rompicherla
-
రొంపిచెర్లలో టీడీపీ నేతల బరితెగింపు
సాక్షి, చిత్తూరు జిల్లా: రొంపిచెర్లలో టీడీపీ నేతలు బరితెగించారు. వైఎస్సార్సీపీ నేత వెంకటరమణ షాప్‌పై టీడీపీ నేతలు దాడి చేశారు. షాపుపై దాడి చేసి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. దాడిని అడ్డుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్త ఓబులేసుపైనా దాడి చేశారు. టీడీపీ నేతల దాడిలో ఓబులేసుకు తీవ్ర గాయాలు కావడంతో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదును పోలీసులు స్వీకరించకపోవడంతో ఎస్పీకి ఫిర్యాదు చేశారు.టీడీపీ నేతల వేధింపులకు మహిళ మృతిమరో ఘటనలో టీడీపీ నేతల వేధింపులు తట్టుకోలేక మహిళ మృతిచెందింది. కుప్పం కేజీబీవీలో ఆయాగా పనిచేస్తున్న సెల్వమ్మను పనికిరావద్దని టీడీపీ నేతలు చెప్పడంతో మనస్తాపానికి గురైంది. వాటర్ సంపులో పడి ఆయా సెల్వమ్మ అనుమానాస్పదంగా మృతిచెందింది. ఆమె మృతికి టీడీపీ నేతలే కారణమని కుటుంబ సభ్యులు అంటున్నారు. -
రొంపిచెర్లలో సీఎం వైఎస్ జగన్ రోడ్ షో హైలైట్
-
"మాకు జగనన్న కావాలి.." -పబ్లిక్ రెస్పాన్స్
-
పల్నాడు కాల్పులపై ఎస్పీ వివరణ.. డీల్ ప్రకారమే బాలకోటిరెడ్డిపై దాడి
సాక్షి, పల్నాడు: రొంపిచర్ల మండలం అలవాలలో టీడీపీ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై కొందరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఇంట్లోకి చొరబడి ఆయనపై కాల్పులు జరిపి.. పరారయ్యారు. ఈ ఘటనలో బాలకోటిరెడ్డికి తీవ్రంగా గాయాలయ్యాయి. కాగా, ఈ కాల్పులపై ఎస్పీ రవిశంకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై ఎస్పీ రవిశంకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బాలకోటిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డికి మధ్య వివాదాలు ఉన్నాయి. పార్టీలో అంతర్గత విభేదాలే కాల్పులకు కారణం. ఎంపీటీసీ పదవి ఇప్పిస్తానని వెంకటేశ్వర రెడ్డి వద్ద బాలకోటిరెడ్డి రూ.6.50 లక్షలు తీసుకున్నాడు. బాలకోటిరెడ్డిని చంపడానికి రూ.4.50 లక్షల డీల్ జరిగింది. రాజస్థాన్ నుంచి రూ.60వేలకు గన్ కొన్నారు. రాత్రి గుర్తు తెలియని వ్యక్తి శివారెడ్డి పేరుతో డోర్ తట్టారు. ఈ క్రమంలో తలుపు తీసిన వెంటనే బాలకోటిరెడ్డిపై కాల్పులు జరిపాడు. ఈ కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశాము అని తెలిపారు. ఇదికూడా చదవండి: పల్నాడు: రొంపిచర్ల టీడీపీ బాలకోటిరెడ్డిపై కాల్పులు.. -
పల్నాడు: రొంపిచర్లలో అర్ధరాత్రి కాల్పుల కలకలం
సాక్షి, పల్నాడు: జిల్లాలోని రొంపిచర్ల మండలం అలవాలలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. రొంపిచర్ల టీడీపీ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై బుధవారం అర్ధరాత్రి కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఇంట్లోకి చొరబడి ఆయనపై కాల్పులు జరిపి.. పరారయ్యారు. ఈ ఘటనలో బాలకోటిరెడ్డికి తీవ్రంగా గాయాలయ్యాయి. బాలకోటిరెడ్డిపై రెండు రౌండ్ల కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన ఆయన్ని చికిత్స కోసం నర్సరావుపేటలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే.. టీడీపీ అంతర్గత కుమ్ములాట నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎందుకంటే.. గతంలో.. ఆరు నెలల కిందట బాలకోటిరెడ్డిపై కత్తితో దాడి జరిగింది. ఆ సమయంలో ఈ దాడిని రాజకీయం చేసేందుకు టీడీపీ తీవ్రంగా యత్నించింది. నారా లోకేష్‌ను సైతం రంగంలోకి దించాలనుకుంది. అయితే.. ఈలోపే దాడికి తానే బాధ్యుడినంటూ స్థానిక టీడీపీ నేత పమ్మి వెంకట్‌రెడ్డి పోలీసులకు లొంగిపోయాడు. పార్టీలో విభేధాలు ఉన్నాయని, నర్సరావుపేట టీడీపీ ఇంఛార్జి చదలవాడ అరవిందబాబు.. డబ్బులు తాను ఖర్చు పెడుతుంటే బాలకోటిరెడ్డిని ప్రొత్సహిస్తున్నాడని అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే కోపంతో రగిలిపోయి.. బాలకోటిరెడ్డిపై దాడికి పాల్పడినట్లు అప్పుడు పోలీసులకు వెల్లడించాడు. దీంతో.. తాజా దాడి కూడా ఈ కోణంలోనే జరిగిందా? లేదా మరేదైనా కోణం ఉందా? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అబద్ధాలాడి అభాసుపాలైన బాబు అండ్ కో
సాక్షి, నరసరావుపేట/నరసరావుపేట రూరల్/రొంపిచర్ల: సొంత పార్టీ నేతల మధ్య ఆధిపోత్య పోరులో జరిగిన దాడిని అధికార పార్టీపై నెట్టాలనుకున్న తెలుగుదేశం పార్టీ అభాసుపాలైంది. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై ఆయన మేనల్లుడు, అదే పార్టీకి చెందిన అలవాల గ్రామ టీడీపీ నేత పమ్మి పెద్ద వెంకటేశ్వరరెడ్డి మంగళవారం ఉదయం హత్యాయత్నం చేశాడు. మంగళవారం ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లిన బాలకోటిరెడ్డిపై పెద్దవెంకటేశ్వరరెడ్డి, మరికొందరు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. రక్తమోడుతూ రోడ్డు మీద పడి ఉన్న బాలకోటిరెడ్డిని స్కూల్ బస్సులో వెళ్తున్న విద్యార్థులు చూసి గ్రామస్తులకు తెలిపారు. గ్రామస్తులు వచ్చి ఆయన్ని ఆటోలో గ్రామానికి తీసుకొచ్చారు. స్థానిక ఆర్ఎంపీ వైద్యుడు çప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటలోని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి, డాక్టర్ అరవిందబాబుకు చెందిన అమూల్య నర్సింగ్ హోమ్‌కు తరలించారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే టీడీపీ నేతలు వాస్తవాలు తెలుసుకోకుండా అధికారపార్టీపై నెపం నెట్టాలని కుట్ర పన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మొదలు మండల స్థాయి నాయకుల వరకు అసత్య ప్రచారం ప్రారంభించారు. అధికారపార్టీకి చెందిన రొంపిచర్ల ఎంపీపీ భర్తే హత్యాయత్నం చేశాడంటూ ఆరోపణలు చేశారు. ఈ దాడికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతిచర్యలు ఉంటాయంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలుచేశారు. పోలీసు వ్యవస్థ ప్రతిష్టను మంటగొలిపేలా ఆరోపణలు చేశారు. తీరా చూస్తే ఈ హత్యాయత్నానికి పాల్పడింది వారి పార్టీ నేతే అని వెల్లడవడంతో కుక్కిన పేనుల్లా మిన్నకుండిపోయారు. బాలకోటిరెడ్డి కుమారుడు వెన్నా నర్సిరెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సైతం వెంకటేశ్వరెడ్డిపై అనుమానం వ్యక్తం చేశాడు. ఇదే మొదటిసారి కాదు.. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో రాజకీయ రచ్చ చేసి, ప్రజలను రెచ్చగొట్టేందుకు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎక్కడ ఏ ఘటన జరిగినా, దానికి వైఎస్సార్సీపీ నేతలే కారణమంటూ శవ రాజకీయాలకు పాల్పడుతోంది. వ్యక్తిగత కక్షలతో జరిగిన దాడులను సైతం అధికార పార్టీపై నెట్టి, రాజకీయం చేయాలని ప్రయత్నిస్తోంది. మాచర్ల, వినుకొండ, గురజాల నియోజకవర్గాలలో ఇటువంటి చర్యలకే పాల్పడింది. ఇప్పుడు నరసరావుపేట నియోజకవర్గంలో సైతం అదే పంథాను కొనసాగిస్తోంది. టీడీపీలో గ్రూపులే దాడికి కారణం: ఇన్చార్జి డీఎస్పీ విజయభాస్కరరెడ్డి తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయాల కారణంగానే వెన్నా బాలకోటిరెడ్డిపై దాడి జరిగిందని ఇన్చార్జి డీఎస్పీ విజయభాస్కరరెడ్డి తెలిపారు. మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల నుంచి అలవాల గ్రామంలో టీడీపీలో అంతర్గత విభేదాలు ఉన్నాయని తెలిపారు. పార్టీలో గుర్తింపు దక్కకపోవడం, బాలకోటిరెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడంపై అతని మేనల్లుడు వెంకటేశ్వరరెడ్డి కక్ష పెంచుకున్నాడన్నారు. ఈ నేపథ్యంలో ఉదయం వాకింగ్‌కు వెళ్లిన బాలకోటిరెడ్డికి ఆంజనేయస్వామి ఆలయం వద్ద వెంకటేశ్వరరెడ్డి తారసపడటంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగిందన్నారు. వెంకటేశ్వరరెడ్డి ఆగ్రహంతో బాలకోటిరెడ్డిపై దాడి చేశాడని, పాశవికంగా రాళ్లతో కొట్టి పరారయ్యాడని వివరించారు. బాలకోటిరెడ్డి కుమారుడు నర్సిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో పమ్మి వెంకటేశ్వరరెడ్డి దాడికి పాల్పడినట్టు పేర్కొన్నాడని తెలిపారు. వెంకటేశ్వరరెడ్డిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. టీడీపీలో ఆధిపత్య పోరుతోనే.. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీ ఆధిపత్య పోరులో భాగంగానే వెన్నా బాలకోటిరెడ్డిపై దాడి జరిగిందని, వైఎస్సార్సీపీ నాయకులకు ఎటువంటి సంబంధం లేదని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. దాడి జరిగిన బాలకోటిరెడ్డికి దాడిచేసిన వెంకటేశ్వరరెడ్డి స్వయానా మేనల్లుడేనని చెప్పారు. ఇద్దరూ టీడీపీ నేతలేనని చెప్పారు. వాస్త వాలు తెలుసుకునే ఓపిక చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు, జీవీ ఆంజనేయులు, ప్రత్తిపాటి పుల్లారావులకు లేదన్నారు. వైఎస్సార్సీపీ నాయకు లపై పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఆయన మంగళ వారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడు తూ దాడి అనంతరం వెంకటేశ్వరరెడ్డి స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోయాడని చెప్పారు. ఈ సమావేశంలో నేతలు పి.ఓబుల్‌రెడ్డి, పి.రవీంద్ర బాబు, జి.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లైన యువకుడి నిర్వాకం.. బిడ్డకు జన్మనిచ్చిన..
సాక్షి, చిత్తూరు(రొంపిచెర్ల): పదో తగరతి విద్యార్థిని ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఘటన రొంపిచెర్ల మండలంలో చోటుచేసుకుంది. ఇద్దరు బిడ్డల తండ్రి ఈ నిర్వాకానికి కారణంగా తెలుస్తోంది. వివరాలివీ.. మండలంలోని బొమ్మయ్యగారిపల్లె పంచాయతీకి చెందిన విద్యార్థిని రొంపిచెర్లలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కరోనా నేపథ్యంలో ఏడాది క్రితం కొద్ది రోజులు రొంపిచెర్లలోని తన పెద్దనాన్న ఇంట్లో ఉంది. అక్కడ ఎలక్ట్రీషియన్ పనికోసం వచ్చిన పీలేరు మండలంలోని ఎర్రగుంటపల్లెకు చెందిన చంద్రానాయక్ కుమారుడు రాజేష్‌నాయక్(34) విద్యార్థినితో పరిచయం పెంచుకున్నాడు. విద్యార్థిని రోజూ ఇంటి దగ్గర నుంచి పాఠశాలకు రెండు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తుండేది. ఈ క్రమంలో బాలికను రోడ్డు పక్కనే ఉన్న చెరువు దగ్గరికి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అ సమయంలో వీడియోలు, ఫొటోలు తీశాడు. విషయం తల్లిదండ్రులకు చెబితే వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక ఏమీ చేయ లేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. ఆ తర్వాత బెదిరింపులతో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. చదవండి: (వదినతో వివాహేతరం సంబంధం.. అన్నకు తెలిసి..) ఈ క్రమంలోనే కడుపునొప్పిగా ఉందంటూ పది రోజులుగా పాఠశాలకు వెళ్లడం మానేసింది. బుధవారం చికిత్స నిమిత్తం రొంపిచెర్లలోని ఒక ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు విద్యార్థిని గర్భం దాల్చినట్లు నిర్ధారించడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. అప్పుడే నొప్పులు అధికం కావడం, మగ బిడ్డకు జన్మనివ్వడం జరిగిపోయాయి. ఈ మేరకు గురువారం సాయంత్రం విద్యార్థిని ఫిర్యాదుతో రొంపిచెర్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రాజేష్‌కు ఇదివరకే వివాహం కాగా.. ఇద్దరు పిల్లలు ఉండడం గమనార్హం. -
శభాష్ వలంటీర్.. ప్రాణాలకు తెగించి మరీ
నరసరావుపేట: అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న ఇద్దరు వృద్ధులు, నలుగురు చిన్నారుల్ని ప్రాణాలకు తెగించి మరీ కాపాడాడు ఓ గ్రామ వలంటీర్. ఆ మంటలకు తన ఒళ్లు కాలుతున్నా లెక్క చేయకుండా దగ్ధమవుతున్న గుడిసెలోంచి గ్యాస్ సిలిండర్‌ను బయటకు తెచ్చి భారీ ప్రమాదాన్ని, ప్రాణ నష్టాన్ని నివారించి శభాష్ అనిపించుకున్నాడు. గుంటూరు జిల్లా రొంపిచర్లలో ఈ ఘటన జరిగింది. రొంపిచర్లలో పేదలు నివసించే ప్రాంతంలో మొత్తం 12 వరకు పూరి గుడిసెలు ఉన్నాయి. అందులో 4 గుడిసెలు ఒకదానికొకటి ఆనుకుని ఉండగా.. మరో 8 గుడిసెలు కొద్ది దూరంలోనే ఉన్నాయి. శనివారం ఉదయం ఓ విద్యుత్ స్తంభం నుంచి తీగ తెగి పూరి గుడిసెపై పడింది. గుడిసెకు మంటలు అంటుకుని పక్కనే ఉన్న మరో రెండు పూరి గుడిసెలకు వ్యాపించాయి. ఆ సమయంలో రెండు గుడిసెల్లో ఉన్న ఇద్దరు వృద్ధులు, నలుగురు చిన్నారులను వలంటీర్ బొజ్జా శివకృష్ణ బయటికి తీసుకొచ్చి వారి ప్రాణాలు కాపాడాడు. తగలబడుతున్న మరో గుడిసెకు తాళం వేసి ఉండగా.. క్షణాల్లో దానిని తొలగించి అందులోని గ్యాస్ సిలిండర్‌ను బయటకు తీసుకొచ్చాడు. వలంటీర్ ఆ సాహసం చేసి ఉండకపోతే గ్యాస్ సిలిండర్ పేలి పక్కనే ఉన్న ఏడెనిమిది గుడిసెలకు మంటలు వ్యాపించి ప్రాణనష్టం జరిగి ఉండేది. ఈ ఘటనలో శివకృష్ణ ఒంటికి మంటలు అంటుకోవడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతడిని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బాధితులను పరామర్శించి సహాయం అందించారు. వైద్యశాలకు వెళ్లి వలంటీర్ శివకృష్ణను అభినందించారు. అతడి వైద్యానికయ్యే ఖర్చులన్నీ తానే భరిస్తానని హామీ ఇచ్చారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థ ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటుందనే దానికి ఇదే నిదర్శనమని, శివకృష్ణ లాంటి ఎందరో ఆ వ్యవస్థలో భాగస్వాములై ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు. కర్తవ్యం గుర్తొచ్చింది: వలంటీర్ శివకృష్ణ ‘మా ఇంటికి సమీపంలోనే ఉన్నట్టుండి హాహాకారాలు వినిపించాయి. బయటకు వచ్చి చూస్తే ఎదురుగా మంటలు కనిపించాయి. కాలుతున్న ఓ గుడిసెలో వృద్ధులు, చిన్న పిల్లలు ఉన్నారు. వారిని రక్షించి, వెంటనే తగులబడుతున్న గుడిసెకు వేసి ఉన్న తాళాన్ని తొలగించి సిలిండర్‌ను బయటకు తెచ్చాను. శరీరం, చేతులు, వేళ్లకు మంటలు అంటుకున్నాయి. బయటకు రాగానే స్పృహతప్పి పడిపోయాను. చుట్టుపక్కల వారు నన్ను వెంటనే కారులో నరసరావుపేట ఆస్పత్రికి తీసుకొచ్చారు.’ -
గుంటూరు జిల్లాలో కారు ప్రమాదం
సాక్షి, గుంటూరు : రొంపిచర్ల మండలం తంగెడమల్లి మేజర్ కాలువ వద్ద శుక్రవారం ఉదయం కారు ప్రమాదం చోటుచేసుకుంది. కాలువలో కారు బోల్తా పడి నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మాధవ్ మేస్త్రి అనే వ్యక్తి కారులో హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా పామర్రులోని రమణయ్య ఇంట్లో కార్పెంటర్ పనికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. కారులో అయిదుగురు ప్రయాణిస్తుండగా మహేష్, ఆనంద్, బీర్‌గౌడ్, అతని కుమారుడు బాలాజీ మృతి చెందారు. మృతదేహాలను నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చదవండి: కారు ప్రమాదం, లోపల చూసి పోలీసులు షాక్ -
ఈ వీధి కుక్క సూపర్...
రొంపిచర్ల (నరసరావుపేట): గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడు గ్రామంలో గల నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి దేవాలయంలో ఆదివారం రాత్రి దొంగలు దేవాలయం తాళాలు పగులకొట్టి హుండీని ఎత్తుకెళ్లారు. ఈ హుండీలో భక్తులు సమర్పించిన సుమారు రూ.50 వేలు నగదు, కేజీ వరకు వెండి వస్తువులు ఉండవచ్చని భావిస్తున్నారు. హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు అందులో ఉన్న వెండి, నగదును తీసుకుని, హుండీని పెద్ద చెరువులో పడేశారు. అయితే గుడి పరిసరాల్లోనే పెరుగుతున్న ఓ శునకం ప్రతిరోజూ గుడికి వచ్చే ఓ ముసలమ్మను కాలితో గీకి సైగలు చేసింది. దేవాలయం తలుపు తాళాలు పగులకొట్టిన దొంగలు ఆ వృద్ధురాలు శునకం చేష్టలను గమనించి దాని వెంట వెళ్లగా, అది చెరువు వద్దకు తీసుకువెళ్లింది. చెరువులో హుండీ కన్పించింది. శునకం అక్కడ నుంచి అన్నారం డొంక రోడ్డులోకి తీసుకెళ్లటంతో అటు వైపే దొంగలు వెళ్లి ఉండొచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు. గుడి వద్దే భక్తులు పెట్టే ప్రసాదాలతో జీవిస్తూ, అమ్మవారిపై విశ్వాసంతో హుండీ జాడను చూపించిన శునకాన్ని పోలీసులు, గ్రామస్తులు మెచ్చుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రొంపిచర్ల పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రజారోగ్యానికి పెద్ద పీట!
సాక్షి, రొంపిచర్ల: అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే 90 శాతం ఎన్నికల హామీలను నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరేనని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణశ్రీనివాస్ (ఆళ్ల నాని) చెప్పారు. నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచర్ల గ్రామంలో నిర్మించిన ప్రాథమిక వైద్యశాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన సభలో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం ప్రజాసంక్షేమం, ప్రజారోగ్యాన్ని విస్మరించి కేవలం అక్రమార్జన, కబ్జాలకే ప్రాధాన్యత ఇచ్చిందని విమర్శించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా పేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం అందించటమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అక్రమ ఇసుక రవాణా, ప్రకృతి వైపరీత్యాల వలన కొరత ఏర్పడిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో పది స్టాకు పాయింట్లలో 49 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు. ఇసుక లభ్యతకు 29 రీచ్‌లను గుర్తించామన్నారు. టీడీపీ నాయకులకు ఇవేమీ కనిపించట్లేదని, కేవలం ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే రాష్ట్రంలో 24లక్షల మంది పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు అవసరమైన భూసేకరణ పనులు పూర్తికావచ్చాయన్నారు. రైతులకు పెట్టుబడిలో వెసులుబాటు కల్పించేందుకే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ కంటే ప్రతి రైతుకు ఎక్కువ ఆర్థికసాయాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ వైద్యశాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు నిధుల కేటాయించాలని మంత్రిని కోరారు. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రాంతాలకు గ్రావిటీ ద్వారా తాగునీరు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. రూ.2,750 కోట్లతో బుగ్గవాగు రిజర్వాయర్‌ను ఆధునికీకరించి తాగునీరు అందజేయనున్నట్లు తెలిపారు. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిలుస్తోందన్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.50లక్షల వ్యయంతో తలపెట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్‌కుమార్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ అరుణకుమారి, డీఎంఅండ్‌హెచ్‌వో యాస్మిన్, ఆర్డీవో మొగిలి వెంకటేశ్వర్లు, తహసీల్దార్ జాన్‌సైదులు, ఎండీవో అర్జునరావు, వైఎస్సార్ సీపీ నాయకులు పిల్లి ఓబుల్‌రెడ్డి, పచ్చవ రవీంద్రబాబు, అన్నెంపున్నారెడ్డి, చపారపు గోపాలరెడ్డి, పడాల చక్రారెడ్డి, కల్లి మస్తాన్‌రెడ్డి, గెల్లి బ్రహ్మారెడ్డి, గెల్లి చినకోటిరెడ్డి, ముండ్రు హరినారాయణ తదితరులు పాల్గొన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో ప్రక్షాళన.. నరసరావుపేట: ప్రజారోగ్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని డెప్యూటీ సీఎం ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్యఆరోగ్యశాఖలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. మంగళవారం నరసరావుపేట నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి పర్యటించారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో అన్ని విభాగాలను పరిశీలించిన అనంతరం విలేకర్లతో మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచర్లలో ఆరేళ్ల కిందట నిర్మించిన వైద్యశాల ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదన్నారు. కానీ, సీఎం చొరవతో నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ఆ వైద్యశాలను ప్రారంభించి, ప్రహరీ నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేశామన్నారు. నరసరావుపేట ఏరియా వైద్యశాలలో డ్రెయినేజీ లోపాలను సరి చేసేందుకు రూ.58 లక్షల నిధులను మంజూరు చేస్తున్నామన్నారు. ఎన్ఎస్పీ స్థలంలో కొత్తగా నిర్మిస్తున్న 200 పడకల వైద్యశాలలో మరో రూ.3.5 కోట్ల విలువైన పనులు చేయాల్సి ఉందని, వాటి ప్రతిపాదనలు పరిశీలించి నిధులు విడుదల చేసి, త్వరలోనే ఆస్పత్రిని అందుబాటులోకి తెస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాలల్లో సుమారు 3 వేల మంది డాక్టర్లు కొరత ఉందన్నారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం పొందిన సిబ్బందిని కార్పొరేషన్ పరిధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పను కృషి చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్‌కుమార్ పాల్గొన్నారు. -
డబ్బు ఇవ్వకపోతే చంపేస్తా
రొంపిచెర్ల: డబ్బు తెచ్చి ఇస్తేనే కాపురం చేస్తా.. లేదంటే చంపేస్తాను అని భర్త బెదిరిస్తున్నాడని, రక్షణ కల్పించాలని బాధితురాలు ఆదివారం రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. రొంపిచెర్ల పంచాయతీలోని చిన్న మశీదు వీధికి చెందిన ఎస్.జాకీర్ హుసేన్ కుమారుడు గౌస్‌బాషాకు రొంపిచెర్లకు చెందిన హసీనాను ఇచ్చి 10 నెలల క్రితం వివాహం చేశారు. వీరి కాపురం కొద్ది రోజులు సజావుగా సాగింది. అనంతరం భర్త గౌస్ బాష జూదం, మద్యానికి బానిసగా మారాడు. పెళ్లి సమయంలో ఇచ్చిన రూ.55 వేలు డబ్బు తాగుడుకు ఖర్చు చేశాడు. అలాగే బంగారు నగలను తాకట్టు పెట్టాడు. మళ్లీ రూ.30 వేలు డబ్బు తెచ్చి ఇస్తేనే కాపురం చేస్తానని, లేదంటే తన స్నేహితులతో కలిసి చంపేస్తానని భార్యను బెదిరించాడు. దీనిపై బాధితురాలు రెండు నెలల క్రితం రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇరువురికీ సర్దిచెప్పి పంపించారు. గౌస్‌బాషాలో మార్పు రాలేదు. రెండు రోజుల నుంచి తనను, నా అన్న అమీర్‌ను చంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని హసీనా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త స్నేహితులు బడాబాబు, నయీమ్, వసీం, యూనిస్, చాను, అçఫ్జల్, నిప్పల్, మస్తాన్, తొట్టుపల్లె, చోటాబాబుతో ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది. -
13 మంది ఎర్రచందనం కూలీలు అరెస్టు
చిత్తూరు: చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం, రొంపిచెర్ల పోలీస్స్టేషన్ల పరిధిలో 13 మంది ఎర్రచందనం కూలీలు పట్టుబడ్డారు. శుక్రవారం ఉదయం కూంబింగ్ చేపట్టిన పోలీసులు ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న వీరిని పట్టుకున్నారు. 14 దుంగలతోపాటు ఒక ఆటో, ఒక బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారు చంద్రగిరి, ఎర్రావారిపాలెం, వెదురుకుప్పం, రొంపిచెర్ల మండలాలకు చెందిన వారు. వీరిలో ఆరుగురు తలకోన ఫారెస్టు బీట్‌లో పనిచేసే అటవీ పరిరక్షక సిబ్బంది కూడా ఉన్నట్లు పీలేరు రూరల్ సీఐ మహేశ్వర్ తెలిపారు. -
రూ.లక్షల కోట్ల పెట్టుబడులన్నీ తుస్!
ఎంవోయూలపై సంతకాలు చేయడానికి ముందుకు రాని పెద్ద కంపెనీలు చిన్నా చితక కంపెనీలు, వ్యక్తులను తీసుకురమ్మని పురమాయించిన సర్కారు ఆ బాధ్యత ప్రైవేట్ సంస్థకు అప్పగింత నర్సరావుపేటకు చెందిన దొడ్డాల సుధీర్ ఇలా∙వచ్చిన బాపతే.. సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: ఈ ఇల్లు చూశారా.. ఈ ఇంటికి, విశాఖ భాగస్వామ్య సదస్సులో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వంతో ఎంవోయూ కూదుర్చుకున్న వ్యక్తికి లింక్ పెట్టాలంటే ఏమని చెప్పాలి? రూ.లక్షల కోట్లకు పడగలెత్తిన పారిశ్రామికవేత్త తన బాల్యం జ్ఞాపకాలను జాగ్రత్తగా కాపాడుకుంటున్నారని చెబితే సరిపోతుందా? ప్రభుత్వమైతే ఇలానే చెబుతామంటోంది. రూ.10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చిన ఆ సదస్సులో సాక్షాత్తూ సీఎం చంద్రబాబుతో ఫొటో దిగిన దొడ్డాల సుధీర్ నివాసం ఇది. ఆయన పారిశ్రామికవేత్త కాదు కదా.. కనీసం ఓ చిన్న కంపెనీకి షేర్ హోల్డర్ కూడా కాదు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడుకు చెందిన దొడ్డాల చిట్టిబాబు, కోటేశ్వరమ్మ ఏకైక కుమారుడు దొడ్డాల సుధీర్. పాత పెంకుటిల్లుతోపాటు గ్రామంలో కొద్దిపాటి వ్యవసాయ భూమి ఆయనకున్న ఆస్తి. భార్య అంగన్వాడీ టీచర్. లక్షల కోట్లు వచ్చాయని నమ్మించాలని.. ఈవీఎం కాలేజీలో సుధీర్ పీఆర్వోగా పనిచేస్తూ ఇంటర్మీడియెట్, ఇంజినీరింగ్ విద్యార్థులను కాలేజీలో చేర్చించి కమీషన్లు తీసుకుంటుండేవారు. రెండేళ్ల క్రితం నరసరావుపేట మండలం కోటప్పకొండ సమీపంలో విరించి టౌన్‌షిప్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ భూములు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వాళ్లు ప్లాట్లు వేసి అమ్మకాలు మొదలు పెట్టారు. ఈ కంపెనీలో సుధీర్ ప్లాట్లు విక్రయించేందుకు ఏజెం ట్‌గా చేరారు. కమీషన్లే ఆధారం. కానీ రూ.కోట్లు పెట్టుబడులు పెట్టడానికి వీలుగా ప్రభుత్వంతో కుదిరిన అవగాహనా ఒప్పందం మీద సంతకం చేశారు. రూ.కోట్లాది సొమ్ము ఎలా తెస్తారో అని స్థాని కులు చర్చించుకుంటున్నారు. ఇంతకూ అసలు సంగతేంటంటే భారీ సంఖ్యలో ఎంవోయూలపై సంతకాలు చేయడానికి కంపెనీలను తీసుకురావాలని ప్రభుత్వ పెద్దలు మొదట అధికారులకు పురమాయించారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎంవోయూల మీద సంతకాలు చేయడానికి మనుషులను సమకూర్చే బాధ్యతను ప్రైవేట్ కంపెనీకి అప్పగించింది. వారు సమకూర్చిన వారిలో సుధీర్ ఒకరు. ఇలాంటి వారు, ఊరూపేరు లేని కంపెనీలు ఉన్నాయి. -
ఏకంగా దేవుణ్నే ఎత్తుకెళ్లారు..
