కక్ష సాధింపే కూటమి సర్కార్‌ లక్ష్యం: మాజీ మంత్రి చెల్లుబోయిన | Chelluboyina Venugopala Krishna Serious On AP Govt And Chandrababu | Sakshi
Sakshi News home page

కక్ష సాధింపే కూటమి సర్కార్‌ లక్ష్యం: మాజీ మంత్రి చెల్లుబోయిన

Published Tue, Aug 13 2024 2:41 PM | Last Updated on Tue, Aug 13 2024 3:22 PM

Chelluboyina Venugopala Krishna Serious On AP Govt And Chandrababu

సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో కూటమి సర్కార్‌ ప్రతిపక్షాల గొంతు నొక్కడమే లక్ష్యంగా పని చేస్తోందన్నారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. అలాగే, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ఎందుకు హామీలు నెరవేర్చలేకపోతున్నారని ప్రశ్నించారు.  

కాగా, మాజీ మంత్రి చెల్లుబోయిన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం కక్ష సాధించే లక్ష్యంగా పనిచేస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్‌ కక్ష తీర్చుకోవడానికి ఆయన కుమారుడిని టార్గెట్ చేయడం దారుణం. 2019లో కేవలం రూ.100 కోట్లతో ఖజానాను అప్పగించారు. రాష్ట్రం విపరీతంగా అప్పుల్లో కూరుకుపోయిందని ప్రచారం చేశారు.

అయితే, రాష్ట్రం అప్పుల్లో ఉంటే సూపర్‌ సిక్స్‌ హామీలు ఎలా ఇచ్చారు?. హామీలు ఎలా నెరువేస్తారని అనుకున్నారు?. ప్రజలు ఎదురు చూస్తుంటే హామీలు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు. ప్రజల దృష్టిని మరల్చడానికి మీకున్న మీడియా బలంతో బీసీలపై దాడులు ప్రారంభించారు. ముఖ్యమంత్రి జేబు సంస్థలైన ఏసీబీని ఉపయోగించి జోగి రమేష్ కుమారుడిని అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన  వెంటనే మద్యం ధరలు తగ్గిస్తామన్నారు. ఇప్పటిదాకా ఒక రూపాయి కూడా తగ్గలేదు.

రెండు లక్షల 40 వేల మంది వాలంటీర్లను రోడ్డున పడేశారు. బలహీన వర్గాల్లో ఎదిగిన నాయకులను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. బలహీన వర్గాలకు అనేక పథకాలు అమలు చేస్తామని హామీలు ఇచ్చారు. వారిని లక్ష్యంగా చేసుకుని వేధించడం ద్వారా కార్యక్రమాలు అమలు చేయవలసిన అవసరం లేదనుకుంటున్నారా?. బలహీన వర్గాలను అణచివేయం ద్వారా ఎటువంటి లబ్ది పొందాలనుకుంటున్నారు. ఉచిత ఇసుక సరే సరి.. నిల్వ ఉంచిన ఇసుకను  దారుణంగా దోచుకున్నారు. దీనిపై ఏం చర్యలు తీసుకుంటారు’ అని ప్రశ్నించారు. 

జోగి రాజీవ్ అరెస్ట్ పై.. చెల్లుబోయిన వార్నింగ్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement