
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెంలో విషాదం చోటు చేసుకొంది. కుటుంబ కలహాలతో గౌతమి అనే మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలసి ఆత్మహత్యకు పాల్పడింది. బాలాజీ నగర్ సమీపంలోని నీటి గుంటలలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మొదట ధరణి (4), తోనేశ్వర్ (3)ను నీటి గుంటలోకి తోసేసి తర్వాత తాను దూకి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. కుటుంబ కలహాలే కారణం అని స్థానికులు చెబుతున్నారు.
గౌతమి భర్త వెంకటరమణ వీఆర్వోగా పనిచేస్తూ ఇటీవల పదోన్నతి పొందాడు. అతడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య లక్ష్మీదేవి ఏఎన్‌ఎంగా పనిచేస్తోంది. రెండో భార్య గౌతమి గృహిణి. అందరూ ఒకే ఇంట్లో ఉండేవారు. ఇటీవల కుటుంబంలో గొడవలు జరిగాయి. దీంతో గౌతమి తన ఇద్దరు కుమారులతో కలసి ఇవాళ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment