
సుమియా (ఫైల్)
కుప్పం రూరల్(చిత్తూరు జిల్లా): కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వానగుట్టపల్లెకు చెందిన సుమియా (33), చింపనగల్లు గ్రామానికి చెందిన రిజ్వాన్ ఏడేళ్ల క్రితం ప్రేమించి, మతాంతర వివాహం చేసుకున్నారు. భార్య పేరు సుమియాగా మార్చుకున్నాడు రిజ్వాన్. వీరి కాపురం అప్పుడప్పుడు గొడవలు, కలహాల మధ్యనే సాగింది.
చదవండి: ఫ్రెండే కదా అని నమ్మారు.. హాస్టల్ యువతుల ప్రైవేటు వీడియోలు తీసి..!
వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. శుక్రవారం రాత్రి.. రిజ్వాన్‌కు వేరే మహిళలతో అక్రమ సంబంధం కారణంగా భార్య భర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. తీవ్ర మనస్తాపానికి గురైన సుమియా ఇంట్లో అందరు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న సుమియా తల్లి మునెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి శనివారం బంధువులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment