
దావూద్ కా బెహన్... మాఫియా క్వీన్!
ముంబయ్ అంటే బాలీవుడ్డే కాదు, ఇండియా బిజినెస్ కాపిటల్ కూడా! అంతేనా... ముంబయ్‌లో భాయ్ కల్చర్ కూడా బాగా ఫేమస్. దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్... చీకటి ప్రపంచంలో తమకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్న మాఫియా ప్రముఖులు ముంబయ్ కేంద్రంగా పలు పనులు చేశారని అప్పుడప్పుడూ వార్తలు వినిపిస్తుంటాయి.
దావుద్ చెల్లెలు హసీనా కొన్నాళ్లు మకుటం లేని మహారాణిలా ముంబయ్‌లో రాజ్యాధికారం చెలాయించారట! ఇప్పుడామె కథతో రూపొందుతున్న సినిమా ‘హసీనా’లో శ్రద్ధా కపూర్ టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు. ఫొటోలో చూస్తున్నది సినిమాలో ఆమె ఫస్ట్ లుక్. ఎక్కువగా గ్లామరస్ పాత్రలు చేసే శ్రద్ధ... కళ్లలో కనబరుస్తున్న క్రూరత్వం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 17 ఏళ్ల వయసు నుంచి 40 ఏళ్ల వయసు వరకూ హసీనా జీవితంలో జరిగిన విషయాలను ఈ చిత్రంలో చూపించనున్నారు.