yerravaripalem
-
ఖాళీ పేపర్ పై సంతకం... సంచలన నిజాలు బయటపెట్టిన ఎర్రావారిపాలెం బాలిక తండ్రి..
-
పోలీసుల అదుపులో స్మగ్లర్ చంద్రబాబు?
సాక్షి, ఎర్రావారిపాళెం(చిత్తూరు): తలకోన అడవుల్లో ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న బడా ఎర్రచందనం స్మగ్లర్ చంద్రబాబును రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. దుంగలు నరికి తన సరంజామాతో నెరబైలు సమీపంలో పోలీసులకు చిక్కినట్లు తెలిసింది. అతనితో పాటు ఎర్రావారిపాళెంకు చెందిన మరో ఇద్దరు, తిరుపతి కరకంబాడికి చెందిన ఇద్దరు, గంగవరం మండలానికి చెందిన ఇద్దరు స్మగ్లర్లు అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా కొంత మంది తప్పించుకు పారిపోగా గాలింపు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇదీ చంద్రబాబు చరిత్ర.. చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళెం మండలం రెడ్డివారిపల్లెకు చెందిన చంద్రబాబు గత 12 ఏళ్ల క్రితం స్మగ్లింగ్ కూలీగా చేరి ఎర్రచందనం స్మగ్లింగ్‌లో డాన్‌గా ఎదిగాడు. ఎర్రావారిపాళెం, రొంపిచర్ల పోలీస్‌స్టేషన్‌లో ఇప్పటికే 8 కేసులు ఉన్నాయి. 2011లో ఎర్రావారిపా ళెం పోలీస్‌స్టేషన్‌లో 2011లో 5కేసులు, 2012లో ఒక కేసు, 2015లో రొంపిచర్లలో ఒక కేసు, 2019లో ఎర్రావారిపాళెం పోలీస్‌స్టేషన్‌లో కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. పలు కేసుల్లో బెయిల్‌పై ఉన్నాడు. తాజాగా మంగళవారం ఎర్రదుంగలు తరలిస్తూ పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. టీడీపీ హయాంలో విచ్చల విడిగా వ్యాపారం చేసి కోట్లు, స్థిరాస్తులు కూడబెట్టాడని ప్రచారంలో ఉంది. తలకోన అడవుల నుంచి ఎర్రదుంగలు తరలించడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. చదవండి: (టీడీపీ చెత్త రాజకీయం.. హిందూపురంలో బాలకృష్ణ ఇంటి వద్ద ఉద్రిక్తత) -
ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
-
ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెంలో విషాదం చోటు చేసుకొంది. కుటుంబ కలహాలతో గౌతమి అనే మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలసి ఆత్మహత్యకు పాల్పడింది. బాలాజీ నగర్ సమీపంలోని నీటి గుంటలలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మొదట ధరణి (4), తోనేశ్వర్ (3)ను నీటి గుంటలోకి తోసేసి తర్వాత తాను దూకి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. కుటుంబ కలహాలే కారణం అని స్థానికులు చెబుతున్నారు. గౌతమి భర్త వెంకటరమణ వీఆర్వోగా పనిచేస్తూ ఇటీవల పదోన్నతి పొందాడు. అతడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య లక్ష్మీదేవి ఏఎన్ఎంగా పనిచేస్తోంది. రెండో భార్య గౌతమి గృహిణి. అందరూ ఒకే ఇంట్లో ఉండేవారు. ఇటీవల కుటుంబంలో గొడవలు జరిగాయి. దీంతో గౌతమి తన ఇద్దరు కుమారులతో కలసి ఇవాళ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
13 మంది ఎర్రచందనం కూలీలు అరెస్టు
చిత్తూరు: చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం, రొంపిచెర్ల పోలీస్స్టేషన్ల పరిధిలో 13 మంది ఎర్రచందనం కూలీలు పట్టుబడ్డారు. శుక్రవారం ఉదయం కూంబింగ్ చేపట్టిన పోలీసులు ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న వీరిని పట్టుకున్నారు. 14 దుంగలతోపాటు ఒక ఆటో, ఒక బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారు చంద్రగిరి, ఎర్రావారిపాలెం, వెదురుకుప్పం, రొంపిచెర్ల మండలాలకు చెందిన వారు. వీరిలో ఆరుగురు తలకోన ఫారెస్టు బీట్‌లో పనిచేసే అటవీ పరిరక్షక సిబ్బంది కూడా ఉన్నట్లు పీలేరు రూరల్ సీఐ మహేశ్వర్ తెలిపారు.