బాధితురాలు హసీనా
రొంపిచెర్ల: డబ్బు తెచ్చి ఇస్తేనే కాపురం చేస్తా.. లేదంటే చంపేస్తాను అని భర్త బెదిరిస్తున్నాడని, రక్షణ కల్పించాలని బాధితురాలు ఆదివారం రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. రొంపిచెర్ల పంచాయతీలోని చిన్న మశీదు వీధికి చెందిన ఎస్.జాకీర్ హుసేన్ కుమారుడు గౌస్‌బాషాకు రొంపిచెర్లకు చెందిన హసీనాను ఇచ్చి 10 నెలల క్రితం వివాహం చేశారు. వీరి కాపురం కొద్ది రోజులు సజావుగా సాగింది. అనంతరం భర్త గౌస్ బాష జూదం, మద్యానికి బానిసగా మారాడు. పెళ్లి సమయంలో ఇచ్చిన రూ.55 వేలు డబ్బు తాగుడుకు ఖర్చు చేశాడు.
అలాగే బంగారు నగలను తాకట్టు పెట్టాడు. మళ్లీ రూ.30 వేలు డబ్బు తెచ్చి ఇస్తేనే కాపురం చేస్తానని, లేదంటే తన స్నేహితులతో కలిసి చంపేస్తానని భార్యను బెదిరించాడు. దీనిపై బాధితురాలు రెండు నెలల క్రితం రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇరువురికీ సర్దిచెప్పి పంపించారు. గౌస్‌బాషాలో మార్పు రాలేదు. రెండు రోజుల నుంచి తనను, నా అన్న అమీర్‌ను చంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని హసీనా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త స్నేహితులు బడాబాబు, నయీమ్, వసీం, యూనిస్, చాను, అçఫ్జల్, నిప్పల్, మస్తాన్, తొట్టుపల్లె, చోటాబాబుతో ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది.
Comments
Please login to add a commentAdd a comment