Vajra buses
-
ఐటీ కారిడార్లలో వజ్ర పరుగులు.. చార్జీలు ఎంతంటే?
సాక్షి, హైదరాబాద్: నగరంలో వజ్ర ఏసీ బస్సులు సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. గతంలో హైదరాబాద్ నుంచి వరంగల్, నిజామాబాద్ తదితర దూర ప్రాంతాలకు నడిచిన ఈ బస్సులను నగరంలో నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. క్యాబ్‌లకు ఎక్కువగా డిమాండ్ ఉండే హైటెక్ సిటీ, ఐటీ కారిడార్లలో వీటిని నడుపుతున్నారు. ఐటీ దిగ్గజ సంస్థల్లో పనిచేసే సాఫ్ట్వేర్ నిపుణులు, వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఆయా సంస్థల నుంచి సమీపంలోని మెట్రో స్టేషన్లకు, ప్రధాన ప్రాంతాలకు చేరుకొనేలా ఇవి అందుబాటులో ఉంటాయి. సుమారు 5 లక్షల మందికిపైగా ప్రయాణికులు.. ► సాధారణంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజు సుమారు 1,500 బస్సులు ఐటీ పారిశ్రామిక ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. సుమారు 5 లక్షల మందికిపైగా ప్రయాణికులు నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్లకు ప్రయాణం చేస్తారు. కోవిడ్ కారణంగా ఐటీ సంస్థలను మూసివేసి వర్క్‌ఫ్రమ్ హోమ్ ప్రకటించడంతో ఈ మార్గంలో ప్రజా రవాణా కూడా స్తంభించింది. (క్లిక్: జూన్‌లో కరోనా కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం) ► కొంతకాలంగా కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఐటీ సంస్థల కార్యకలాపాలను పునరుద్ధరించారు. రాకపోకలు పెరిగాయి. ఈ క్రమంలో క్యాబ్‌లు, ఆటోలు తదితర ప్రైవేట్ వాహనాల నుంచి ఎదురయ్యే పోటీని ఎదుర్కొనేందుకు ఆర్టీసీ ప్రస్తుతం వజ్ర మినీ ఏసీ బస్సులను ఈ మార్గంలో నడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. ప్రయాణికులకు అనుగుణంగా.. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మెట్రో, ఇతర మార్గాల్లో జేఎన్టీయూకు చేరుకొనే ప్రయాణికులు అక్కడి నుంచి వేవ్‌రాక్ వరకు వెళ్లేందుకు అనుగుణంగా వజ్ర బస్సులు ఉంటాయి. సైబర్టవర్స్, మైండ్‌స్పేస్, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, డీఎల్ఎఫ్, ఇన్ఫోసిస్, విప్రో, ఐసీఐసీఐ, అమెజాన్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని పలు ప్రాంతాలకు తక్కువ చార్జీలతో ప్రయాణం చేయవచ్చు. (క్లిక్: ఇకపై ఆ లైసెన్సుల జారీ కఠినతరం) బస్సుల వేళలు.. జేఎన్టీయూ నుంచి వేవ్ రాక్ వరకు.. ఉదయం 8, 8.30, 9.50, 10.20, సాయంత్రం 4.25, 4.55, 6.15, 6.45 గంటలకు బస్సులు బయలుదేరుతాయి. వేవ్‌రాక్ నుంచి జేఎన్టీయూ వరకు... ఉదయం 8.50, 9.20, సాయంత్రం 3.35, 4.05, 5.25, 5.55 గంటలకు బస్సులు బయలుదేరుతాయి. చార్జీలు జేఎన్టీయూ నుంచి మైండ్‌స్పేస్‌కు రూ.20, జేఎన్టీయూ నుంచి వేవ్‌రాక్‌కు రూ.40, మైండ్‌స్పేస్ నుంచి వేవ్‌రాక్‌కు రూ.20. వీకెండ్లో సమతామూర్తి వద్దకు సిటీబస్సులు ఓ నెటిజన్ విజ్ఞప్తికి స్పందించిన ఆర్టీసీ ఎండీ ముచ్చింతల్‌లోని కొలువైన సమతామూర్తి విగ్రహం వద్దకు వీకెండ్ సిటీ బస్సులు నడపాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధికారులను ఆదేశించారు. సమతామూర్తి విగ్రహం వద్దకు నేరుగా ఆర్టీసీ బస్సుల్లేవని, క్యాబ్‌లో వెళ్లేందుకు రూ.1000 వరకు ఖర్చవుతుందని ఓ నెటిజన్ ట్విట్టర్లో ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు సజ్జనార్ సానుకూలంగా స్పందించారు. ‘ఆర్టీసీ పట్ల మీ ఆసక్తికి ధన్యవాదాలు’ అంటూ అభినందించారు. -
తిప్పినా.. తిప్పలే!
సాక్షి, హైదరాబాద్: అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి.. అన్న చందాన ఉంది ఆర్టీసీ వజ్ర ఏసీ బస్సుల పరిస్థితి. పొట్టి బస్సులుగా పిలిచే ఈ వంద బస్సులు కొన్నప్పటి నుంచి ప్రయాణికుల ఆదరణ చూరగొనలేక ఆర్టీసీని తీవ్ర నష్టాల పాల్జేయడం తెలిసిందే. దీంతో విసుగొచ్చి వాటిని వదిలించుకునేందుకు గత ఏడాది వేలం వేసి విక్రయించాలని నిర్ణయించారు. అప్పటి ఎండీ సునీల్‌శర్మ ఆమోదంతో అధికారులు 60 బస్సులను వేలానికి ఉంచినట్టు అధికారులు చెబుతున్నారు. ఎలా నడపాలి? మరో 40 బస్సులు 2 లక్షల కిలోమీటర్ల లోపు మాత్రమే తిరిగాయి. ఇవి మంచి కండిషన్లో ఉండటంతో వాటిని వేలంలో అమ్మటం సరికాదని తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీసుకున్న నిర్ణయం అధికారుల్ని అయోమయానికి గురి చేస్తోంది. కొన్నప్పటి నుంచి సమస్యలు వేధిస్తుండటం, ఏ రకంగానూ అనుకూలంగా లేని ఈ బస్సుల్ని ఎలా తిప్పాలోనని భావిస్తున్నారు. ఎండీ సజ్జనార్ ఆదేశం మేరకు వాటిని తిరిగి నగరంలో వినియోగించాలని నిర్ణయించి కొన్ని డిపోలకు అప్పగించారు. ♦ఈ బస్సుల్లో 18 సీట్లే ఉంటాయి. ఇంత చిన్న బస్సులకు ఓ డ్రైవరు, కండక్టర్.. ఇలా రెండు షిఫ్టుల్లో నలుగురిని నియమిస్తే.. వాటితో వచ్చే ఆదాయం కనీసం ఇద్దరి జీతాలకు కూడా సరిపోదు. కేవలం టిమ్ యంత్రం ద్వారా డ్రైవరే టికెట్లు ఇచ్చే పద్ధతికే ఇవి సరిపోతాయి. కానీ సిటీలో కండక్టర్ లేకుండా డ్రైవర్ ఒక్కడితో బస్సు నడపటం సాధ్యం కాదు. దీంతో స్టేజీ క్యారియర్‌గా అది పనికి రాదని తేల్చేశారు. ♦నగరానికి చేరువగా ఉన్న పట్టణాలకు నడపాలని భావించారు. కానీ, ఇంజిన్ వరకు ఈ బస్సు కండిషన్లో ఉన్నా.. ఏసీ విషయంలో తయారీనే నాసికరంగా ఉంది. సాధారణంగా ఛాసిస్‌కే ఏసీ బిగించేలా ఉంటుంది. కానీ ఈ బస్సుల్లో ఛాసిస్‌తో సంబంధం లేకుండా అది తయారైన తర్వాత ఏసీని విడిగా ఫ్యాబ్రికేట్ చేశారు. దీంతో చిన్న తేడా వచ్చినా ఏసీ ఆగిపోతోంది. ఇవి ఏసీ బస్సులు అయినందున ఏసీ లేకుండా నడపటం కష్టం. కిటికీలు తెరుచుకునే అవకాశం ఉండనందున గాలి లేక ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరవుతారు. దూర ప్రాంతాలకు ఏసీ సమస్యతో తిప్పలేక అది కూడా కుదరదని తేల్చేశారు. ♦ఇక నగరంలోని సాఫ్ట్వేర్ కంపెనీలకు అద్దెకివ్వాలని నిర్ణయించి.. పలు కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. కానీ ఇప్పటికీ చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ పద్ధతినే అవలంబిస్తున్నాయి. అతి తక్కువ మంది సిబ్బంది మాత్రమే కార్యాలయాలకు వస్తున్నారు దీంతో కంపెనీలు ఆ ప్రతిపాదనకు సానుకూలంగా లేవు. వర్క్ ఫ్రం హోం పద్ధతిని తొలగించే వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ♦ఇక మిగిలిన అవకాశం.. పెళ్లిళ్లు లాంటి కార్యక్రమాలు, యాత్రలకు అద్దెకివ్వటం. దీంతో వాటి బుకింగ్ కోసం అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల పెళ్లి ఆర్డర్లు కొంత మెరుగ్గానే వస్తున్నాయి. ఇక యాత్రలకు వీలుగా తాత్కాలికంగా ఏసీ సమస్య లేకుండా చేసి అద్దెకిచ్చే యోచనలో ఉన్నారు. వెరసి అడ్డగోలు ధరకు వేలంలో అమ్మలేక.. ఉంచుకుని లాభాలు తెచ్చుకునేలా నడుపుకోలేక వజ్ర బస్సులతో ఆర్టీసీ అధికారులు తంటాలు పడుతున్నారు. -
‘వజ్ర’ తుక్కవుతోంది
సాక్షి, హైదరాబాద్: వజ్ర .. ప్రజలకు చేరువగా కాలనీల్లోకే వచ్చి ఎక్కించుకుని వెళ్లేందుకు వీలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రారంభించిన ఆర్టీసీ మినీ ఏసీ బస్సు. ఇలాంటివి సంస్థ వద్ద 100 ఉన్నాయి. కానీ ఇప్పటికే కన్పించకుండా డిపోలకు పరిమితమైన ఈ బస్సులు ఇకపై ప్రయాణి కులకు దూరం కానున్నాయి. ఉన్నవి ఉన్నట్టుగా అమ్మేయాలని ఆర్టీసీ నిర్ణయించడమే ఇందుకు కారణం. అమ్మకానికి వీలుగా కొన్నిటిని తుక్కుగా నిర్ధారిస్తూ ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు డిపోల అధీనంలో ఉన్న బస్సులను హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఉన్న తుక్కు యార్డుకు తరలించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. తొలిదశలో 65 బస్సుల్ని తుక్కు కింద ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయనున్నారు. ఆ తర్వాత మిగతా 35 బస్సుల్ని కూడా విక్రయించనున్నారు. ఐదేళ్ల క్రితం ప్రారంభమై ఇంకా కాలం తీరని బస్సుల్ని సరిగా నిర్వహించలేక.. టోకున అమ్మేసేందుకు ఆర్టీసీ నిర్ణయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలా మొదలై.. సిటీ బస్సు కాకుండా దూర ప్రాంతానికి వెళ్లే ఆర్టీసీ బస్సెక్కాలంటే బస్టాండుకో లేదా ఎక్కడో ఉండే ఆర్టీసీ పాయింట్ వద్దకో వెళ్లాలి. అంతేకానీ క్యాబ్ లాగా అది మన ఇంటి సమీపంలోకి రాదు. కానీ బస్సు కూడా కాలనీలకు చేరువగా వెళ్లేలా ఆర్టీసీలో ఓ ఏర్పాటు ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ‘వజ్ర’ పేరుతో 2016–17లో ఆర్టీసీ ఓ మినీ బస్సు కేటగిరీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు వంద ఏసీ బస్సులను రెండు దశల్లో కొనుగోలు చేసింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్, వరంగల్‌కు నడిచేలా రూట్లు సిద్ధం చేసింది. ప్రయాణికులు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుని.. ఆ బస్సు రూట్లో వారుండే కాలనీకి దగ్గరగా ఉండే పాయింట్‌కు వెళ్లి ఎక్కేలా ఏర్పాటు చేశారు. నగదు లావాదేవీ లేకుండా ఆన్లైన్లోనే డబ్బు చెల్లించాలి. బస్సు ఏ పాయింట్‌కు, ఎన్ని గంటలకు వస్తుందో ముందుగానే ప్రయాణికుడి మొబైల్‌కు సమాచారం వెళ్లేలా ఏర్పాటు చేశారు. కానీ అంతా ఆన్‌లైన్‌తో కూడిన ఈ విధానానికి ప్రయాణికులు చేరువ కాకపోవటంతో అది కాస్తా ఫెయిల్ అయ్యింది. ప్రయాణికులకు ఎందుకు చేరువ కాలేదో, ఏ విధమైన మార్పులు చేయాలో గుర్తించని ఆర్టీసీ, కొంతకాలం అదే పద్ధతిలో బస్సులు నడిపి చివరకు ఆ పద్ధతి విరమించుకుంది. మిగతా బస్సుల మాదిరి బస్టాండ్లకే పంపేలా ఏర్పాటు చేసింది. కానీ గరుడ ప్లస్ టికెట్ ధరలను వీటికి అన్వయించటం, చిన్న బస్సు ఎక్కువ వేగంగా వెళితే వైబ్రేషన్‌కు గురవటం, ఏసీ సరిగా పనిచేయకపోవటం వంటి కారణాలతో ఇక్కడా ఆదరణ అంతంత మాత్రంగానే ఉంటూ వచ్చింది. ఈసారైనా లోపాలను సరిదిద్దడంపై సంస్థ దృష్టి పెడితే బాగుండేది. కానీ సర్వే కూడా సరిగా చేయకుండా వాటిని కొంతకాలం అలాగే తిప్పటం, జనం ఎక్కకుంటే డిపోలకే పరిమితం చేయటం ద్వారా ప్రయాణికులకు వాటిపై నమ్మకం లేకుండా చేసింది. గతేడాది ఆర్టీసీలో సమ్మె తర్వాత అధికారులు వాటిని పూర్తిగా డిపోలకే పరిమితం చేశారు. ఆ తర్వాత కోవిడ్ లాక్‌డౌన్‌తో పూర్తిగా మూలన పడేశారు. కాలం తీరకున్నా.. సాధారణంగా ఆర్టీసీ తన బస్సుల కాలం తీరిన తర్వాత కూడా వాడుతుంటుంది. చాలినన్ని బస్సుల్లేక చాలాకాలంగా డొక్కు బస్సులను వినియోగిస్తూనే ఉంది. కానీ ఇప్పుడు తుక్కుగా మారుస్తున్న వజ్ర బస్సుల కాలం తీరలేదు. తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో అధికారులు ఈ విషయం కూడా పేర్కొన్నారు. తక్కు కింద అమ్మకానికి సిద్ధమైన 65 బస్సులకు ఇంకా రూ.7,27,27,592 విలువైన ‘జీవితకాలం’ ఉందని పేర్కొన్నారు. అంటే.. తరుగు, ఇతర ఖర్చులు తీసేసినా అంత విలువ మేరకు ఇంకా వినియోగించాలన్న మాట. ఇప్పుడు వాటిని పక్కన పెడితే అంత నష్టం వాటిల్లినట్టే. ఆర్టీసీ కొత్తగా ప్రారంభించిన సరుకు రవాణా విభాగానికి వీటిని బదిలీ చేసి ఏసీ అవసరం ఉన్న సరుకులను వీటిల్లో తరలించేలా ప్రయత్నాలు చేసినా డిమాండ్ లేక పోవడంతో డిపోలకే పరిమితం అయ్యాయి. వినియోగం లేక క్రమంగా పాడవుతున్నాయన్న ఉద్దేశంతో చివరకు అమ్మేయాలని నిర్ణయించారు. తొలుత తుక్కు యార్డుకు తరలించాలని నిర్ణయించిన 65 బస్సులు 4 లక్షల కి.