సూర్య శ్రీనివాస్, షెర్రీ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న సైంటిఫిక్ థ్రిల్లర్ చిత్రం ‘ఎంతవారు గాని’. ఈ మూవీతో ఎన్ శ్రీనివాసన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రాజశేఖర్ అన్నభీమోజు, సురేంద్ర కారుమంచి, శివ ముప్పరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం నుంచి తాజాగా టీజర్‌ను బయటకు వచ్చింది. యంగ్ అడవి శేష్ చేతుల మీదుగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.
అనంతరం అడవి శేష్ మాట్లాడుతూ.. ఈ టీజర్ తనకు నచ్చిందని చెప్పాడు. అంతేకాదు ఈ సినిమా మంచి విజయం సాధించాలని సాధించాలని ఆకాంక్షిస్తూ మూవీ టీంకు అభినందనలు తెలిపాడు. కాగా ఒక నిమిషం నిడివితో కట్ చేసిన ఈ టీజర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొల్పింది మూవీ టీం. తమ సినిమాలో ఎన్నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు సస్పెన్స్, రొమాన్స్ కూడా ఉంటుందని ఈ సందర్భంగా చిత్ర బృందం పేర్కొంది.
Adivi Sesh: యంగ్ హీరో అడవి శేష్ చేతుల మీదుగా ‘ఎంతవారుగాని’ టీజర్
Published Mon, Dec 5 2022 3:15 PM | Last Updated on Mon, Dec 5 2022 3:33 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment