
పట్టుబడిన గంజాయి
జయపురం: కొరాపుట్ జిల్లా లమతాపుట్ సమితి మాచ్‌ఖండ్–లమతాపుట్ మార్గంలో పోలీసులు పెద్ద ఎత్తున గంజాయి పట్టుకున్నారు. లమతాపుట్, మాచ్‌ఖండ్, ఒనకఢిల్లీ, మొదలగు ప్రాంతాలలో గంజాయి అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతుండడంతో పోలీసులు ఆయా ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించారు. మాచ్‌ఖండ్, లమతాపుట్, జోళాపుట్ పోలీసులు సంయుక్తంగా పెట్రోలింగ్ జరుపుతుండగా లమతాపుట్–మాచ్‌ఖండ్ మార్గంలో సిందిపుట్ నదీ ఘాట్ వద్ద కొంతమంది గంజాయి తరలించేందుకు యత్నిస్తున్నారు. ఆ సయంలో పోలీసులు అటువైపు రావటం చూచిన వారు గంజాయిని, వాహనాన్ని వదిలిపెట్టి పరారీ అయ్యారు. పోలీసులు గంజాయిని, వాహనాన్ని స్వాధీన పరచుకొన్నారు. మాచ్‌ఖండ్ తహసీల్దార్, మెజిస్ట్రేట్ కర్ణదేవ్ సమర్ధర్, నందపూర్ ఎస్‌డీపీవో శివరాం నాయిక్ సమక్షంలో తూయగా 40 క్వింటాళ్ల 40 కేజీలు ఉన్నట్టు వెల్లడైంది. పట్టుబడిన గంజాయి విలువ దాదాపు రూ. 20 లక్షలు ఉంటుందని అంచనా. ఈ దాడిలో మాచ్‌ఖండ్ పోలీసు అధికారి తపన కుమార్ నాహక్, జోలాపుట్ పోలీసు అధికారి మహేశ్ కిరిససాని, లమతాపుట్ పోలీసు అధికారి శివప్రసాద్ షొడంగి, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment