ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఆగడాలు అధికమవుతున్నాయి. తమకు ప్రధాన ప్రత్యర్థి అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై తెలుగు తమ్ముళ్లు దాడులకు తెగబడుతున్నారు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఆగడాలు అధికమవుతున్నాయి. తమకు ప్రధాన ప్రత్యర్థి అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై తెలుగు తమ్ముళ్లు దాడులకు తెగబడుతున్నారు. తాజాగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైఎస్ఆర్ సీపీ నాయకుడు, కార్యకర్తలపై దాడి చేశారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టిముక్కల గ్రామ ఉప సర్పంచ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కృష్ణారావు దారుణహత్యకు గురైయ్యారు. టీడీపీకి చెందినవారే ఈ హత్య చేశారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.
గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం తుంగపాడులో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాధితులను నర్సారావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. టీడీపీ దాడిని ఆయన ఖండించారు.