రొంపిచర్ల: గుంటూరు జిల్లా రొంపిచర్ల మండల కేంద్రంలోని శంకరస్వామి శివాలయంలో నందీశ్వరుడి విగ్రహాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున గుడి ఆవరణలోకి వెళ్ళిన పూజారి రొంపిచర్ల శ్రీనివాసశర్మ ఈ విషయాన్ని గమనించాడు. గుడి పక్కనే ఉండాల్సిన నందీశ్వరుడి విగ్రహం లేకపోవడంతో ఆయన విషయాన్ని ఆలయ అధికారులకు తెలియజేశారు. నందీశ్వరుడి విగ్రహం ఉండాల్సిన చోట గడ్డపారలతో తవ్వి పెకలించారు. ఈ సంఘటనతో రొంపిచర్ల గ్రామస్తుల్లో కలకలం చెలరేగింది. ఆలయ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో వెంటనే పోలీసులు ఆలయాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని వెళ్లారు. ఆలయం ఊరికి దూరంగా నరసరావుపేట రోడ్డులో ఉండటంతో పాటు ప్రహరీ గోడ లేకపోవడమే దొంగతనానికి అవకాశాన్ని కలిగించిందని గ్రామస్తులు అంటున్నారు. ఐదేళ్ల క్రితం గాలిగోపురం కూలిపోయిందని, ఇప్పటి వరకు పునరుద్ధరణ జరగలేదని స్థానికులు ఆరోపించారు. ఇప్పటికే ఓసారి ఆలయంలోని విగ్రహాలు, ద్వజస్తంభ గంటలు కూడా చోరీకి గురయ్యాయని వారు తెలిపారు. -
తెగబడుతున్న తెలుగు తమ్ముళ్లు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఆగడాలు అధికమవుతున్నాయి. తమకు ప్రధాన ప్రత్యర్థి అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై తెలుగు తమ్ముళ్లు దాడులకు తెగబడుతున్నారు. తాజాగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైఎస్ఆర్ సీపీ నాయకుడు, కార్యకర్తలపై దాడి చేశారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టిముక్కల గ్రామ ఉప సర్పంచ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కృష్ణారావు దారుణహత్యకు గురైయ్యారు. టీడీపీకి చెందినవారే ఈ హత్య చేశారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం తుంగపాడులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాధితులను నర్సారావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. టీడీపీ దాడిని ఆయన ఖండించారు. -
పంట పొలాల్లోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు
గుంటూరు జిల్లా రొంపిచర్ల రహదారిపై శనివారం స్కూల్ బస్సు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకువెళ్లింది. దాంతో తీవ్ర భయాందోళనకు లోనైన విద్యార్థులు హహాకారాలు చేశారు. ఆ ఘటనలో విద్యార్థులకు ఎటువంటి గాయాలు కాలేదు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్కూల్ బస్సు వద్దకు చేరుకుని విద్యార్థులను బస్సు నుంచి కిందకి దింపారు. బ్రేకులు ఫైయిల్ కారణంగానే ఈ సంఘటన చోటు చేసుకుందని స్కూల్ బస్సు డ్రైవర్ వెల్లడించారు.