రూ.లక్షల కోట్ల పెట్టుబడులన్నీ తుస్‌! | Chandrababu Govt MoUs with doddala sudhir babu | Sakshi
Sakshi News home page

రూ.లక్షల కోట్ల పెట్టుబడులన్నీ తుస్‌!

Published Tue, Jan 31 2017 8:49 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

దొడ్డాల సుధీర్‌ నివాసం - Sakshi

దొడ్డాల సుధీర్‌ నివాసం

ఎంవోయూలపై సంతకాలు చేయడానికి ముందుకు రాని పెద్ద కంపెనీలు  
చిన్నా చితక కంపెనీలు, వ్యక్తులను తీసుకురమ్మని పురమాయించిన సర్కారు
ఆ బాధ్యత ప్రైవేట్‌ సంస్థకు అప్పగింత
నర్సరావుపేటకు చెందిన దొడ్డాల సుధీర్‌ ఇలా∙వచ్చిన బాపతే..


సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: ఈ ఇల్లు చూశారా.. ఈ ఇంటికి, విశాఖ భాగస్వామ్య సదస్సులో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వంతో ఎంవోయూ కూదుర్చుకున్న వ్యక్తికి లింక్‌ పెట్టాలంటే ఏమని చెప్పాలి? రూ.లక్షల కోట్లకు పడగలెత్తిన పారిశ్రామికవేత్త తన బాల్యం జ్ఞాపకాలను జాగ్రత్తగా కాపాడుకుంటున్నారని చెబితే సరిపోతుందా? ప్రభుత్వమైతే ఇలానే చెబుతామంటోంది. రూ.10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చిన ఆ సదస్సులో సాక్షాత్తూ సీఎం చంద్రబాబుతో ఫొటో దిగిన దొడ్డాల సుధీర్‌ నివాసం ఇది. ఆయన పారిశ్రామికవేత్త కాదు కదా.. కనీసం ఓ చిన్న కంపెనీకి షేర్‌ హోల్డర్‌ కూడా కాదు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడుకు చెందిన దొడ్డాల చిట్టిబాబు, కోటేశ్వరమ్మ ఏకైక కుమారుడు దొడ్డాల సుధీర్‌. పాత పెంకుటిల్లుతోపాటు గ్రామంలో కొద్దిపాటి వ్యవసాయ భూమి ఆయనకున్న ఆస్తి. భార్య అంగన్‌వాడీ టీచర్‌.

లక్షల కోట్లు వచ్చాయని నమ్మించాలని..
ఈవీఎం కాలేజీలో సుధీర్‌ పీఆర్వోగా పనిచేస్తూ ఇంటర్మీడియెట్, ఇంజినీరింగ్‌ విద్యార్థులను కాలేజీలో చేర్చించి కమీషన్లు తీసుకుంటుండేవారు. రెండేళ్ల క్రితం నరసరావుపేట మండలం కోటప్పకొండ సమీపంలో విరించి టౌన్‌షిప్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ భూములు కొనుగోలు చేసి రియల్‌ ఎస్టేట్‌ వాళ్లు ప్లాట్లు వేసి అమ్మకాలు మొదలు పెట్టారు. ఈ కంపెనీలో సుధీర్‌ ప్లాట్లు విక్రయించేందుకు ఏజెం ట్‌గా చేరారు. కమీషన్లే ఆధారం. కానీ రూ.కోట్లు పెట్టుబడులు పెట్టడానికి వీలుగా ప్రభుత్వంతో కుదిరిన అవగాహనా ఒప్పందం మీద సంతకం చేశారు. రూ.కోట్లాది సొమ్ము ఎలా తెస్తారో అని స్థాని కులు చర్చించుకుంటున్నారు.

ఇంతకూ అసలు సంగతేంటంటే భారీ సంఖ్యలో ఎంవోయూలపై సంతకాలు చేయడానికి కంపెనీలను తీసుకురావాలని ప్రభుత్వ పెద్దలు మొదట అధికారులకు పురమాయించారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎంవోయూల మీద సంతకాలు చేయడానికి మనుషులను సమకూర్చే బాధ్యతను ప్రైవేట్‌ కంపెనీకి అప్పగించింది. వారు సమకూర్చిన వారిలో సుధీర్‌ ఒకరు. ఇలాంటి వారు, ఊరూపేరు లేని కంపెనీలు ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement