redsandle wood
-
13 మంది ఎర్రచందనం కూలీలు అరెస్టు
చిత్తూరు: చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం, రొంపిచెర్ల పోలీస్స్టేషన్ల పరిధిలో 13 మంది ఎర్రచందనం కూలీలు పట్టుబడ్డారు. శుక్రవారం ఉదయం కూంబింగ్ చేపట్టిన పోలీసులు ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న వీరిని పట్టుకున్నారు. 14 దుంగలతోపాటు ఒక ఆటో, ఒక బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారు చంద్రగిరి, ఎర్రావారిపాలెం, వెదురుకుప్పం, రొంపిచెర్ల మండలాలకు చెందిన వారు. వీరిలో ఆరుగురు తలకోన ఫారెస్టు బీట్‌లో పనిచేసే అటవీ పరిరక్షక సిబ్బంది కూడా ఉన్నట్లు పీలేరు రూరల్ సీఐ మహేశ్వర్ తెలిపారు. -
భారీగా ఎర్రచందనం స్వాధీనం
చంద్రగిరి: చిత్తూరు జిల్లాలోని శేషాచలం అటవీ ప్రాంతంలో భారీగా ఎర్రచందనం దుంగలను సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. చంద్రగిరి మండలంలోని రాయలవారికోట సమీపంలో అటవీ అధికారులు కూంబింగ్ నిర్వహించగా... దొంగలు తారసపడ్డారు. అధికారులను చూసిన దొంగలు ఎర్రచందనం దుంగలను వదిలేసి పరారయ్యారు. రూ.2 కోట్ల విలువజేసే 50 ఎర్రచందనం దుంగలతోపాటు... తమిళనాడులోని తిరువణ్ణామలైకి చెందిన చిన్నపయ్యన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో ఘటనలో మండలంలోని రామిరెడ్డిపల్లి పంచాయతీ విద్యానికేతన్ సమీపంలో సోమవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ కూంబింగ్‌లో 9 ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. ముగ్గురు కూలీలను అదుపులోకి తీసుకున్నారు. -
20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
వైఎస్ఆర్ జిల్లా: వైఎస్ఆర్ జిల్లాలోని సిద్ధవటం అటవీ ప్రాంతంలో 20 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఆదివారం జరిపిన తనీఖీల్లో అక్రమంగా తరలిస్తున్నఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణా చేస్తున్న తెలుగుదేశం పార్టీకి చెందిన చెంచయ్యనాయుడుతో పాటూ మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.