సైనా పాత్రలో శ్రద్ధా..! | Shraddha Kapoor playing Saina nehwal role | Sakshi
Sakshi News home page

సైనా పాత్రలో శ్రద్ధా..!

Published Wed, Apr 26 2017 11:48 AM | Last Updated on Tue, Sep 5 2017 9:46 AM

సైనా పాత్రలో శ్రద్ధా..!

సైనా పాత్రలో శ్రద్ధా..!

బాలీవుడ్ తెర మీద బయోపిక్ల సీజన్ నడుస్తోంది. ముఖ్యంగా క్రీడాకారుల జీవిత కథలను సినిమాలుగా మలిచేందుకు బాలీవుడ్ మేకర్స్ ఆసక్తికనబరుస్తున్నారు. ఇప్పటికే బాగ్ మిల్కా బాగ్, ధోని, దంగల్, మేరీకోమ్ లాంటి చిత్రాలు ఘనవిజయం సాధించిన నేపథ్యంలో మరో స్పోర్ట్స్ బయోపిక్ రెడీ అవుతోంది. హైదరాబాదీ సెన్సేషన్ సైనా నెహ్వల్ కథతో సినిమా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

టీ సీరీస్ అధినేత భూషన్ కుమార్ అమోల్ గుప్తా దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నారు. సైనా అనే టైటిల్తో తెరకెక్కనున్న ఈ సినిమాలో టైటిల్ రోల్ కోసం బాలీవుడ్ బ్యూటి శ్రద్ధా కపూర్ను సంప్రదిస్తున్నారు. ప్రస్తుతం అండర్ వరల్డ్ డాన్ దావూవ్ ఇబ్రహిం సోదరి హసీన జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న శ్రద్దా. గ్లామర్ రోల్స్లోనూ ఆకట్టుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement