
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయం అంతా కుట్రలు, కుతంత్రాలతో నడుస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ప్రతిపక్ష నేతలను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కొనుగోలు రాజకీయాలకు చంద్రబాబే ప్రధాన నిదర్శనం అంటూ మండిపడ్డారు.
మాజీ మంత్రి చెల్లుబోయిన తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంతో రాష్ట్రంలో పౌర సమాజానికి ముప్పు పొంచి ఉంది. ఫిర్యాదు చేసిన వ్యక్తులను ముద్దాయిలుగా మారుస్తున్నారు. చంద్రబాబు రాజకీయం అంతా కుట్ర కుతంత్రాలతో నిండి ఉంది. స్థానిక సంస్థల్లో బలం లేకపోయినా బలవంతంగా దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా నాయకులను కొనుగోలు చేస్తున్నారు. ప్రతిపక్షాలను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కొనుగోలు రాజకీయాలకు చంద్రబాబే ప్రధాన నిదర్శనం. హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కొనుగోలుకు సంబంధించి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. ఉమ్మడి రాజధానికి పదేళ్ల కాలం ఉన్నా రాత్రికి రాత్రే చంద్రబాబు వచ్చేశారు. తెలంగాణ నుంచి రావాల్సిన ఆస్తులు విలువ లక్షా పదివేల కోట్లు చంద్రబాబు వల్లే రాలేదు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోందని అనేక ఆరోపణ చేశారు. కేవలం అధికారం కోసం విష ప్రచారం చేశారు అని ఘాటు విమర్శలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment