సాక్షి, విశాఖపట్నం: మళ్లీ ఓటుకు నోటు రాజకీయాలకు టీడీపీ సిద్ధమవుతోంది. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకపోయినా పోటీకి దిగే యోచనలో ఉంది. ఓట్ల కొనుగోలుకు డబ్బున్న అభ్యర్థిని టీడీపీ తెరపైకి తెచ్చింది. గత ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి ఎంపీ సీటుకు ప్రయత్నించిన బైరా దీలీప్ చక్రవర్తి తెరపైకి వచ్చారు. టీడీపీలో సభ్యత్వం లేకపోయినా దిలీప్‌ను పోటీకి దించాలనే కూటమి భావిస్తోంది. డబ్బులు పెట్టి ఓట్లు కొనాలని దిలీప్‌కు టీడీపీ టాస్క్ ఇచ్చినట్లు సమాచారం.
ఓడిపోయినా సరే పోటీ చేయాలని బైరా దిలీప్‌పై టీడీపీ ఒత్తిడి తెస్తోంది. ఓడిపోతే ప్రభుత్వం ఉంది కాబట్టి కాంట్రాక్ట్‌లు ఇస్తామంటూ ఆఫ్‌ర్ ఇచ్చినట్లు సమాచారం. కాంట్రాక్ట్‌ల ద్వారా డబ్బు సంపాదనకు టీడీపీ పోటీకి దింపుతోంది. ఇప్పటికే డబ్బులు పెట్టేది లేదని ఇప్పటికే పీలా గోవింద్, గండి బాబ్జి చెప్పేశారు.
మొత్తం 840 ఓట్లు ఉండగా, 11 ఖాళీలు ఉన్నాయి. వైఎస్సార్‌సీపీకి 615 మంది ప్రజాప్రతిధులు ఉండగా, టీడీపీకి కేవలం 214 మంది మాత్రమే ఉన్నారు. 400 మంది వ్యత్యాసం ఉన్నా పోటీకి దిగాలని కూటమి నిర్ణయం తీసుకుంది. ఓటుకు నోటు రాజకీయానికి టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు రెడీ అయ్యారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లను కొనేందుకు అప్పగింతల తంతు కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment