సాక్షి, అమరావతి: ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక స్థానంలో నిలిచిందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) డైరెక్టర్ వినీత కన్వాల్ ప్రశంసించారు. ‘ఇంధన సామర్థ్యం ద్వారా లాభదాయకత’పై బీఈఈ, రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ (ఏపీఎస్‌ఈసీఎం), పారి శ్రామిక నిపుణులతో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సదస్సు నిర్వహించింది.
ఏపీఎస్‌ఈసీఎం సీఈవో చంద్రశేఖరరెడ్డి ఆదివారం ఆ వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇంధన సామర్థ్య ప్రాజెక్టులకు ఆర్థిక సాయాన్ని సులభతరం చేసేందుకు పైలట్ ప్రోగ్రామ్‌గా వంద ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రా జెక్టుల గ్రేడింగ్‌ను ప్రారంభించినట్లు బీఈఈ డైరెక్టర్ తెలిపారు. ఎనర్జీ ఎఫిషియెన్సీ కార్య క్రమాల అమల్లో టాప్ 10 రాష్ట్రాల్లో ఏపీ ఉందన్నారు.
ఐవోటీతో పొదుపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విభాగాల్లో ఇంధన సంరక్షణ సెల్స్ ఏర్పాటు చేయడాన్ని బీఈఈ డైరెక్టర్ అభినందించారు. ఇది దేశంలోనే తొలిసారన్నారు. ప్రజల్లో ఇంధన పొదుపుపై అవగాహన కల్పించా లని సూచించారు. రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈల్లో ఇంధన పొదుపు కోసం ఐవోటీ ఆధారిత ప్రాజెక్టు లను ప్రవేశపెట్టడంలాంటి చర్యలను ఈ ప్రస్తా వించారు. ఇంధన సామర్థ్య ప్రాజెక్టులను అమలు చేసే పరిశ్రమలకు వడ్డీ రాయితీ పథకాన్ని ప్రవేశ పెట్టాలని కేంద్ర విద్యుత్తుశాఖను అభ్యర్థించిన తొలి రాష్ట్రం ఏపీ అని గుర్తుచేశారు.
ఒక్క పీఏటీ (పెర్ఫా ర్మెన్స్ అఛీవ్‌మెంట్ ట్రేడ్) పథకం ద్వారానే రాష్ట్రం లో 5,500 మిలియన్ యూనిట్ల (0.21 ఎంటీవోఈ) విద్యుత్తును ఆదాచేసినట్లు ఏపీఎస్‌ఈసీఎం అధికా రులు తెలిపారు. పీఏటీ రెండోదశలో 0.295 ఎంటీ వోఈ మేర ఇంధనాన్ని ఆదాచేసినట్లు వెల్లడించా రు. ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్ బి.రమేశ్‌ప్రసాద్, సీఐఐ ఏపీ కౌన్సిల్ చైర్మన్ డి.తిరుపతిరాజు, వైస్ చైర్మన్ నీరజ్ సర్దా, టాటా మోటార్స్ ప్రతినిధి విజయ్‌కుమార్ శింపి తదితరులు పాల్గొన్నారు.
Andhra Pradesh: ఇంధన పొదుపులో ఏపీ సూపర్
Published Mon, Nov 1 2021 3:19 AM | Last Updated on Mon, Nov 1 2021 9:11 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment