చంద్రగిరి: చిత్తూరు జిల్లాలోని శేషాచలం అటవీ ప్రాంతంలో భారీగా ఎర్రచందనం దుంగలను సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. చంద్రగిరి మండలంలోని రాయలవారికోట సమీపంలో అటవీ అధికారులు కూంబింగ్ నిర్వహించగా... దొంగలు తారసపడ్డారు. అధికారులను చూసిన దొంగలు ఎర్రచందనం దుంగలను వదిలేసి పరారయ్యారు.
రూ.2 కోట్ల విలువజేసే 50 ఎర్రచందనం దుంగలతోపాటు... తమిళనాడులోని తిరువణ్ణామలైకి చెందిన చిన్నపయ్యన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో ఘటనలో మండలంలోని రామిరెడ్డిపల్లి పంచాయతీ విద్యానికేతన్ సమీపంలో సోమవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ కూంబింగ్‌లో 9 ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. ముగ్గురు కూలీలను అదుపులోకి తీసుకున్నారు.
భారీగా ఎర్రచందనం స్వాధీనం
Published Mon, Feb 1 2016 11:49 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
Advertisement