సాక్షి, గుంటూరు: ప్రభుత్వ బడుల్లో ఐబీ సిలబస్ చారిత్రక నిర్ణయమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అభివర్ణించారు. ఏపీ కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం.. మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలను ఆయన సచివాలయం నుంచి మీడియాకు తెలియజేశారు.
మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకున్నది. విద్యాశాఖలో అంతర్జాతీయ ప్రమాణాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. ఐబీ సిలబస్ దిశగా అడుగులు వేస్తున్నాం. అమెరికాలో ఇలాంటి సిలబస్ ఉంది. ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయటం బాల్యం నుండే విద్యార్థులకు ఉపయోగపడుతుంది. దీంతో పాటు..
►కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ చేసేందుకు నిర్ణయించింది. తద్వారా.. 10,115 మంది కాంట్రాక్టు ఉద్యోగులు, 11,630 మంది ఏపీవీపీలో పనిచేసే ఉద్యోగులకు మేలు చేకూరుతుంది.
►ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యేనాటికి ఇంటిస్థలం అందించాలని నిర్ణయం తీసుకున్నాం. దాన్ని ప్రభుత్వ బాధ్యతగా తీసుకుంటాం. అలాగే.. రిటైర్ అయిన ఉద్యోగుల కుటుంబాల పిల్లలకు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్ మెంట్ అమలు చేయాలని నిర్ణయించాం
►క్యాన్సర్ రోగులకు మరింత వైద్య సేవలకోసం గుంటూరు, వైజాగ్ ప్రభుత్వ ఆస్పత్రిలో 350 పోస్టుల భర్తీకి నిర్ణయం. 53 వేల ఉద్యోగాలను వైద్య అరోగ్య శాఖలో ఇప్పటి వరకు ఇచ్చాం. ఒక్క ఖాళీ కూడా ఉండకూడదని నిర్ణయం తీసుకున్నాం. ఒంగోలు,ఏలూరు, విజయవాడ లోని నర్సింగ్ కాలేజీల్లో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. ఆరోగ్య సురక్ష ద్వారా మరింత మేలైన వైద్యం అందించాలని నిర్ణయం. సురక్ష క్యాంపులలో మంత్రులు,ఎమ్మెల్యేలు పాల్గొనాలని సీఎం జగన్ ఆదేశించారు. సెప్టెంబరు 30న ప్రారంభమై 45 రోజులపాటు క్యాంపులు జరుగుతాయి. కురుపాం మెడికల్ కాలేజీలో 50 % గిరిజనులకు సీట్లు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది కేబినెట్.
►UPSC ఎగ్జామ్స్ కు వెళ్లేవారికి ‘‘జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం’’ పేరుతో ఆర్థిక సాయం అందించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఇందుకుగానూ రూ.50 వేల నుండి లక్ష రూపాయల వరకు సాయం అందించనుంది ప్రభుత్వం.
►ఇక.. తొమ్మిది మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలని నిర్ణయం
►కాకినాడ బల్క్ డ్రగ్ ప్రాజెక్టును నక్కపల్లికి తరలిస్తూ నిర్ణయం
►ప్రభుత్వ భూమిలోనే ఈ ప్రాజెక్టును పెట్టాలని కేంద్రం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం
►హైకోర్టు లో 28 మంది డ్రైవర్ల నియామకానికి నిర్ణయం
►భూదాన్ చట్టంలో సవరణలకు ఆమోదం
►విశాఖపట్నంలో ఐదు ఎకరాల్లో ఓ భారీ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది కేబినెట్. వైజాగ్ పరిపాలనా రాజధాని అనేది ఆల్రెడీ నిర్ణయం జరిగింది. పరిపాలనా సౌలభ్యం ప్రకారం జరుగుతుంది. రాజధానిగా తక్కువ ఖర్చుతో వైజాగ్ పూర్తవుతుంది.
చంద్రబాబు కోసం యాక్టర్‌ను తెచ్చారు
చంద్రబాబు అరెస్టు వెనుక వాస్తవాలు ప్రజలకు బాగా తెలుసు. ఆయన్ని అరెస్టు చేయటం వలన ఎలాంటి స్పందన లేదని సినిమా యాక్టర్ని తెచ్చారు. వెంటనే ఆయన ములాఖత్ పేరుతో మిలాఖత్ అయ్యారు. దాంతో టీడీపీ క్యాడర్లో కూడా నీరసం వచ్చింది. చంద్రబాబు తప్పేమీ చేయలేదని టీడీపీ నేతలు తీర్పులు ఇస్తున్నారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు వక్రభాష్యం చెప్తున్నారు. కేంద్ర నిఘా సంస్థలే స్కిల్ స్కాం జరిగినట్టు నిర్ధారించాయి. ఓటుకు నోటు కేసులో భయపడి రాత్రికి రాత్రి చంద్రబాబు పారిపోయి వచ్చాడు. వ్యవస్థలను మేనేజ్ చేయటంలో చంద్రబాబు స్కిల్ ఉన్న వ్యక్తి.. చాలా స్కాంలు చేశారు.
పోలవరాన్ని ఏటీఎంలాగా వాడుకుంటున్నారని ప్రధానే చెప్పారు. కేసుల్లో నిందితుడు కాబట్టే చంద్రబాబును అరెస్టు చేశారు. ఐటీ తెచ్చిందే తానని చంద్రబాబు చెప్పుకోవటం సిగ్గుచేటు. చంద్రబాబు విధానాల వలన బీసీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. వైఎస్సార్ వచ్చాకే ఫీజు రియంబర్స్ మెంట్ తెచ్చారు. దానిద్వారా బీసీలతోపాటు అందరికీ మేలు చేకూరింది. అలాంటప్పుడు చంద్రబాబు ఏం చేశారు? అని మంత్రి వేణు విమర్శలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment