హసీనా ప్రేమలో పడ్డప్పుడు..!
ఇప్పటివరకు పక్కింటి అమ్మాయిగా చూడముచ్చటైన పాత్రలతో అలరించిన శ్రద్ధాకపూర్ ఇప్పుడు రూటు మార్చింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి ‘హసీనా’గా కరుడుగట్టిన క్యారెక్టర్‌లో నటిస్తూ తన అభిమానులను షాక్ ఇచ్చింది. గతంలోనే హసీనా యవ్వనంలో, వయస్సు పైబడ్డప్పుడు ఎలా ఉంటుందో ఫస్ట్ లుక్ విడుదల చేసింది శ్రద్ధా. హసీనాగా ఆమె లుక్‌గా మంచి మార్కులే దక్కాయి.
తాజాగా హసీనా భర్త పాత్రను ఆమె రీవిల్ చేసింది. హసీనా భర్త ఇబ్రహీం పార్కర్‌గా అంకుర్ భాటియా నటిస్తున్నాడు. సినిమాలో భాగంగా వారిద్దరూ రొమాన్స్‌లో మునిగితేలిన ఓ ఫొటోను మేం ప్రేమలో పడ్డప్పుడు అంటూ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రద్ధ పోస్టుచేసింది. ఈ సినిమాలో హసీనా తమ్ముడిగా శ్రద్ధ తమ్ముడు సిద్ధాంత్ కపూర్ నటిస్తుండటం గమనార్హం. సొంత తమ్ముడే సినిమాలోనూ తమ్ముడిగా నటిస్తుండటం ఎంతో సంతోషంగా ఉందని శ్రద్ధ పేర్కొంది.