'హసీనా' టీజర్‌ను విడుదల చేసిన అడివి శేష్‌ | Haseena Teaser Launch by Hero Adivi Sesh | Sakshi
Sakshi News home page

'హసీనా' టీజర్‌ను విడుదల చేసిన అడివి శేష్‌

Published Sat, Oct 15 2022 10:53 AM | Last Updated on Sat, Oct 15 2022 10:54 AM

Haseena Teaser Launch by Hero Adivi Sesh - Sakshi

‘‘హీరోయిన్‌ ఓరియంటెడ్‌గా రూపొందిన చిత్రం ‘హసీనా’. ఈ చిత్రంలో 84 మంది కొత్తవారు నటించడం విశేషం. టీజర్‌ చాలా బాగుంది.. సినిమా ఘనవిజయం సాధించాలి’’ అని హీరో అడివి శేష్‌ అన్నారు. ప్రియాంక డే టైటిల్‌ రోల్‌లో సాయి తేజ గంజి, తన్నీవర్, శివ గంగా, ఆకాష్‌ లాల్, వశిష్ణ నారాయణ, అభినవ్, శ్రేష్ట ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హసీనా’. నవీన్‌ ఇరగాని దర్శకత్వం వహించారు. ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి, తన్వీర్‌ ఎండీ నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

ఈ చిత్రం టీజర్‌ని అడివి శేష్‌ విడుదల చేశారు. ‘ఎవడైనా బాగుపడాలన్నా సంకనాకి పోవాలన్నా దానికి కారణం ఫ్రెండ్స్‌ అయి ఉంటారు’ అనే డైలాగ్‌తో ఆరంభమై, ‘నా పేరు హసీనా.. నా కథ మీకు అర్థం కావాలంటే మీరు మందైనా తాగి ఉండాలి.. లేక మేధావి అయినా అయ్యుండాలి’ డైలాగ్‌తో ముగుస్తుంది.

‘‘క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ఇది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: రామ కందా, సంగీతం: షారుక్‌ షేక్, నేపథ్య సంగీతం: నవనీత్‌ చారి, లైన్‌ ప్రొడ్యూసర్‌: సాయితేజ గంజి.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement