CII conference
-
ప్రమాణాలు నెలకొల్పడంలో సత్తా చాటాలి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పగలిగే సత్తా తమలోనూ ఉందని గుర్తించి, ముందుకెళ్లాలని దేశీ తయారీ సంస్థలకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే సూచించారు. విభిన్న ఆవిష్కరణలతో సంస్థలు మెరుగైన ప్రమాణాలు పాటించాలని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు.అంతర్జాతీయ ప్రమాణాలకు సంబంధించి టాప్ అయిదు దేశాల జాబితాలో యూరప్ ఆధిపత్యమే కొనసాగుతుండగా, ఆ లిస్టులో భారత్ లేకపోవడంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. మన దేశ పరిస్థితులకు అనుగుణమైనవి కాకపోయినప్పటికీ మిగతా దేశాలు నెలకొల్పిన ప్రమాణాలను మనం పాటించాల్సిన అవసరం వస్తోందని నిధి వ్యాఖ్యానించారు. కృత్రిమ మేథ విషయంలో భారత్‌లో గణనీయంగా ప్రతిభావంతులు ఉన్నప్పటికీ అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పడంలో వెనకబడినట్లు చెప్పారు. అయితే, ఆ అంశంలో ముందుకెళ్లాలంటే కొన్ని అవరోధాలు ఉన్నాయని, వాటిని అధిగమించాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఇదీ చదవండి: ఓఎన్జీసీ నుంచి పవన్ హన్స్‌కు భారీ ఆర్డర్గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్ (జీఈఎం)తో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్)ను అనుసంధానం చేయడం సహా నాణ్యతా ప్రమాణాలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రపంచ స్థాయి సర్వీసులు అందించేందుకు టెస్టింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించడం, ప్రైవేట్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయడం మొదలైన వాటిపై దృష్టి పెడుతోందని పేర్కొన్నారు. -
రాష్ట్రంలో ప్రత్యేక పారిశ్రామిక పార్క్‌లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక పార్క్‌లు ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలతో పాటు, రాయితీలు అందించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని అన్నారు. అత్యధిక ఉద్యోగాలు కల్పించడానికి అనువుగా సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈలను) కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) వార్షిక సమావేశంలో భట్టి మాట్లాడారు. డెయిరీ అభివృద్ధికి అవకాశాలు రాష్ట్రంలో పాల ఉత్పత్తికి, వినియోగానికి మధ్య వ్యత్యాసం అధికంగా ఉందని, అందువల్ల పాడి పరిశ్రమ అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయని భట్టి పేర్కొన్నారు. స్వచ్ఛమైన పాలను ప్రజలకు అందించేలా డెయిరీ ఇండస్ట్రీని ఏర్పాటు చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు కూడా పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గోదావరి, కృష్ణా నదులను మూసీకి అనుసంధానం చేసి మూసీలో స్వచ్ఛమైన నీరు పారే విధంగా ప్రక్షాళన చేయబోతున్నట్లు తెలిపారు. నది పరివాహక ప్రాంతంలో ఫ్లై ఓవర్లు, చెక్ డ్యామ్, చిల్డ్రన్ పార్క్, అమ్యూజ్మెంట్ పార్క్‌లు, బోటింగ్ తదితర అభివృద్ధి పనులు పీపీపీ విధానంలో చేపడతామని వివరించారు. నగర శివార్లలో ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. టెక్స్టైల్, గ్రానైట్, ఐటీ సెక్టార్, మైన్ తదితర క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం కల్పించిన ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని ఇప్పటివరకు 18.50 కోట్ల మంది మహిళలు వినియోగించుకున్నట్లు భట్టి తెలిపారు. -
5జీకి భారత్ సారథ్యం
న్యూఢిల్లీ: ఆర్థిక వృద్ధి సాధనలో ఏ దేశానికైనా పటిష్టమైన డిజిటల్ వ్యవస్థ అత్యంత కీలకంగా ఉంటోందని అంతర్జాతీయ దిగ్గజ సంస్థల సీఈవోలు తెలిపారు. ఇందుకు ఊతమిచ్చే 5జీ సేవల విస్తరణ విషయంలో మిగతా దేశాలకు భారత్ సారథ్యం వహించగలదని వారు అభిప్రాయపడ్డారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న సందర్భంగా వారు ఈ విషయాలు తెలిపారు. భారత్ ఒక క్రమపద్ధతిలో డిజిటల్ వ్యవస్థను రూపొందించుకుంటోందని నోకియా కార్పొరేషన్ ప్రెసిడెంట్ పెకా లుండ్‌మార్క్ తెలిపారు. భారత్ తమకు ఇప్పుడు రెండో అతి పెద్ద మార్కెట్ అని, ఇక్కడి నుంచి 5జీ బేస్ స్టేషన్లను తాము ఎగుమతి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అమెరికా, చైనాలో ఫేస్బుక్, టెన్సెంట్ వంటి డిజిటల్ కంపెనీల అభివృద్ధిలో 4జీ కీలకపాత్ర పోషించిందని ఎరిక్సన్ ప్రెసిడెంట్ బోర్జే ఎకోమ్ తెలిపారు. దేశీయంగా 5జీ సేవల వేగవంతమైన విస్తరణతో భారత్‌లో అత్యంత ఆధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రాగలవని ఆయన పేర్కొన్నారు. టెక్నాలజీ చౌకగా లభించేలా అంతర్జాతీయ స్థాయిలో నిర్దిష్ట ప్రమాణాలు రూపొందించాల్సిన అవసరం ఉందని నోకియా, ఎరిక్సన్ చీఫ్‌లు అభిప్రాయపడ్డారు. లేకపోతే గ్రామీణ ప్రజానీకం, అంతర్జాతీయ ఎకానమీని డిజిటల్‌గా అనుసంధానం చేయడం కష్టమవుతుందని పేర్కొన్నారు. 100 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు .. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న టాప్ దేశాల్లో ఒకటిగా భారత్ ఉంటోందని జనరల్ అట్లాంటిక్ (ఇండియా) ఎండీ సందీప్ నాయక్ తెలిపారు. ఈ నేపథ్యంలో వచ్చే పదేళ్లలో భారత్‌లోకి 100 బిలియన్ డాలర్ల పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. భారత్‌లోకి వెల్లువెత్తుతున్న ప్రైవేట్ పెట్టుబడులను బట్టి చూస్తే ఇవి ఒక మోస్తరు అంచనాలు మాత్రమేనని నాయక్ వివరించారు. మొబైల్స్ భద్రత కోసం కొత్త నిబంధనలు పరిశ్రమ వర్గాలతో కేంద్రం సంప్రదింపులు యూజర్ల డేటా దుర్వినియోగం, ప్రీ–ఇన్స్టాల్డ్ నిఘా యాప్‌లపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మొబైల్ ఫోన్ల భద్రతా ప్రమాణాలను మరింతగా మెరుగుపర్చడంపై కేంద్రం దృష్టి సారించింది. దీనికి సంబంధించి కొత్త నిబంధనల రూపకల్పనపై పరిశ్రమవర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఒక ట్వీట్లో ఈ విషయాలు వెల్లడించింది. ‘అంతర్జాతీయంగా ఎలక్ట్రానిక్స్ సరఫరా వ్యవస్థలో భారత్ ఒక విశ్వసనీయ దేశంగా ఎదుగుతోంది. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్లు, యాప్‌ల భద్రత చాలా కీలకంగా ఉండబోతోంది. అందుకే తగు స్థాయిలో భద్రతా ప్రమాణాలను రూపొందించేందుకు పరిశ్రమ వర్గాలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది‘ అని పేర్కొంది. మరోవైపు, డేటా దుర్వినియోగాన్ని అరికట్టే విషయంలో తాము కూడా ప్రభుత్వ పక్షానే ఉన్నామని మొబైల్ ఫోన్స్ తయారీ సంస్థలు తెలిపాయి. అయితే, ఈ ప్రక్రియకు సుదీర్ఘ సమయం పడితే కొత్త హ్యాండ్‌సెట్స్‌ను ప్రవేశపెట్టడంలో జాప్యం జరుగుతుందని, అలాగే ప్రీ–ఇన్స్టాల్డ్ (ముందుగానే ఇన్స్టాల్ చేసిన) యాప్స్ ద్వారా వచ్చే ఆదాయంపైనా ప్రభావం పడుతుందని పేర్కొన్నాయి. -
Andhra Pradesh: ఇంధన పొదుపులో ఏపీ సూపర్
సాక్షి, అమరావతి: ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక స్థానంలో నిలిచిందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) డైరెక్టర్ వినీత కన్వాల్ ప్రశంసించారు. ‘ఇంధన సామర్థ్యం ద్వారా లాభదాయకత’పై బీఈఈ, రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం), పారి శ్రామిక నిపుణులతో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సదస్సు నిర్వహించింది. ఏపీఎస్ఈసీఎం సీఈవో చంద్రశేఖరరెడ్డి ఆదివారం ఆ వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇంధన సామర్థ్య ప్రాజెక్టులకు ఆర్థిక సాయాన్ని సులభతరం చేసేందుకు పైలట్ ప్రోగ్రామ్‌గా వంద ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రా జెక్టుల గ్రేడింగ్‌ను ప్రారంభించినట్లు బీఈఈ డైరెక్టర్ తెలిపారు. ఎనర్జీ ఎఫిషియెన్సీ కార్య క్రమాల అమల్లో టాప్ 10 రాష్ట్రాల్లో ఏపీ ఉందన్నారు. ఐవోటీతో పొదుపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విభాగాల్లో ఇంధన సంరక్షణ సెల్స్ ఏర్పాటు చేయడాన్ని బీఈఈ డైరెక్టర్ అభినందించారు. ఇది దేశంలోనే తొలిసారన్నారు. ప్రజల్లో ఇంధన పొదుపుపై అవగాహన కల్పించా లని సూచించారు. రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈల్లో ఇంధన పొదుపు కోసం ఐవోటీ ఆధారిత ప్రాజెక్టు లను ప్రవేశపెట్టడంలాంటి చర్యలను ఈ ప్రస్తా వించారు. ఇంధన సామర్థ్య ప్రాజెక్టులను అమలు చేసే పరిశ్రమలకు వడ్డీ రాయితీ పథకాన్ని ప్రవేశ పెట్టాలని కేంద్ర విద్యుత్తుశాఖను అభ్యర్థించిన తొలి రాష్ట్రం ఏపీ అని గుర్తుచేశారు. ఒక్క పీఏటీ (పెర్ఫా ర్మెన్స్ అఛీవ్మెంట్ ట్రేడ్) పథకం ద్వారానే రాష్ట్రం లో 5,500 మిలియన్ యూనిట్ల (0.21 ఎంటీవోఈ) విద్యుత్తును ఆదాచేసినట్లు ఏపీఎస్ఈసీఎం అధికా రులు తెలిపారు. పీఏటీ రెండోదశలో 0.295 ఎంటీ వోఈ మేర ఇంధనాన్ని ఆదాచేసినట్లు వెల్లడించా రు. ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్ బి.రమేశ్‌ప్రసాద్, సీఐఐ ఏపీ కౌన్సిల్ చైర్మన్ డి.తిరుపతిరాజు, వైస్ చైర్మన్ నీరజ్ సర్దా, టాటా మోటార్స్ ప్రతినిధి విజయ్‌కుమార్ శింపి తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఫైర్
-
గుజరాత్‌కేనా.. హైదరాబాద్‌కు ఆ అర్హత లేదా?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కేంద్రం ఇచ్చిన హామీలను అమలుచేయట్లేదని దక్షణాది రాష్ట్రాలకు ఎప్పుడూ అన్యాయమే జరుగుతోందని మండిపడ్డారు. ఆత్మనిర్భర్ భారత్ కేవలం నినాదంగానే మిగిలిందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సీఐఐ సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘ వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరి అన్నారు.. 60 ఎకరాల ల్యాండ్ అడిగితే 150 ఎకరాలు ఇచ్చాము. కానీ, ఫ్యాక్టరీ లేదు. ఐటీఐఆర్ కారిడార్ రద్దు చేశారు. తెలంగాణకి అన్యాయం చేశారు. మేకిన్ ఇండియా అన్నారు. ఒక్క ఇండస్ట్రియల్ జోన్ కూడా తెలంగాణకు ఇవ్వలేదు. ఇక ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఊసులేదు. కేంద్రం హామీలిచ్చి మారిస్తే ఎవర్ని అడగాలి. ఎలక్షన్స్ కోసం కాదు.. ప్రజలకోసం.. ఇండియా కోసం పనిచేయండి. దిగుమతి సుంకాలు పెంచి మేక్ ఇన్ ఇండియా అంటే కంపెనీలు వస్తాయా?. తెలంగాణ నుంచి ఎక్కువ రెవెన్యూ తీసుకుంటూ.. తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. బులెట్ ట్రైన్ గుజరాత్‌కి మాత్రమేనా?.. హైదరాబాద్‌కి అర్హత లేదా?. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ అడిగాం. కేంద్రం పట్టించుకోవడం లేదు. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ల్యాండ్ ఇస్తామన్నా అస్సలు పట్టించుకోవడం లేదు’’ అని అన్నారు. చదవండి : ఒక్క పోస్టూ ఖాళీగా ఉండొద్దు -
కోవిడ్ సంక్షోభం తర్వాత అనేక అవకాశాలు
సాక్షి, హైదరరాబాద్: ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత అనేక అవకాశాలు వస్తాయని పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు అన్నారు. ఇప్పటికే తెలంగాణ పెట్టుబడులకు ఆకర్షణీయమైన కేంద్రంగా మారిందన్నారు. అయితే ప్రస్తుత సంక్షోభం తర్వాత వివిధ రంగాల్లో రానున్న మార్పులకు అనుగుణంగా మరిన్ని పెట్టుబడులను తెలంగాణకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా కేటీఆర్ తెలియజేశారు. గురువారం సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రెండు రోజులపాటు “ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ అప్పార్చునిటీస్ ఇన్ పోస్ట్ కోవిడ్ వరల్డ్” పేరుతో నిర్వహిస్తున్న ఈ వర్చువల్ కాన్ఫరెన్స్‌లో పలువురు ప్రముఖ పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐఐ రూపొందించిన ‘నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్’ పేరుతో ఒక నివేదికను విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న సంక్షోభం ద్వారా ప్రపంచం డిజిటలీకరణ వైపు వెళ్తుందని తెలిపిన మంత్రి కేటీఆర్, తెలంగాణ సైతం ఈ మార్గాన్ని అందిపుచ్చుకోవడానికి ముందువరుసలో ఉందన్నారు. ఇప్పటికే తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్ అందించే కార్యక్రమానికి సంబంధించిన పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలియజేశారు. పల్లెలకు ఇంటర్నెట్.. విప్లవాత్మక మార్పులు పల్లెలకు ఇంటర్నెట్ వెళ్ళిన తర్వాత ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్ వంటి రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని, ఇది డిజిటల్ విప్లవం వైపుగా తెలంగాణను తీసుకెళ్తుందన్న విశ్వాసాన్ని కేటీర్ వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక కొత్త అవకాశాలు వస్తాయని, ఆ దిశగా వారిని నైపుణ్య శిక్షణలో భాగస్వాములు చేసేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ద్వారా వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 14 ప్రాధాన్యత రంగాలను ఎంచుకుని ఆ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తుందని తెలిపిన మంత్రి కేటీఆర్, ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పెట్టుబడిదారులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. దీంతోపాటు హైదరాబాద్‌ని ‘స్టార్టప్ క్యాపిటల్’గా తయారు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. టీ హబ్ ఏర్పాటు ఇండియన్ స్టార్టప్ సిస్టంలో ఒక గొప్ప మార్పుకి కారణం అయ్యిందన్నారు. ఇప్పటికే టీ హబ్ ద్వారా అనేక స్టార్టప్ కంపెనీలు గొప్ప ప్రగతిని సాధించాయన్నారు. దీంతో పాటు మహిళల కోసం ప్రత్యేకంగా వీ హబ్‌ని కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. (చదవండి: ప్రపంచం చూపు మన వైపు) వ్యాపారానికే కాక వ్యవసాయానికి ప్రాధాన్యత భారీ స్థాయిలో పారిశ్రామిక పార్కులు ఉండాలన్న బృహత్తర లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు కేటీఆర్. ఇప్పటికే ఈ దిశగా దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక పార్కులను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్.. హైదరాబాద్ ఫార్మా సిటీతో పాటు దేశంలోని అతిపెద్ద టెక్స్టైల్ పార్క్.. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైసెస్ లాంటి వివిధ పారిశ్రామిక పార్కుల అభివృద్ధి చేపడుతున్నామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలియజేశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి పోల్చిచూస్తే రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో ఉన్నత ప్రమణాలు నెలకొల్పామన్నారు. దేశంలోని 24 గంటలపాటు గృహ, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేవలం వ్యాపార సంస్కరణలకు, పెట్టుబడుల ఆకర్షణలో మాత్రమే కాకుండా వ్యవసాయ రంగానికి సైతం పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు రైతు బంధు, రైతు బీమా రైతు సంక్షేమ కార్యక్రమాల ద్వారా రైతాంగంలో వ్యవసాయం పట్ల సానుకూల దృక్పథం ఏర్పడిందని తెలిపారు కేటీఆర్. (చదవండి: ఇంటింటికీ ఇంటర్నెట్ ) తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల వలనే దేశంలోనే అత్యధికంగా సాగు నమోదు అయిందన్నారు కేటీఆర్. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది సుమారు 36 శాతం సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. తెలంగాణ రైతాంగానికి, వారి సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో తనదైన శైలితో ముందుకు పోతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. -
ఆర్థిక వ్యవస్థకు బూస్ట్..
న్యూఢిల్లీ: మందగమన సంకేతాలతో సతమతమవుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్రం తగు చర్యలు తీసుకుంటుందని పరిశ్రమ వర్గాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసానిచ్చారు. ఎకానమీకి తోడ్పాటునిచ్చే చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఒకే అభిప్రాయంతో ఉన్నాయని ఆమె చెప్పారు. శుక్రవారం జరిగిన పరిశ్రమల సమాఖ్య సీఐఐ జాతీయ మండలి సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ‘ఎకానమీకి ఊతమిచ్చే చర్యలు తీసుకునే విషయంలో రిజర్వ్ బ్యాంక్, ప్రభుత్వం ఒకే అభిప్రాయంతో ఉన్నాయి‘ అని ఆమె తెలిపారు. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య సుహృద్భావ వాతావరణమే ఉందన్నారు. పరిశ్రమ వర్గాలకు పరిస్థితులను కఠినతరం చేయాలన్న ఉద్దేశమేదీ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ పురోగతికి సూచనగా నిలిచే కీలక రంగాల వృద్ధి గణాంకాలు, ఆటోమొబైల్ తదితర రంగాల పనితీరు నానాటికి దిగజారుతుండటంతో పాటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం (ఎన్బీఎఫ్సీ) పలు సవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలిస్తున్నామని, రాబోయే వారాల్లో పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని నిర్మలా సీతారామన్ తెలిపారు. కాస్త మందగించినా భారత్ .. ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని ఈ సందర్భంగా సీతారామన్ చెప్పారు. సీఎస్‌ఆర్‌పై భరోసా.. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద కంపెనీలు తప్పనిసరిగా నిర్దేశిత మొత్తం కేటాయించకపోతే తీసుకునే కఠిన చర్యలను ప్రభుత్వం మరోసారి సమీక్షిస్తుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘ఎవరిపైనా క్రిమినల్ కేసులు పెట్టాలన్న ఉద్దేశమేదీ ప్రభుత్వానికి లేదు‘ అని ఆమె స్పష్టం చేశారు. ఆదాయ పన్ను శాఖపరమైన వేధింపుల ఆరోపణల గురించి తెలుసుకునేందుకు వచ్చే వారం నుంచి పరిశ్రమ వర్గాలతో సమావేశం కానున్నట్లు ఆమె తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు ఆమె వివరించారు. ఫిర్యాదుల పరిష్కారానికి తక్షణ చర్యలు కూడా తీసుకోనున్నట్లు నిర్మలా సీతారామన్ వివరించారు. అప్పటికప్పుడు పన్ను అధికారులకు ఆయా అంశాలకు సంబంధించిన ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందన్నారు. పన్నులపరమైన వేధింపు ఉదంతాలను స్వయంగా తానే పరిశీలించేందుకు వీలుగా టెక్నాలజీ ఆధారిత ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఇక కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గించాలని ప్రభుత్వానికి కూడా ఉందని, అయితే.. కార్పొరేట్లు ఇందుకోసం కొంత ఓపిక పట్టాల్సి ఉంటుందని ఆమె వివరించారు. మరోవైపు, వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి కార్పొరేట్లు, సరఫరాదారులకు రావాల్సిన బకాయిల సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టినట్లు మంత్రి చెప్పారు. చిన్న, మధ్యతరహా సంస్థలకు రావాల్సిన బకాయిలు ఏకంగా రూ. 48,000 కోట్ల మేర ఉంటాయని అంచనా. పన్ను ఊరట కల్పించండి: ఎఫ్‌పీఐల వినతి అధిక ఆదాయవర్గాలపై అదనపు సర్‌చార్జీలు తదితర అంశాలతో ఆందోళన చెందుతున్న మార్కెట్ వర్గాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు శుక్రవారం నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. అదనపు సర్‌చార్జీ నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐ) మినహాయింపునివ్వాలని, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) సమీక్షించాలని, దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ)ని పూర్తిగా ఎత్తివేయడం లేదా కనీసం తగ్గించడమైనా చేయాలని కోరుతూ డిమాండ్ల చిట్టాను మంత్రికి అందజేశారు. గోల్డ్‌మన్ శాక్స్, నొమురా, బ్లాక్‌రాక్, సీఎల్ఎస్ఏ, బార్క్లేస్, జేపీ మోర్గాన్ తదితర సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎఫ్‌పీఐల అభిప్రాయాలను మంత్రి సావధానంగా విన్నారని.. అయితే ఎటువంటి హామీ మాత్రం ఇవ్వలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. రూ. 2 కోట్ల పైగా ఆదాయం ఉన్న వారికి వర్తించే పన్నులతో పాటు అదనపు సర్‌చార్జీ కూడా విధించాలని బడ్జెట్లో చేసిన ప్రతిపాదనతో ఆందోళన చెందుతున్న ఎఫ్‌పీఐలు స్టాక్‌మార్కెట్లలో భారీగా విక్రయాలు జరపడం, మార్కెట్లు భారీగా పడటం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆర్థిక మంత్రితో ఎఫ్‌పీఐల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. నిధుల అవసరాల కోసం ఎన్బీఎఫ్సీలు కేవలం బ్యాంకులపైనే ఆధారపడకుండా ఇతరత్రా సాధనాలూ పరిశీలించాలని, అలాగే ఈ రంగానికి కూడా నేషనల్ హౌసింగ్ బోర్డు (ఎన్‌హెచ్‌బీ) తరహాలో ప్రత్యేక నియంత్రణ సంస్థ ఏర్పాటు చేయాల్సిన అవ సరం ఉందని ఫైనాన్స్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్ రామన్ అగర్వాల్ చెప్పారు. -
జలరవాణాకు అత్యంత ప్రాధాన్యం: గడ్కరీ
విశాఖ: జలరవాణాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, పంజాబ్ ఎన్నికల తర్వాత బకింగ్ హామ్ కెనాల్ పనులు ప్రారంభిస్తామని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ చెప్పారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు కార్యక్రమంలో పారిశ్రామిక కారిడార్‌పై నిర్వహించిన సెషన్లో ఆయన మాట్లాడారు. విశాఖ పోర్టు లాభాలను బకింగ్‌హామ్ కెనాల్ అభివృద్ధికి ఉపయోగిస్తామని చెప్పారు. జలరవాణాకు భూసేకరణ చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనంటూ ఆంధ్రప్రదేశ్‌లో భూసేకరణ సమస్య ఉండదని భావిస్తున్నానన్నారు. ఏపీలో 2 లక్షల కి.మీ. మేర జాతీయ రహదారులు నిర్మించాలనుకున్నాం.. ఇప్పటికే రూ.1.70 లక్షల కి.మీ మేర జాతీయ రహదారులు నిర్మించాం.. సాగర్మాల ప్రాజెక్టు అత్యంత ప్రతిష్ఠాత్మకమైంది.. ఈ ప్రాజెక్టులో తీర ప్రాంత అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తాం అని ఆయన తెలిపారు. పోర్టు ఆధారిత అభివృద్ధి తమ లక్ష్యం అని, రెండు తీరప్రాంత ఆర్థిక కేంద్రాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయని, విశాఖ పోర్టు వద్ద రూ.6 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నామని, ఏపీలో తీర ప్రాంత అభివృద్ధి కేంద్రాల్లో రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు తమ లక్ష్యమని అన్నారు. అనంతపురం-అమరావతి రహదారి పనులు వీలైనంత త్వరగా ప్రారంభిస్తామన్నారు. రాయపూర్-విశాఖ రహదారి పనులనూ చేపడతామని, ఈ ప్రాజెక్టు వ్యయం రూ.5 వేల కోట్లు అని, చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యం అని గడ్కరీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నామంటూ ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా ముందు రహదారులు అభివృద్ధి చెందాలన్నారు. రాష్ట్రంలో అన్ని పోర్టులను అనుసంధానిస్తూ రహదారుల నిర్మాణం జరపాలని, విశాఖ-రాయపూర్ మధ్య మలుపులు లేని 6 లేన్ల రహదారి నిర్మించాలని కోరుతున్నామన్నారు. రహదారికి సమాంతరంగా రైల్వే లైను కూడా ఏర్పాటు చేయాలంటూ దేశంలో అత్యుత్తమ రహదారుల నిర్మాణానికి గడ్కరీ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్, ఏరో స్పేస్, డిఫెన్స్, లైవ్‌స్టాక్, ఆక్వా.. ఇలా అన్నింటా సానుకూల వాతావరణం ఉందంటూ ఏపీ నంబర్ వన్ రాష్ట్రంగా మారుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు అని పేర్కొన్నారు. కాగా, సమావేశానికి ముందు గడ్కరీతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. -
'రూ.4.65 లక్షల కోట్ల ఎంవోయూలు'
-
'రూ.4.65 లక్షల కోట్ల ఎంవోయూలు'
విశాఖపట్నం: విశాఖలో మూడు రోజులుగా జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు మంగళవారం మధ్యాహ్నం ముగిసింది. ఈ సదస్సులో 331 కంపెనీలతో అవగాహన ఒప్పందాలు, రూ.4,65,577 లక్షల కోట్ల విలువైన ఎంవోయూలు కుదిరినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే ఏడాది కూడా విశాఖలోనే భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తామన్నారు. ఇలాంటి సదస్సులకు విశాఖనే శాశ్వత వేదికని చంద్రబాబు చెప్పారు. తాజా ఒప్పందాలపై వచ్చే ఏడాది జరిపే సదస్సులో సమీక్షిస్తామన్నారు. ముగింపు సదస్సుకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి అనంతకుమార్, పలువురు ఎంపీలు హజరు అయ్యారు. -
ప్లానర్స్‌కు మోడల్ స్టేట్‌గా తెలంగాణ
సీఐఐ సదస్సులో కేటీఆర్ హైదరాబాద్: రానున్న రోజుల్లో నిర్మాణ రంగ ప్లానర్ల్లకు మోడల్ స్టేట్‌గా తెలంగాణ నిలుస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడంలో భాగంగా పట్టణీకరణతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల అనుసంధానానికి భారీగా వ్యయం చేస్తున్నట్టు చెప్పారు. మౌలిక రంగంపై శుక్రవారమిక్కడ సీఐఐ ఏర్పాటు చేసిన సదస్సులో ముఖ్య అతిథిగా విచ్చేసి పారిశ్రామికవేత్తలను ఉద్ధేశించి మంత్రి ప్రసంగించారు. పారిశ్రామిక పార్కులు, విమానాశ్రయాలు, డ్రై పోర్టులతోపాటు సామాజిక మౌలిక వసతులైన విద్యుత్, నీరు, ఇల్లు, ప్రజా రవాణాపైనా దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగానే ఇంటింటికీ నల్లాల ద్వారా మంచి నీటి సరఫరా ప్రాజెక్టును ప్రాధాన్యతగా తీసుకున్నామని వివరించారు. మరిన్ని పీపీపీ ప్రాజెక్టులు.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)లో తెలంగాణలో మరిన్ని మౌలిక ప్రాజెక్టులు రావాలని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సీఈవో ఎస్జీకే కిశోర్ సూచించారు. ఏరోస్పేస్ రంగంలో మానవ వనరుల కొరతను తీర్చేందుకు శిక్షణ సంస్థ ఏర్పాటు అవసరమన్నారు. హైదరాబాద్‌తోసహా ఇతర ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలని సీఐఐ తెలంగాణ శాఖ చైర్పర్సన్ వనిత దాట్ల అభిప్రాయపడ్డారు. శంషాబాద్ విమానాశ్రయం విస్తరణ... పెరుగుతున్న ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్‌ను జీఎంఆర్ విస్తరించనుంది. ఈ విస్తరణ పనులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించనుంది. విస్తరణ పూర్తి అయితే వార్షిక సామర్థ్యం 1.2 కోట్ల నుంచి 2 కోట్ల ప్రయాణికులకు చేరనుందని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సీఈవో ఎస్జీకే కిశోర్ వెల్లడించారు. 80 వేల టన్నులున్న కార్గో సామర్థ్యం 2016 మార్చికల్లా లక్ష టన్నులకు చేరుతుందని చెప్పారు. ప్రయాణికుల రద్దీ 2014-15లో ఒక కోటి కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 1.2 కోట్లుగా ఉండొచ్చని.. అయిదేళ్లలో 2 కోట్లను తాకుతుందని భావిస్తున్నామని అన్నారు. విస్తరణకు రూ.1,000 కోట్ల వ్యయం అయ్యే అవకాశం ఉంది. -
కేక్‌లా కట్‌చేసి ప్యాకేజీలా..?
సీఐఐ సదస్సులో కేంద్రమంత్రి జైరాం రమేష్‌పై పారిశ్రామికవేత్తల ఆగ్రహావేశాలు సాక్షి, విశాఖపట్నం: ‘‘రాష్ట్రాన్ని కేక్‌లా కట్‌చేశారు.. ఇప్పుడేమో అభివృద్ధి, ప్యాకేజీలంటూ గొప్పలు చెబుతున్నారు. రేపు ఎన్నికల్లో మీరు ఓడిపోతే మాకు దిక్కెవరు? మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి’’ అని పలువురు పారిశ్రామికవేత్తలు కేంద్రమంత్రి జైరాం రమేష్‌ను నిలదీశారు. విశాఖపట్నంలో సోమవారం జరిగిన సీఐఐ సదస్సులో మంత్రిని పారిశ్రామికవేత్తలు పలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. సీమాంధ్ర గురించి మీకేం తెలుసు.. ఎందుకు విభజించారని చిన్న, మధ్య తరహా పరిశ్రమల సమాఖ్య ప్రతినిధి ఒకరు ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజించారు.. ఇప్పుడేమో ప్రత్యేక హోదా.. ప్యాకేజీలంటున్నారు.. అసలు మీరు మళ్లీ అధికారంలోకి రాకపోతే మా భవిష్యత్ ఏమిటి? మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి.. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈ హామీలను అమలుపరుస్తుందన్న గ్యారంటీ ఏమిటి? అని వరుస ప్రశ్నలు సంధించారు. పారిశ్రామికవేత్త ఆర్వీఎస్ రాజు ప్రత్యేక హోదా పదేళ్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఐటీ కంపెనీల ప్రతినిధి ఓ.నరేష్కుమార్ మాట్లాడుతూ సీమాంధ్ర అభివృద్ధి చెంది, కొత్త రాజధాని వచ్చేవరకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ తేదీని వాయిదా వేయాలని కోరారు. అనంతరం ప్రసంగించిన ఆయన తెలంగాణ డిమాండ్ ఎప్పటిదోనని, ఒకప్పుడు సీమాంధ్రవాసులు కూడా జైఆంధ్ర ఉద్యమం చేశారు కదా? అని ప్రశ్నించారు. దీంతో పారిశ్రామికవేత్తలంతా ఒక్కసారిగా లేచి అభ్యంతరం వ్యక్తం చేసి మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆయన.. వారిని మై ఫ్రెండ్స్ అంటూ శాంతపరిచేలా ప్రసంగించారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆందోళన కేంద్రమంత్రి జైరాం రమేష్ పర్యటనకు నిరసనగా వైస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆందోళన చేపట్టింది. జైరాం రమేష్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రం ముక్కలైనా సీఐఐ ఒక్కటిగానే ఉండాలి: జైరాం రమేష్ రాష్ట్ర విభజన నిర్ణయం బాధాకరమేనని కేంద్రమంత్రి జైరాం రమేష్ అన్నారు. రాష్ట్రం ముక్కలైనా పరిశ్రమల సమాఖ్యకు సంబంధించిన సీఐఐ మాత్రం ఒక్కటిగానే ఉండాలని ఆకాంక్షించారు. విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వికేంద్రీకరణ జరగకపోవడంతో ఒక్క హైదరాబాద్ చుట్టూనే అభివృద్ధి మొత్తం పరిమితమైందని చెప్పారు. దీనికి నిదర్శనం రాజధానిలో 435 వివిధ రకాల కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విభాగాలు ఏర్పడట మేనన్నారు. హైదరాబాద్‌ను అన్నీ దొరికే ఒక ఐలాండ్‌గా మార్చేశారన్నారు. రెండేళ్లలో హెదరాబాద్ కన్నా వేగంగా అభివృద్ధి సాధిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తంచేశారు.