signed. I got an investment of Rs 7618 for the state. 11,516 people will get new jobs. Factories will be set up in Trichy, Madurai Coimbatore,… pic.twitter.com/KhnpxNETXz— ANI (@ANI) September 14, 2024 -
గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ నైపుణ్యాలపై శిక్షణ
హైదరాబాద్: ఏఐసీటీసీ, జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్ఎస్డీసీ) బజాజ్ ఫిన్సర్వ్ చేతులు కలిపాయి. బుధవారం ఇవి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆర్థిక సేవల రంగంలో ఉపాధి అవకాశాలు కోరుకునే అభ్యర్థులకు కావాల్సిన నైపుణ్యాలను అందచనున్నాయి. ఈ భాగస్వామ్యం కింద 20వేల మంది అభ్యర్థులకు సరి్టఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ (సీపీబీఎఫ్ఐ) కోర్సులో బజాజ్ ఫిన్సర్వ్ శిక్షణ ఇవ్వనుంది. పరిశ్రమకు చెందిన నిపుణులు, శిక్షణ భాగస్వాములు, విద్యా సంస్థల సహకారంతో ఈ ప్రోగ్రామ్‌ను బజాజ్ ఫిన్సర్వ్ రూపొందించింది. టైర్–2, 3 పట్టణాల్లోని గ్రాడ్యుయేట్లు, ఎంబీఏ చేసిన వారు ఉద్యోగాన్వేషణ దిశగా కావాల్సిన నైపుణ్యాలను అందించనుంది. భావవ్యక్తీకరణ, పని నైపుణ్యాలను కూడా అందించనుంది. ప్రయోగాత్మకంగా ఒడిశాలోని పది జిల్లాల్లో మొదటి దశ కింద ఉద్యోగార్థులకు ఈ నైపుణ్యాలను ఆఫర్ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా పాల్గొన్నారు. -
అచ్చెన్నాయుడు ఇప్పుడే నిద్రలేచారా?: మంత్రి అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు పెట్టుబడిదారుల నుంచి వచ్చిన స్పందనే తమ ప్రభుత్వ పారిశ్రామిక విధానమని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. కేవలం సంవత్సరం, రెండు సంవత్సరాల్లోనే సాకారమయ్యేలా ఎంఓయూలు కుదుర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. రికార్డు స్థాయిలో తొలి రోజు రూ.11.87 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు తెలిపారు. ఈ రెండు రోజుల సదస్సు ద్చారా రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తున్నామని గర్వంగా చెబుతున్నామన్నారు. వీటి ద్వారా 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలుంటాయన్నారు. కేవలం సీఎం జగన్ బ్రాండ్ వల్లే ఏపీకి ఈ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని స్పష్టంచేశారు. 14 రంగాలలో ఫోకస్ చేద్దామనుకున్నప్పటికీ 20 రంగాలలో పెట్టుబడులు వచ్చాయి. దేశ, విదేశాల ప్రముఖులకు తమ ప్రభుత్వం ఇచ్చిన నమ్మకం వల్లే పెట్టుబడుల ప్రవాహం వచ్చింది. ఏపీకి సహజ వనరులు ఎన్నో ఉన్నాయి. రాష్ట్ర అభివృద్దికి సీఎం వైఎస్ జగన్ నిరంతరం కృషి చేస్తున్నారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి రెండో రోజు సదస్సు ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ‘‘ఏపీకి వచ్చిన పెట్టుబడులపై ఫాలో అప్ ఉండాలని సీఎం జగన్ సూచించారు. ప్రభుత్వానికి మరింత బాధ్యత పెరిగింది. కోవిడ్ వల్ల రెండేళ్ల పాటు ఈ తరహా సమావేశాలు నిర్వహించలేకపోయాం. టీడీపీ హయాంలో చేసుకున్న ఎంఓయూలలో పది శాతం మాత్రమే ప్రారంభమైతే సీఎం జగన్ హయాంలో ఇప్పటి వరకు 80 నుంచి 90 శాతం ప్రారంభమయ్యాయి. ఈ సమ్మిట్ లో చేసుకున్న ఎంఓయూలు నూరు శాతం ప్రారంభమవుతాయి.’’ అని అమర్నాథ్ పేర్కొన్నారు. అలాగే సమ్మిట్‌పై టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శలపై అమర్నాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అచ్చెన్నాయుడు ఇపుడే నిద్రలేచారా?. అంబానీ, అదానీ, దాల్మియా, బజాంకాలని ఆయన ఎపుడైనా చూశాడా?. ఈ సమ్మిట్‌కు వచ్చిన అనూహ్య స్పందనపై ప్రశంసించకపోయినా పర్వాలేదు, కానీ తప్పుడు విమర్శలేంటి?' అంటూ నిప్పులు చెరిగారు. చదవండి: 'కేంద్రం నుంచి ఏపీకి సంపూర్ణ సహకారం.. రోడ్ కనెక్టివిటీ పెంచేందుకు రూ.20వేల కోట్లు..' -
Tamil Nadu: పెట్టుబడుల వర్షం.. రూ.29వేల కోట్లతో 49 ఒప్పందాలు
తమిళనాడులో పెట్టుబడుల వర్షం కురిసేలా మంగళవారం పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయి. రూ.29 వేల కోట్ల విలువైన 49 ఒప్పందాలకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమక్షంలో పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో కరోనా మహమ్మారిని రూపుమాపేందుకు ప్రాధాన్యతను ఇచ్చిన సీఎం స్టాలిన్ ఆ తరువాత అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించారు. అన్నిశాఖల అధికారులతో సమావేశం అవుతూ మార్పులు చేర్పులు చేశారు. ముఖ్యంగా పారిశ్రామిక ప్రగతిలో తమిళనాడును ప్రథమ స్థానంలో నిలపాలని ఆశిస్తూ పలు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో భారీ పెట్టుబడులతో కొత్త పరిశ్రమల స్థాపనకు ఆహ్వానం, తద్వారా ఉద్యోగావకాశాలు కల్పించాలని నిర్ణయించారు. పెట్టుబడుల ఆకర్షణకు అనేక రాయితీలు ప్రకటించారు. 54వేల మందికి ఉద్యోగావకాశలు దక్కేలా రూ.17వేల కోట్ల అంచనాతో 35 కొత్త ఒప్పందాలపై ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలు పరస్పరం సంతకాలు చేసుకుని మంగళవారం ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. అలాగే రూ.17,297 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు సాగాయి. చెన్నై గిండిలోని ప్రయివేటు స్టార్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన 35 సంస్థలు సీఎం స్టాలిన్ సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నాయి. ఆ తరువాత 14 అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం స్టాలిన్ శంకుస్థాపన చేశారు. మొత్తం 35 ఒప్పందాలతో 49 పథకాల ద్వారా రూ.28,508 కోట్ల విలువైన ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు. ఈ పథకాల ద్వారా 83,472 మందికి ఉద్యోగాలు దక్కే పరిస్థితి ఏర్పడుతుంది. ఇందులో బాగంగా శ్రీపెరంబుదూరులో వంద ఎకరాల్లో రూ.1000 కోట్ల పెట్టుబడులతో సోలార్ ప్యానల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమను నెలకొల్పనున్నారు. ఇందుకు సంబంధించి అమెరికాకు చెందిన ఒక సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభమైతే రాష్ట్రానికి సమృద్ధిగా విద్యుత్ లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. పరిశ్రమల మంత్రి తంగం తెన్నరసు సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
నేడే మారిటైమ్ ఇండియా సదస్సు
న్యూఢిల్లీ: మారిటైమ్ ఇండియా 2021 సదస్సు మంగళవారం జరగనుంది. వర్చువల్‌గా జరిగే ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. రష్యా, అమెరికా, డెన్మార్క్, అఫ్గానిస్తాన్, ఇరాన్, ఖతార్ తదితర దేశాలు పాల్గొననున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా రూ.3.39 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించొచ్చని కేంద్రం భావిస్తోంది. సదస్సులో పాల్గొనేందుకు మంచి స్పందన కనిపిస్తోందని ఇప్పటి వరకు రూ.1.70 లక్షల రిజిస్ట్రేషన్లు నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. పోర్టులు, షిప్పింగ్, జల మార్గాల శాఖ రూ.3.39 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి అవగాహన ఒప్పందాలను (ఎంవోయూలు) రూపొందించే పనిలో ఉందని కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఒప్పందాలపై ఈ ఏడాది మార్చి 2–4 మధ్య జరిగే మారిటైమ్ ఇండియా రెండో విడత సదస్సులో సంతకాలు చేసే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. తీర రాష్ట్రాలు, భాగస్వాములు ఈ ఒప్పందాలపై సంతకాలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. -
బుగ్గన ప్రశ్నలతో ఇరుకున పడ్డ ఏపీ ప్రభుత్వం
-
రూ.లక్షల కోట్ల పెట్టుబడులన్నీ తుస్!
ఎంవోయూలపై సంతకాలు చేయడానికి ముందుకు రాని పెద్ద కంపెనీలు చిన్నా చితక కంపెనీలు, వ్యక్తులను తీసుకురమ్మని పురమాయించిన సర్కారు ఆ బాధ్యత ప్రైవేట్ సంస్థకు అప్పగింత నర్సరావుపేటకు చెందిన దొడ్డాల సుధీర్ ఇలా∙వచ్చిన బాపతే.. సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: ఈ ఇల్లు చూశారా.. ఈ ఇంటికి, విశాఖ భాగస్వామ్య సదస్సులో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వంతో ఎంవోయూ కూదుర్చుకున్న వ్యక్తికి లింక్ పెట్టాలంటే ఏమని చెప్పాలి? రూ.లక్షల కోట్లకు పడగలెత్తిన పారిశ్రామికవేత్త తన బాల్యం జ్ఞాపకాలను జాగ్రత్తగా కాపాడుకుంటున్నారని చెబితే సరిపోతుందా? ప్రభుత్వమైతే ఇలానే చెబుతామంటోంది. రూ.10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చిన ఆ సదస్సులో సాక్షాత్తూ సీఎం చంద్రబాబుతో ఫొటో దిగిన దొడ్డాల సుధీర్ నివాసం ఇది. ఆయన పారిశ్రామికవేత్త కాదు కదా.. కనీసం ఓ చిన్న కంపెనీకి షేర్ హోల్డర్ కూడా కాదు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడుకు చెందిన దొడ్డాల చిట్టిబాబు, కోటేశ్వరమ్మ ఏకైక కుమారుడు దొడ్డాల సుధీర్. పాత పెంకుటిల్లుతోపాటు గ్రామంలో కొద్దిపాటి వ్యవసాయ భూమి ఆయనకున్న ఆస్తి. భార్య అంగన్వాడీ టీచర్. లక్షల కోట్లు వచ్చాయని నమ్మించాలని.. ఈవీఎం కాలేజీలో సుధీర్ పీఆర్వోగా పనిచేస్తూ ఇంటర్మీడియెట్, ఇంజినీరింగ్ విద్యార్థులను కాలేజీలో చేర్చించి కమీషన్లు తీసుకుంటుండేవారు. రెండేళ్ల క్రితం నరసరావుపేట మండలం కోటప్పకొండ సమీపంలో విరించి టౌన్‌షిప్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ భూములు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వాళ్లు ప్లాట్లు వేసి అమ్మకాలు మొదలు పెట్టారు. ఈ కంపెనీలో సుధీర్ ప్లాట్లు విక్రయించేందుకు ఏజెం ట్‌గా చేరారు. కమీషన్లే ఆధారం. కానీ రూ.కోట్లు పెట్టుబడులు పెట్టడానికి వీలుగా ప్రభుత్వంతో కుదిరిన అవగాహనా ఒప్పందం మీద సంతకం చేశారు. రూ.కోట్లాది సొమ్ము ఎలా తెస్తారో అని స్థాని కులు చర్చించుకుంటున్నారు. ఇంతకూ అసలు సంగతేంటంటే భారీ సంఖ్యలో ఎంవోయూలపై సంతకాలు చేయడానికి కంపెనీలను తీసుకురావాలని ప్రభుత్వ పెద్దలు మొదట అధికారులకు పురమాయించారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎంవోయూల మీద సంతకాలు చేయడానికి మనుషులను సమకూర్చే బాధ్యతను ప్రైవేట్ కంపెనీకి అప్పగించింది. వారు సమకూర్చిన వారిలో సుధీర్ ఒకరు. ఇలాంటి వారు, ఊరూపేరు లేని కంపెనీలు ఉన్నాయి. -
'రూ.4.65 లక్షల కోట్ల ఎంవోయూలు'
విశాఖపట్నం: విశాఖలో మూడు రోజులుగా జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు మంగళవారం మధ్యాహ్నం ముగిసింది. ఈ సదస్సులో 331 కంపెనీలతో అవగాహన ఒప్పందాలు, రూ.4,65,577 లక్షల కోట్ల విలువైన ఎంవోయూలు కుదిరినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే ఏడాది కూడా విశాఖలోనే భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తామన్నారు. ఇలాంటి సదస్సులకు విశాఖనే శాశ్వత వేదికని చంద్రబాబు చెప్పారు. తాజా ఒప్పందాలపై వచ్చే ఏడాది జరిపే సదస్సులో సమీక్షిస్తామన్నారు. ముగింపు సదస్సుకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి అనంతకుమార్, పలువురు ఎంపీలు హజరు అయ్యారు. -
విశాఖ సదస్సులో భారీ ఒప్పందాలు