గుంటూరు జిల్లాలో కారు ప్రమాదం | 4 Killed One Injured In Car Accident Near Rompicherla Major Canal | Sakshi
Sakshi News home page

కాలువలోకి దూసుకెళ్లిన కారు; నలుగురు మృతి

Published Fri, Oct 16 2020 8:10 AM | Last Updated on Fri, Oct 16 2020 10:38 AM

4 Killed One Injured In Car Accident Near Rompicherla Major Canal - Sakshi

సాక్షి, గుంటూరు : రొంపిచర్ల మండలం తంగెడమల్లి మేజర్‌ కాలువ వద్ద శుక్రవారం ఉదయం కారు ప్రమాదం చోటుచేసుకుంది. కాలువలో కారు బోల్తా పడి నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మాధవ్ మేస్త్రి అనే వ్యక్తి కారులో హైదరాబాద్‌ నుంచి ప్రకాశం జిల్లా పామర్రులోని రమణయ్య ఇంట్లో కార్పెంటర్‌ పనికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. కారులో అయిదుగురు ప్రయాణిస్తుండగా మహేష్‌, ఆనంద్‌, బీర్‌గౌడ్‌, అతని కుమారుడు బాలాజీ మృతి చెందారు. మృతదేహాలను నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చదవండి: కారు ప్రమాదం, లోపల చూసి పోలీసులు షాక్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement