సాక్షి, హైదరాబాద్: వజ్ర .. ప్రజలకు చేరువగా కాలనీల్లోకే వచ్చి ఎక్కించుకుని వెళ్లేందుకు వీలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రారంభించిన ఆర్టీసీ మినీ ఏసీ బస్సు. ఇలాంటివి సంస్థ వద్ద 100 ఉన్నాయి. కానీ ఇప్పటికే కన్పించకుండా డిపోలకు పరిమితమైన ఈ బస్సులు ఇకపై ప్రయాణి కులకు దూరం కానున్నాయి. ఉన్నవి ఉన్నట్టుగా అమ్మేయాలని ఆర్టీసీ నిర్ణయించడమే ఇందుకు కారణం. అమ్మకానికి వీలుగా కొన్నిటిని తుక్కుగా నిర్ధారిస్తూ ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు డిపోల అధీనంలో ఉన్న బస్సులను హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఉన్న తుక్కు యార్డుకు తరలించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. తొలిదశలో 65 బస్సుల్ని తుక్కు కింద ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయనున్నారు. ఆ తర్వాత మిగతా 35 బస్సుల్ని కూడా విక్రయించనున్నారు. ఐదేళ్ల క్రితం ప్రారంభమై ఇంకా కాలం తీరని బస్సుల్ని సరిగా నిర్వహించలేక.. టోకున అమ్మేసేందుకు ఆర్టీసీ నిర్ణయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇలా మొదలై..
సిటీ బస్సు కాకుండా దూర ప్రాంతానికి వెళ్లే ఆర్టీసీ బస్సెక్కాలంటే బస్టాండుకో లేదా ఎక్కడో ఉండే ఆర్టీసీ పాయింట్ వద్దకో వెళ్లాలి. అంతేకానీ క్యాబ్ లాగా అది మన ఇంటి సమీపంలోకి రాదు. కానీ బస్సు కూడా కాలనీలకు చేరువగా వెళ్లేలా ఆర్టీసీలో ఓ ఏర్పాటు ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ‘వజ్ర’ పేరుతో 2016–17లో ఆర్టీసీ ఓ మినీ బస్సు కేటగిరీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు వంద ఏసీ బస్సులను రెండు దశల్లో కొనుగోలు చేసింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్, వరంగల్‌కు నడిచేలా రూట్లు సిద్ధం చేసింది. ప్రయాణికులు ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకుని.. ఆ బస్సు రూట్‌లో వారుండే కాలనీకి దగ్గరగా ఉండే పాయింట్‌కు వెళ్లి ఎక్కేలా ఏర్పాటు చేశారు. నగదు లావాదేవీ లేకుండా ఆన్‌లైన్‌లోనే డబ్బు చెల్లించాలి. బస్సు ఏ పాయింట్‌కు, ఎన్ని గంటలకు వస్తుందో ముందుగానే ప్రయాణికుడి మొబైల్‌కు సమాచారం వెళ్లేలా ఏర్పాటు చేశారు. కానీ అంతా ఆన్‌లైన్‌తో కూడిన ఈ విధానానికి ప్రయాణికులు చేరువ కాకపోవటంతో అది కాస్తా ఫెయిల్ అయ్యింది. ప్రయాణికులకు ఎందుకు చేరువ కాలేదో, ఏ విధమైన మార్పులు చేయాలో గుర్తించని ఆర్టీసీ, కొంతకాలం అదే పద్ధతిలో బస్సులు నడిపి చివరకు ఆ పద్ధతి విరమించుకుంది. మిగతా బస్సుల మాదిరి బస్టాండ్లకే పంపేలా ఏర్పాటు చేసింది. కానీ గరుడ ప్లస్ టికెట్ ధరలను వీటికి అన్వయించటం, చిన్న బస్సు ఎక్కువ వేగంగా వెళితే వైబ్రేషన్‌కు గురవటం, ఏసీ సరిగా పనిచేయకపోవటం వంటి కారణాలతో ఇక్కడా ఆదరణ అంతంత మాత్రంగానే ఉంటూ వచ్చింది. ఈసారైనా లోపాలను సరిదిద్దడంపై సంస్థ దృష్టి పెడితే బాగుండేది. కానీ సర్వే కూడా సరిగా చేయకుండా వాటిని కొంతకాలం అలాగే తిప్పటం, జనం ఎక్కకుంటే డిపోలకే పరిమితం చేయటం ద్వారా ప్రయాణికులకు వాటిపై నమ్మకం లేకుండా చేసింది. గతేడాది ఆర్టీసీలో సమ్మె తర్వాత అధికారులు వాటిని పూర్తిగా డిపోలకే పరిమితం చేశారు. ఆ తర్వాత కోవిడ్ లాక్‌డౌన్‌తో పూర్తిగా మూలన పడేశారు.
కాలం తీరకున్నా..
సాధారణంగా ఆర్టీసీ తన బస్సుల కాలం తీరిన తర్వాత కూడా వాడుతుంటుంది. చాలినన్ని బస్సుల్లేక చాలాకాలంగా డొక్కు బస్సులను వినియోగిస్తూనే ఉంది. కానీ ఇప్పుడు తుక్కుగా మారుస్తున్న వజ్ర బస్సుల కాలం తీరలేదు. తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో అధికారులు ఈ విషయం కూడా పేర్కొన్నారు. తక్కు కింద అమ్మకానికి సిద్ధమైన 65 బస్సులకు ఇంకా రూ.7,27,27,592 విలువైన ‘జీవితకాలం’ ఉందని పేర్కొన్నారు. అంటే.. తరుగు, ఇతర ఖర్చులు తీసేసినా అంత విలువ మేరకు ఇంకా వినియోగించాలన్న మాట. ఇప్పుడు వాటిని పక్కన పెడితే అంత నష్టం వాటిల్లినట్టే. ఆర్టీసీ కొత్తగా ప్రారంభించిన సరుకు రవాణా విభాగానికి వీటిని బదిలీ చేసి ఏసీ అవసరం ఉన్న సరుకులను వీటిల్లో తరలించేలా ప్రయత్నాలు చేసినా డిమాండ్ లేక పోవడంతో డిపోలకే పరిమితం అయ్యాయి. వినియోగం లేక క్రమంగా పాడవుతున్నాయన్న ఉద్దేశంతో చివరకు అమ్మేయాలని నిర్ణయించారు. తొలుత తుక్కు యార్డుకు తరలించాలని నిర్ణయించిన 65 బస్సులు 4 లక్షల కి.మీ వరకు తిరగ్గా.. మిగతా 35 బస్సులు అంత కూడా ప్రయాణించలేదు.
ఇలా వాడేందుకు అవకాశం ఉన్నా..
ప్రస్తుతం ఆర్టీసీలో బస్సుల కొరత తీవ్రంగా ఉంది. కొత్త బస్సులు కొనకపోవడమే దీనికి కారణం. ఇక ఏసీ బస్సులకు మరింత కొరత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వజ్ర బస్సుల్ని ఎలా వినియోగిస్తే బాగుంటుందో అనే విషయంలో సరైన కసరత్తు జరగలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.రాష్ట్రంలో కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ లాంటి అతికొద్ది జిల్లా కేంద్రాలకే ఏసీ బస్సులున్నాయి. మిగతా జిల్లా కేంద్రాలకు ఏసీ బస్సులకు డిమాండ్ ఉన్నా కొనే ఆర్థిక స్తోమత ఆర్టీసీకి లేదు. ఈ నేపథ్యంలో నగరానికి చేరువగా ఉన్న పట్టణాలకు మినీ బస్సుల్ని రెగ్యులర్ సర్వీసులుగా తిప్పితే ఆదరణ ఉంటుందన్న అభిప్రాయాన్ని ఆర్టీసీ సిబ్బందే వ్యక్తం చేస్తున్నారు. అలాగే నిరంతరం రద్దీగా ఉండే శ్రీశైలం లాంటి పుణ్య క్షేత్రాలకు వీటిని వాడాలన్న సూచన కూడా పెండింగులో ఉంది. యాదాద్రి కొత్త దేవాలయంలో దర్శనాలు మొదలయ్యాక నగరం నుంచి రద్దీ బాగా ఉంటుంది. అప్పుడు వీటిని షటిల్ సర్వీసులుగా వాడాలన్న సూచన ఉంది. దీన్ని ఆర్టీసీ పట్టించుకోవటం లేదు. కేరళ ప్రభుత్వం కొన్ని మినీ ఏసీ బస్సులను మొబైల్ దుకాణాలుగా మార్చి అద్దెకు ఇచ్చింది. అక్కడి నగరాల్లో వీటికి డిమాండ్ బాగా ఉంది. అలా ప్రైవేటు వ్యక్తులకు అద్దెకిస్తే ఆర్టీసీకి ఆదాయం వస్తుందన్న సూచనను కూడా అధికారులు బుట్టదాఖలు చేశారు.
టికెట్ బుక్ చేసుకుని..
ఆ బస్సు రూట్‌లో వారుండే కాలనీకి దగ్గరగా ఉండే పాయింట్‌కు వెళ్లి ఎక్కేలా ఏర్పాటు చేశారు. నగదు లావాదేవీ లేకుండా ఆన్‌లైన్‌లోనే డబ్బు చెల్లించాలి. బస్సు ఏ పాయింట్‌కు, ఎన్ని గంటలకు వస్తుందో ముందుగానే ప్రయాణికుడి మొబైల్‌కు సమాచారం వెళ్లేలా ఏర్పాటు చేశారు. కానీ అంతా ఆన్‌లైన్‌తో కూడిన ఈ విధానానికి ప్రయాణికులు చేరువ కాకపోవటంతో అది కాస్తా ఫెయిల్ అయ్యింది. ప్రయాణికులకు ఎందుకు చేరువ కాలేదో, ఏ విధమైన మార్పులు చేయాలో గుర్తించని ఆర్టీసీ, కొంతకాలం అదే పద్ధతిలో బస్సులు నడిపి చివరకు ఆ పద్ధతి విరమించుకుంది. మిగతా బస్సుల మాదిరి బస్టాండ్లకే పంపేలా ఏర్పాటు చేసింది. కానీ గరుడ ప్లస్ టికెట్ ధరలను వీటికి అన్వయించటం, చిన్న బస్సు ఎక్కువ వేగంగా వెళితే వైబ్రేషన్‌కు గురవటం, ఏసీ సరిగా పనిచేయకపోవటం వంటి కారణాలతో ఇక్కడా ఆదరణ అంతంత మాత్రంగానే ఉంటూ వచ్చింది. ఈసారైనా లోపాలను సరిదిద్దడంపై సంస్థ దృష్టి పెడితే బాగుండేది. కానీ సర్వే కూడా సరిగా చేయకుండా వాటిని కొంతకాలం అలాగే తిప్పటం, జనం ఎక్కకుంటే డిపోలకే పరిమితం చేయటం ద్వారా ప్రయాణికులకు వాటిపై నమ్మకం లేకుండా చేసింది. గతేడాది ఆర్టీసీలో సమ్మె తర్వాత అధికారులు వాటిని పూర్తిగా డిపోలకే పరిమితం చేశారు. ఆ తర్వాత కోవిడ్ లాక్‌డౌన్‌తో పూర్తిగా మూలన పడేశారు.
కాలం తీరకున్నా..
సాధారణంగా ఆర్టీసీ తన బస్సుల కాలం తీరిన తర్వాత కూడా వాడుతుంటుంది. చాలినన్ని బస్సుల్లేక డొక్కు బస్సులను వినియోగిస్తూనే ఉంది. కానీ ఇప్పుడు తుక్కుగా మారుస్తున్న వజ్ర బస్సుల కాలం తీరలేదు. తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో అధికారులు ఈ విషయం కూడా పేర్కొన్నారు. తక్కు కింద అమ్మకానికి సిద్ధమైన 65 బస్సులకు ఇంకా రూ.7,27,27,592 విలువైన ‘జీవితకాలం’ ఉందని పేర్కొన్నారు. అంటే.. తరుగు, ఇతర ఖర్చులు తీసేసినా అంత విలువ మేరకు ఇంకా వినియోగించాలన్న మాట. ఇప్పుడు వాటిని పక్కన పెడితే అంత నష్టం వాటిల్లినట్టే. ఆర్టీసీ కొత్తగా ప్రారంభించిన సరుకు రవాణా విభాగానికి వీటిని బదిలీ చేసి ఏసీ అవసరం ఉన్న సరుకులను తరలించేలా ప్రయత్నాలు చేసినా డిమాండ్ లేక పోవడంతో డిపోలకే పరిమితం అయ్యాయి. వినియోగం లేక క్రమంగా పాడవుతున్నాయన్న ఉద్దేశంతో చివరకు అమ్మేయాలని నిర్ణయించారు. తొలుత తుక్కు యార్డుకు తరలించాలని నిర్ణయించిన 65 బస్సులు 4 లక్షల కి.మీ వరకు తిరగ్గా.. మిగతా 35 బస్సులు అంత కూడా ప్రయాణించలేదు.
ఇలా వాడేందుకు అవకాశం ఉన్నా
♦ప్రస్తుతం ఆర్టీసీలో బస్సుల కొరత తీవ్రంగా ఉంది. కొత్త బస్సులు కొనకపోవడమే దీనికి కారణం. ఇక ఏసీ బస్సులకు మరింత కొరత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వజ్ర బస్సుల్ని ఎలా వినియోగిస్తే బాగుంటుందో అనే విషయంలో సరైన కసరత్తు జరగలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
♦రాష్ట్రంలో కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ లాంటి అతికొద్ది జిల్లా కేంద్రాలకే ఏసీ బస్సులున్నాయి. మిగతా జిల్లా కేంద్రాలకు ఏసీ బస్సులకు డిమాండ్ ఉన్నా కొనే ఆర్థిక స్తోమత ఆర్టీసీకి లేదు. ఈ నేపథ్యంలో నగరానికి చేరువగా ఉన్న పట్టణాలకు మినీ బస్సుల్ని రెగ్యులర్ సర్వీసులుగా తిప్పితే ఆదరణ ఉంటుందన్న అభిప్రాయాన్ని ఆర్టీసీ సిబ్బందే వ్యక్తం చేస్తున్నారు.
♦శ్రీశైలం లాంటి పుణ్య క్షేత్రాలకు, యాదాద్రి కొత్త దేవాలయంలో దర్శనాలు మొదలయ్యాక నగరం నుంచి రద్దీ బాగా ఉంటుంది. వీటిని షటిల్ సర్వీసులుగా వాడాలన్న సూచన ఉంది. దీన్ని ఆర్టీసీ పట్టించుకోవటం లేదు.
♦కేరళ ప్రభుత్వం కొన్ని మినీ ఏసీ బస్సులను మొబైల్ దుకాణాలుగా మార్చి అద్దెకు ఇచ్చింది. అక్కడి నగరాల్లో వీటికి డిమాండ్ బాగా ఉంది. అలా ప్రైవేటు వ్యక్తులకు అద్దెకిస్తే ఆర్టీసీకి ఆదాయం వస్తుందన్న సూచనను కూడా అధికారులు బుట్టదాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment