చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం, రొంపిచెర్ల పోలీస్‌స్టేషన్ల పరిధిలో 13 మంది ఎర్రచందనం కూలీలు పట్టుబడ్డారు.
చిత్తూరు:
చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం, రొంపిచెర్ల పోలీస్‌స్టేషన్ల పరిధిలో 13 మంది ఎర్రచందనం కూలీలు పట్టుబడ్డారు. శుక్రవారం ఉదయం కూంబింగ్ చేపట్టిన పోలీసులు ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న వీరిని పట్టుకున్నారు. 14 దుంగలతోపాటు ఒక ఆటో, ఒక బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన వారు చంద్రగిరి, ఎర్రావారిపాలెం, వెదురుకుప్పం, రొంపిచెర్ల మండలాలకు చెందిన వారు. వీరిలో ఆరుగురు తలకోన ఫారెస్టు బీట్‌లో పనిచేసే అటవీ పరిరక్షక సిబ్బంది కూడా ఉన్నట్లు పీలేరు రూరల్ సీఐ మహేశ్వర్ తెలిపారు.