haseena
-
హసీనా విమానానికి భారత్ బందోబస్తు
-
Haseena Movie Review: హసీనా మూవీ రివ్యూ
టైటిల్: హసీనా నటీనటులు: థన్వీర్, సాయి తేజ గంజి, శివ గంగా, ఆకాష్ లాల్, విశిష్ట నారాయణ, అభినవ్, శ్రేష్ట దర్శకుడు: నవీన్ ఇరగాని నిర్మాత: తన్వీర్ ఎండీ ఎడిటర్: హరీశ్ కృష్ణ(చంటి) కెమెరామన్: రామ కందా సంగీత దర్శకుడు: షారుక్ షేక్ నేపథ్య సంగీతం: నవనీత్ చారి ప్రియాంక డే టైటిల్ రోల్లో థన్వీర్, సాయి తేజ గంజి, శివ గంగా, ఆకాష్ లాల్, విశిష్ట నారాయణ, అభినవ్, శ్రేష్ట ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం హసీనా. హసీనా మూవీ పోస్టర్ ని ప్రకాష్ రాజ్, పాటను నిఖిల్, టీజర్‌ను అడివి శేష్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలా టాలీవుడ్ సెలబ్రిటీలు హసీనా సినిమా కోసం ముందుకు రావడం, ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ చిత్రం మే 19న రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం.. కథ హసీనా (ప్రియాంక డే), థన్వీర్(థన్వీర్), సాయి (సాయితేజ గంజి), శివ (శివ గంగా), ఆకాశ్(ఆకాశ్ లాల్) అనాథలు. అందరూ చిన్నప్పటి నుంచి కలిసి కష్టపడి చదువు పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సంపాదిస్తారు. అయితే హసీనా పుట్టినరోజున ఓ చేదు అనుభవం ఏర్పడుతుంది. ఆ చేదు ఘటనతో మిగతా నలుగురి జీవితాలు మలుపులు తిరుగుతాయి. వీరి కథలోకి అభి(అభినవ్) ఎలా ఎంట్రీ ఇచ్చాడు? అభి ఏం చేశాడు? హసీనాకు జరిగిన చేదు ఘటన ఏంటి? నలుగురు స్నేహితులు, హసీనాల ప్లాన్ ఏంటి? కథ ఎలా ముగిసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే! విశ్లేషణ అనాథలైన నలుగురు అబ్బాయిలు, ఓ అమ్మాయి చిన్నప్పటి నుంచి కలిసి పెరగడం, చదవటం, ఉద్యోగం చేయడం వంటి సన్నివేశాలతో ఫస్టాఫ్ లాక్కొచ్చాడు డైరెక్టర్. ఇంటర్వెల్‌కు ముందు ఓ ట్విస్ట్ పెట్టాడు. ఐదుగురు అనాథలు ఓ కేసులో చిక్కుకుంటారు. అక్కడి నుంచి ఏం జరుగుతుందనేది సెకండాఫ్‌లో చూపించారు. అక్కడక్కడా వచ్చే ట్విస్టులు ముందుగానే తెలిసిపోతాయి. క్లైమాక్స్ వరకు ఏదో ఒక ట్విస్ట్ వస్తూనే ఉండటంతో ఇన్ని ట్విస్టులా అని ఆశ్చర్యం వేయక మానదు. సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. మాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు. నటీనటులు కొత్తవారే అయినా బాగానే నటించారు. కామెడీ సీన్స్‌లో నవ్విస్తూ, యాక్షన్ సీన్స్‌లో ఫైట్స్ చేస్తూ, ఎమోషనల్ సీన్లలో కంటతడి పెట్టిస్తూ అందరూ పర్వాలేదనిపించారు. హసీనా పాత్రలో ప్రియాంక డే చాలా వేరియషన్స్ చూపించింది. అభి పాత్రలో హీరోయిజం, విలనిజం చూపించాడు అభినవ్. చదవండి: ఆర్ఆర్ఆర్ నిర్మాత ఇంట మోగనున్న పెళ్లిబాజాలు -
హసీనా రిలీజ్ డేట్ వచ్చేసింది
ప్రియాంక డే టైటిల్ రోల్లో థన్వీర్, సాయి తేజ గంజి, శివ గంగా, ఆకాష్ లాల్, విశిష్ట నారాయణ, అభినవ్, శ్రేష్ట ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం హసీనా. ఈ సినిమాకు తన్వీర్ ఎండీ నిర్మాతగా, ఎస్ రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రానికి నవీన్ ఇరగాని దర్శకత్వం వహించారు. ఈ మూవీని మే 19న రిలీజ్ చేస్తున్నారు. హసీనా మూవీ పోస్టర్ ని ప్రకాష్ రాజ్, పాటను నిఖిల్, టీజర్‌ను అడివి శేష్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలా యంగ్ హీరోలు హసీనా సినిమా కోసం ముందుకు రావడం, ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో సినిమాపై ఆసక్తి మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాను మే 19న థియేటర్లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు హరీష్ కృష్ణ (చంటి) ఎడిటర్‌గా, రామ కందా కెమెరామెన్‌గా, షారుక్ షేక్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. నేపథ్య సంగీతాన్ని నవనీత్ చారి అందిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి తేజ గంజి లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. -
'హసీనా' టీజర్‌ను విడుదల చేసిన అడివి శేష్
‘‘హీరోయిన్ ఓరియంటెడ్‌గా రూపొందిన చిత్రం ‘హసీనా’. ఈ చిత్రంలో 84 మంది కొత్తవారు నటించడం విశేషం. టీజర్ చాలా బాగుంది.. సినిమా ఘనవిజయం సాధించాలి’’ అని హీరో అడివి శేష్ అన్నారు. ప్రియాంక డే టైటిల్ రోల్లో సాయి తేజ గంజి, తన్నీవర్, శివ గంగా, ఆకాష్ లాల్, వశిష్ణ నారాయణ, అభినవ్, శ్రేష్ట ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హసీనా’. నవీన్ ఇరగాని దర్శకత్వం వహించారు. ఎస్. రాజశేఖర్ రెడ్డి, తన్వీర్ ఎండీ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం టీజర్‌ని అడివి శేష్ విడుదల చేశారు. ‘ఎవడైనా బాగుపడాలన్నా సంకనాకి పోవాలన్నా దానికి కారణం ఫ్రెండ్స్ అయి ఉంటారు’ అనే డైలాగ్‌తో ఆరంభమై, ‘నా పేరు హసీనా.. నా కథ మీకు అర్థం కావాలంటే మీరు మందైనా తాగి ఉండాలి.. లేక మేధావి అయినా అయ్యుండాలి’ డైలాగ్‌తో ముగుస్తుంది. ‘‘క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ఇది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: రామ కందా, సంగీతం: షారుక్ షేక్, నేపథ్య సంగీతం: నవనీత్ చారి, లైన్ ప్రొడ్యూసర్: సాయితేజ గంజి. -
Hyderabad: హాట్సాఫ్.. ఆడపడుచును ఎప్పటికీ గుండెల్లో నిలుపుకొనేందుకు!
కుటుంబంలో ఓ వ్యక్తి దూరమైతే కలిగే దుఃఖం ఎవరూ తీర్చలేనిది. కానీ, మన గుండెల్లోని దయాగుణం ఎదుటివారి మోములో చిరునవ్వుగా మారినప్పుడు శోకం కూడా సంతోషంగా మారుతుంది అంటారు సాజిదా. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ హుడా కాంప్లెక్స్‌లో ఉంటున్న సాజిదా ఖాదర్ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ప్రస్తావించినప్పుడు తన ఆడపడుచు పేరును తలచుకున్నారు. అనారోగ్యంతో తమకు దూరమైన ఆడపడుచు హసీనాను ఎప్పటికీ తమ గుండెల్లో నిలుపుకుంటున్నామని బదులిచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ‘‘నా కూతురు ఏడాది వయసున్నప్పుడు మా ఆడపడచు హసీనా బ్రెయిన్ ట్యూమర్‌తో చనిపోయింది. ఇప్పటికి ఇరవై ఏళ్లయ్యింది హసీనా చనిపోయి. కానీ, ఇప్పటికీ తను మా కళ్లముందున్నట్టే ఉంటుంది. అందంగా నవ్వుతుండేది. పేదవారి పట్ల దయగా ఉండేది. మా ఇంట్లో అందరికీ హసీనా అంటే చాలా అభిమానం. ఆమె గుర్తుగా ప్రతి యేటా పేదలకు మాకు తోచిన సాయం చేసేవాళ్లం. ఉద్యోగాలు మాని, సొంతంగా వ్యాపారం చేసినప్పుడు, వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని హసీనా పేరున దానం చేసేవాళ్లం. దానిని ట్రస్ట్‌గా ఏర్పాటు చేసి, ఒక పద్ధతి ప్రకారం చేస్తే మరింత బాగుంటుందని ఆలోచన వచ్చి దానిని అమలులో పెట్టాం. అవసరమైన వారికి ఏం చేయగలమా అని ఆలోచించాం. అప్పుడే.. పేద పిల్లలకు చదువు, స్లమ్స్‌లోని వారికి వైద్యం అందించాలన్న ఆలోచన వచ్చింది. వెంటనే ఆ ఆలోచనను అమలు చేశాం. అప్పటినుంచి పదిహేనేళ్లుగా మా చుట్టుపక్కల స్లమ్స్‌కి వెళ్లి అక్కడ అవసరమైనవారికి ప్రతీ నెలా రేషన్ ఇచ్చి రావడాన్ని క్రమం తప్పకుండా పాటిస్తున్నాం. అలాగే వృద్ధాశ్రమం ఏర్పాటు చేయడంలో భవన నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఐరన్ వంటివి ఇస్తూ వచ్చాం. మా భార్యాభర్తల ఇద్దరి ఆదాయం నుంచే ఈ సేవలు అందిస్తున్నాం. వేరే ఎవరి దగ్గరా తీసుకోవడం లేదు. ఎంత చేయగలిగితే అంతే చేస్తున్నాం. ఫ్యామిలీ కౌన్సెలర్‌గా మార్చిన డే కేర్ మా స్వస్థలం గుంటూరు. పాతికేళ్ల క్రితం పెళ్లి అయ్యాక ఇద్దరమూ హైదరాబాద్ వచ్చేశాం. మొదట్లో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తుండేవాళ్లం. డబుల్ డిగ్రీ చేసిన నేను ప్రైవేట్ టీచర్‌గా చేసేదాన్ని. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వారిని పగటి వేళ ఉంచడానికి సరైన కేర్ సెంటర్ కోసం చాలా ప్రయత్నించాను. కానీ, ఏదీ సరైనది అనిపించలేదు. దాంతో ఉద్యోగం మానేసి బేబీ కేర్ సెంటర్‌ను ప్రారంభించాను. దీంతో సెంటర్‌కు వచ్చే తల్లులు, కాలనీల వాళ్లు కొన్ని సందర్భాలలో తమ సమస్యలను చెప్పినప్పుడు, నాకు తోచిన సలహా ఇచ్చేదాన్ని. డే కేర్ సెంటర్ కొన్నాళ్లకు ఫ్యామిలీ కేర్ సెంటర్‌గా మారిపోయింది. న్యాయ సేవ వైపు అడుగులు.. కొన్ని సమస్యలు ఎంత కౌన్సెలింగ్ చేసినా పరిష్కారం అయ్యేవి కావు. అప్పుడు అక్కడ నుంచి పారా లీగల్ సేవలు వైపుగా వెళ్లాను. సామరస్యంగా సమస్యలను పరిష్కార దిశగా తీసుకెళ్లేదాన్ని. అలా చాలా కేసుల పరిష్కారానికి కృషి చేశాను. నా సర్వీస్‌ను గమనించి, జిల్లా న్యాయసేవా సదన్ వారు పారా లీగల్ వలంటీర్‌గా నియమించారు. అలా కొన్నాళ్లు కౌన్సెలింగ్ చేస్తూ వచ్చాను. ఒక సందర్భంలో నటి జయసుధ దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడకు వచ్చిన వ్యక్తి ద్వారా హ్యూమన్ రైట్స్లోకి వెళ్లాను. మానవహక్కులను కాపాడటంలో ఎవరికీ భయపడలేదు. చాలాసార్లు బెదిరింపులు కూడా వచ్చాయి. కానీ, పోలీస్ డిపార్ట్మెంట్, న్యాయవ్యవస్థ అండగా ఉండటంతో ఎన్నో కేసుల్లో విజయం సాధించాను. మహిళలకు ఉచిత శిక్షణ ఎన్ని పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసినా హసీనా ట్రస్ట్ మాత్రం వదల్లేదు. ఈ ట్రస్ట్ ద్వారా ఉచిత విద్య, వైద్యంతో పాటు వికలాంగులు నిలదొక్కుకునేలా సహాయం అందిస్తున్నాం. మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి కాలనీల్లో వెల్ఫేర్ అసోసియేషన్లు ఏర్పాటు చేసి, వాటి ద్వారా టైలరింగ్, ఎంబ్రాయిడరీలలో శిక్షణ ఇప్పిస్తున్నాను. మా అమ్మాయి పేరు హుస్నా. కానీ, చాలా మంది తెలియక హసీనా మీ కూతురా అని అడుగుతుంటారు. నేను కూడా ‘అవును నా పెద్ద కూతురు’ అని సమాధానమిస్తుంటాను. సేవ అనేది చేస్తున్న ప్రతి పనిలో భాగమైంది. హసీనా మా సేవకు ఒక రూపు అయ్యింది. పేదల నవ్వుల్లో చెరగని దివ్వె అయ్యింది’ అని వివరించారు సాజిదా. – నిర్మలారెడ్డి -
ఓ వదిన.. క్రైమ్‌స్టోరీ
-
విజయవాడలో ఘోరం
విజయవాడ: ఆవేశం ఆ ఇల్లాలిలోని మానవత్వాన్ని చంపేసింది. కొడుకులా చూసుకోవాల్సిన మరిదిపైనా, చెల్లెలిలా చూసుకోవాల్సిన ఆడపడుచుపైనా కక్షపెంచుకునేలా చేసింది. కసాయిగా మారిన వదినే ఆ ఇద్దరి పాలిట అపరకాళికను చేసింది. విజయవాడలో సంచలనం రేకెత్తించిన సంఘటన కానూరు ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు.. పైఫోటోలో కనిపిస్తోన్న మహిళ పేరు ముంతాజ్. మానసిక వ్యాధితో బాధపడుతోన్న ఆడపడుచు హసీనా వైద్యానికి భర్త సంపాదన ఖర్చు చేస్తుండటాన్ని జీర్ణించుకోలేకపోయింది. పెళ్లికి ముందు వరకు తనతో బాగుండిన మరిది ఖలీల్ ఇప్పుడు పట్టించుకోకపోవడంతో పగపట్టింది. ఇద్దరినీ అంతమొందించాలని స్కెచ్ వేసింది. కుట్రలో భాగంగా హసీనా, ఖలీల్‌లపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో ఆడపడుచు హసీనా అక్కడికక్కడే మృతిచెందింది. 80 శాతం గాయాలతో కొట్టుమిట్టాడుతోన్న ఖలీల్‌ని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముంతాజ్ ఇంత దారుణానికి ఒడిగట్టడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. -
డబ్బు ఇవ్వకపోతే చంపేస్తా
రొంపిచెర్ల: డబ్బు తెచ్చి ఇస్తేనే కాపురం చేస్తా.. లేదంటే చంపేస్తాను అని భర్త బెదిరిస్తున్నాడని, రక్షణ కల్పించాలని బాధితురాలు ఆదివారం రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. రొంపిచెర్ల పంచాయతీలోని చిన్న మశీదు వీధికి చెందిన ఎస్.జాకీర్ హుసేన్ కుమారుడు గౌస్‌బాషాకు రొంపిచెర్లకు చెందిన హసీనాను ఇచ్చి 10 నెలల క్రితం వివాహం చేశారు. వీరి కాపురం కొద్ది రోజులు సజావుగా సాగింది. అనంతరం భర్త గౌస్ బాష జూదం, మద్యానికి బానిసగా మారాడు. పెళ్లి సమయంలో ఇచ్చిన రూ.55 వేలు డబ్బు తాగుడుకు ఖర్చు చేశాడు. అలాగే బంగారు నగలను తాకట్టు పెట్టాడు. మళ్లీ రూ.30 వేలు డబ్బు తెచ్చి ఇస్తేనే కాపురం చేస్తానని, లేదంటే తన స్నేహితులతో కలిసి చంపేస్తానని భార్యను బెదిరించాడు. దీనిపై బాధితురాలు రెండు నెలల క్రితం రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇరువురికీ సర్దిచెప్పి పంపించారు. గౌస్‌బాషాలో మార్పు రాలేదు. రెండు రోజుల నుంచి తనను, నా అన్న అమీర్‌ను చంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని హసీనా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త స్నేహితులు బడాబాబు, నయీమ్, వసీం, యూనిస్, చాను, అçఫ్జల్, నిప్పల్, మస్తాన్, తొట్టుపల్లె, చోటాబాబుతో ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది. -
షమీ బీసీసీఐని మోసం చేశాడు
కోల్‌కతా: భారత పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ, అతని భార్య హసీన్ జహాన్‌ల వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఇప్పటికే అతనిపై అనేక ఆరోపణలు చేసిన హసీన్ తాజాగా మరో బాంబు పేల్చింది. షమీ తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్)లను మోసం చేశాడంటూ మళ్లీ వార్తల్లో నిలిచింది. తన అసలు వయసు కంటే ఎనిమిదేళ్లు తక్కువగా చూపించే ధ్రువపత్రాలతో అందర్నీ మోసం చేశాడని సోషల్ మీడియా ఫేస్బుక్ ద్వారా బయట పెట్టింది. దీనికి సంబంధించి షమీ ఫొటో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్‌ను పోస్ట్ చేసింది. అయితే కొద్ది సేపటికే ఆ పోస్ట్‌ను తొలగించింది. ప్రస్తుత రికార్డుల ప్రకారం షమీ పుట్టిన సంవత్సరం 1990 కాగా... జహాన్ షేర్ చేసిన డ్రైవింగ్ లైసెన్స్‌లో 1982గా ఉంది. ‘షమీ నకీలీ జనన ధ్రువీకరణ పత్రాలతో తన పుట్టిన సంవత్సరం 1990గా చూపిస్తూ ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నాడు. అతను బీసీసీఐ, క్యాబ్‌లతో పాటు ప్రజలను కూడా వంచించాడు. ఈ తప్పుడు పత్రాలతోనే అం డర్–22 టోర్నీల్లో పాల్గొన్నాడు. దీనివల్ల అర్హులైన 22 ఏళ్ల వయసు గల క్రికెటర్లు నష్టపోయారు’ అని ఆమె పేర్కొంది. -
హసీనా ప్రేమలో పడ్డప్పుడు..!
ఇప్పటివరకు పక్కింటి అమ్మాయిగా చూడముచ్చటైన పాత్రలతో అలరించిన శ్రద్ధాకపూర్ ఇప్పుడు రూటు మార్చింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి ‘హసీనా’గా కరుడుగట్టిన క్యారెక్టర్లో నటిస్తూ తన అభిమానులను షాక్ ఇచ్చింది. గతంలోనే హసీనా యవ్వనంలో, వయస్సు పైబడ్డప్పుడు ఎలా ఉంటుందో ఫస్ట్ లుక్ విడుదల చేసింది శ్రద్ధా. హసీనాగా ఆమె లుక్‌గా మంచి మార్కులే దక్కాయి. తాజాగా హసీనా భర్త పాత్రను ఆమె రీవిల్ చేసింది. హసీనా భర్త ఇబ్రహీం పార్కర్‌గా అంకుర్ భాటియా నటిస్తున్నాడు. సినిమాలో భాగంగా వారిద్దరూ రొమాన్స్‌లో మునిగితేలిన ఓ ఫొటోను మేం ప్రేమలో పడ్డప్పుడు అంటూ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రద్ధ పోస్టుచేసింది. ఈ సినిమాలో హసీనా తమ్ముడిగా శ్రద్ధ తమ్ముడు సిద్ధాంత్ కపూర్ నటిస్తుండటం గమనార్హం. సొంత తమ్ముడే సినిమాలోనూ తమ్ముడిగా నటిస్తుండటం ఎంతో సంతోషంగా ఉందని శ్రద్ధ పేర్కొంది. -
యువతి బలవన్మరణం
కణేకల్లు(రాయదుర్గం) : కణేకల్లు కొత్తకొట్టాలకు చెందిన హసీన(18) గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. గోరంట్ల మండలం శెట్టిపల్లికి చెందిన అబీద కణేకల్లులో ఎంపీఈఓగా పని చేస్తున్నారు. ఆమె భర్త భర్త డేవిడ్‌తో కలసి కొత్తకొట్టాలలో నివాసముంటున్నారు. అక్కకు తోడుగా హసీన ఇక్కడే ఉంటోంది. అయితే కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న ఆమెకు గురువారం మరోసారి నొప్పి ఎక్కువైంది. దీంతో జీవితంపై విరక్తితో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని తనువు చాలించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కణేకల్లు పీహెచ్‌సీకి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్ నిర్ధారించారు. -
సైనా పాత్రలో శ్రద్ధా..!
బాలీవుడ్ తెర మీద బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. ముఖ్యంగా క్రీడాకారుల జీవిత కథలను సినిమాలుగా మలిచేందుకు బాలీవుడ్ మేకర్స్ ఆసక్తికనబరుస్తున్నారు. ఇప్పటికే బాగ్ మిల్కా బాగ్, ధోని, దంగల్, మేరీకోమ్ లాంటి చిత్రాలు ఘనవిజయం సాధించిన నేపథ్యంలో మరో స్పోర్ట్స్ బయోపిక్ రెడీ అవుతోంది. హైదరాబాదీ సెన్సేషన్ సైనా నెహ్వల్ కథతో సినిమా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. టీ సీరీస్ అధినేత భూషన్ కుమార్ అమోల్ గుప్తా దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నారు. సైనా అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో టైటిల్ రోల్ కోసం బాలీవుడ్ బ్యూటి శ్రద్ధా కపూర్‌ను సంప్రదిస్తున్నారు. ప్రస్తుతం అండర్ వరల్డ్ డాన్ దావూవ్ ఇబ్రహిం సోదరి హసీన జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న శ్రద్దా. గ్లామర్ రోల్స్‌లోనూ ఆకట్టుకుంటోంది. -
ఆడ బిడ్డకు జన్మనిచ్చిందని వివక్ష
కట్నం కోసం వేధింపులు పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు రొంపిచెర్ల: ఆడబిడ్డకు జన్మనిచ్చాననే వివక్ష చూపడమే కాకుండా అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధిస్తున్నారని మహిళా దినోత్సవం రోజే ఓ మహిళ బుధవారం రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి కథనం మేరకు.. రొంపిచెర్ల గ్రామ పంచాయతీ లక్ష్మీనారాయణకాలనీకి చెందిన టిప్పుసుల్తాన్‌తో 2016 ఫిబ్రవరి 4న చిన్న మసీదువీధికి చెందిన హసీనాకు (21) పెద్దల సమక్షంలో నిఖా (వివాహం) చేశారు. వివాహ సమయంలో 80 గ్రాముల బంగారు నగలు, రూ.20 వేలు కట్న కానుకల కింద హసీనా కుటుంబ సభ్యులు ఇచ్చా రు. వివాహమైన మూడు నెలలకే ఆమె గర్భం దాల్చడంతో వేధింపులు ఎక్కువయ్యాయి. వివాహేతర సంబంధం అంటగట్టి, వేధింపులకు తెరతీశారు. సీమంతం సమయంలో అదనంగా 80 గ్రాముల బంగారు నగలు ఇవ్వాలని పట్టుబట్టారు. హసీనా ఆడబిడ్డకు జన్మనివ్వడంతో ఈ వేధింపులు మరింత తీవ్రమయ్యాయి. ఆడ బిడ్డకు జన్మనిచ్చావంటూ హసీనాను తూలనాడారు. అంతేకాకుండా తన భర్తకు మరో వివాహం చేస్తానంటూ అత్త బెదిరించేందని, తన భర్త సైతం రెండో వివాహానికి సిద్ధపడ్డాడని, తాను ఇక పుట్టింటిలోనే ఉండాలంటూ అత్తింటివారు ఆంక్షలు విధించారని హసీనా వాపోయింది. తాను ప్రసవించి 4 నెలలైనా పుట్టింటిలోనే ఉన్నానని గోడు వెళ్లగక్కింది. అంతేకాకుండా దుల్హన్ పథకం ద్వారా ముస్లింలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.50వేలను కూడా తనను మభ్యపెట్టి మొత్తం డబ్బును అత్తింటి వారు కాజేశారని తెలిపింది. అత్త అయిషా, చిన్న మామ బావాజీ, తాత అల్లాబ„Š , తన భర్త అదనపు కట్నం కోసం వేధించారని, పోలీసులే తనకు న్యాయం చేయాలని వేడుకుంది. -
దావూద్ కా బెహన్... మాఫియా క్వీన్!
ముంబయ్ అంటే బాలీవుడ్డే కాదు, ఇండియా బిజినెస్ కాపిటల్ కూడా! అంతేనా... ముంబయ్‌లో భాయ్ కల్చర్ కూడా బాగా ఫేమస్. దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్... చీకటి ప్రపంచంలో తమకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్న మాఫియా ప్రముఖులు ముంబయ్ కేంద్రంగా పలు పనులు చేశారని అప్పుడప్పుడూ వార్తలు వినిపిస్తుంటాయి. దావుద్ చెల్లెలు హసీనా కొన్నాళ్లు మకుటం లేని మహారాణిలా ముంబయ్‌లో రాజ్యాధికారం చెలాయించారట! ఇప్పుడామె కథతో రూపొందుతున్న సినిమా ‘హసీనా’లో శ్రద్ధా కపూర్ టైటిల్ రోల్లో నటిస్తున్నారు. ఫొటోలో చూస్తున్నది సినిమాలో ఆమె ఫస్ట్ లుక్. ఎక్కువగా గ్లామరస్ పాత్రలు చేసే శ్రద్ధ... కళ్లలో కనబరుస్తున్న క్రూరత్వం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 17 ఏళ్ల వయసు నుంచి 40 ఏళ్ల వయసు వరకూ హసీనా జీవితంలో జరిగిన విషయాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. -
నయీమ్ భార్యకు రెండు రోజుల కస్టడీ
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ భార్య హసీనా, ఫహీమ్ భార్య సాజిదా షాహీన్‌లను సోమవారం నుంచి రెండు రోజుల పాటు నార్సింగి పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ ఉప్పర్‌పల్లి కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. -
5 రోజుల కస్టడీకి నయీం భార్య
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కుటుంబ సభ్యులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నయీం భార్య హసీనా బేగం, చెల్లెలు సలీమా బేగం బావమరిది అబ్దుల్ మతిన్, మరో మహిళ ఖలీమాబేగంలను కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నలుగురిని మహబూబ్‌నగర్ జిల్లా జైలు నుంచి షాద్‌నగర్ పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. నయీం ఆగడాలకు సంబంధించిన విషయాలపై మరిన్ని కోణాల్లో పోలీసులు విచారించనున్నారు. -
నలుగురు బాలికలు అదృశ్యం
రాజేంద్రనగర్ మండలం నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో నలుగురు బాలికలు కనిపించకుండాపోయారు. పుప్పాల్‌గూడ గ్రామం లంబాడిగడ్డకు చెందిన హసీనా(19), హుస్సేన్ బీ(16), సమీనా(13), షహీన్(10)సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రయినా తిరిగిరాలేదు. దీంతో వారి తల్లిదండ్రులు వెతుకులాడినా ప్రయోజనం కనిపించలేదు. ఈ మేరకు తల్లిదండ్రులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.