'రూ.4.65 లక్షల కోట్ల ఎంవోయూలు'
విశాఖపట్నం: విశాఖలో మూడు రోజులుగా జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు మంగళవారం మధ్యాహ్నం ముగిసింది. ఈ సదస్సులో 331 కంపెనీలతో అవగాహన ఒప్పందాలు, రూ.4,65,577 లక్షల కోట్ల విలువైన ఎంవోయూలు కుదిరినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే ఏడాది కూడా విశాఖలోనే భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తామన్నారు. ఇలాంటి సదస్సులకు విశాఖనే శాశ్వత వేదికని చంద్రబాబు చెప్పారు. తాజా ఒప్పందాలపై వచ్చే ఏడాది జరిపే సదస్సులో సమీక్షిస్తామన్నారు. ముగింపు సదస్సుకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి అనంతకుమార్, పలువురు ఎంపీలు హజరు అయ్యారు.