మీ వరకు తిరగ్గా.. మిగతా 35 బస్సులు అంత కూడా ప్రయాణించలేదు. ఇలా వాడేందుకు అవకాశం ఉన్నా.. ప్రస్తుతం ఆర్టీసీలో బస్సుల కొరత తీవ్రంగా ఉంది. కొత్త బస్సులు కొనకపోవడమే దీనికి కారణం. ఇక ఏసీ బస్సులకు మరింత కొరత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వజ్ర బస్సుల్ని ఎలా వినియోగిస్తే బాగుంటుందో అనే విషయంలో సరైన కసరత్తు జరగలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.రాష్ట్రంలో కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ లాంటి అతికొద్ది జిల్లా కేంద్రాలకే ఏసీ బస్సులున్నాయి. మిగతా జిల్లా కేంద్రాలకు ఏసీ బస్సులకు డిమాండ్ ఉన్నా కొనే ఆర్థిక స్తోమత ఆర్టీసీకి లేదు. ఈ నేపథ్యంలో నగరానికి చేరువగా ఉన్న పట్టణాలకు మినీ బస్సుల్ని రెగ్యులర్ సర్వీసులుగా తిప్పితే ఆదరణ ఉంటుందన్న అభిప్రాయాన్ని ఆర్టీసీ సిబ్బందే వ్యక్తం చేస్తున్నారు. అలాగే నిరంతరం రద్దీగా ఉండే శ్రీశైలం లాంటి పుణ్య క్షేత్రాలకు వీటిని వాడాలన్న సూచన కూడా పెండింగులో ఉంది. యాదాద్రి కొత్త దేవాలయంలో దర్శనాలు మొదలయ్యాక నగరం నుంచి రద్దీ బాగా ఉంటుంది. అప్పుడు వీటిని షటిల్ సర్వీసులుగా వాడాలన్న సూచన ఉంది. దీన్ని ఆర్టీసీ పట్టించుకోవటం లేదు. కేరళ ప్రభుత్వం కొన్ని మినీ ఏసీ బస్సులను మొబైల్ దుకాణాలుగా మార్చి అద్దెకు ఇచ్చింది. అక్కడి నగరాల్లో వీటికి డిమాండ్ బాగా ఉంది. అలా ప్రైవేటు వ్యక్తులకు అద్దెకిస్తే ఆర్టీసీకి ఆదాయం వస్తుందన్న సూచనను కూడా అధికారులు బుట్టదాఖలు చేశారు. టికెట్ బుక్ చేసుకుని.. ఆ బస్సు రూట్లో వారుండే కాలనీకి దగ్గరగా ఉండే పాయింట్‌కు వెళ్లి ఎక్కేలా ఏర్పాటు చేశారు. నగదు లావాదేవీ లేకుండా ఆన్లైన్లోనే డబ్బు చెల్లించాలి. బస్సు ఏ పాయింట్‌కు, ఎన్ని గంటలకు వస్తుందో ముందుగానే ప్రయాణికుడి మొబైల్‌కు సమాచారం వెళ్లేలా ఏర్పాటు చేశారు. కానీ అంతా ఆన్‌లైన్‌తో కూడిన ఈ విధానానికి ప్రయాణికులు చేరువ కాకపోవటంతో అది కాస్తా ఫెయిల్ అయ్యింది. ప్రయాణికులకు ఎందుకు చేరువ కాలేదో, ఏ విధమైన మార్పులు చేయాలో గుర్తించని ఆర్టీసీ, కొంతకాలం అదే పద్ధతిలో బస్సులు నడిపి చివరకు ఆ పద్ధతి విరమించుకుంది. మిగతా బస్సుల మాదిరి బస్టాండ్లకే పంపేలా ఏర్పాటు చేసింది. కానీ గరుడ ప్లస్ టికెట్ ధరలను వీటికి అన్వయించటం, చిన్న బస్సు ఎక్కువ వేగంగా వెళితే వైబ్రేషన్‌కు గురవటం, ఏసీ సరిగా పనిచేయకపోవటం వంటి కారణాలతో ఇక్కడా ఆదరణ అంతంత మాత్రంగానే ఉంటూ వచ్చింది. ఈసారైనా లోపాలను సరిదిద్దడంపై సంస్థ దృష్టి పెడితే బాగుండేది. కానీ సర్వే కూడా సరిగా చేయకుండా వాటిని కొంతకాలం అలాగే తిప్పటం, జనం ఎక్కకుంటే డిపోలకే పరిమితం చేయటం ద్వారా ప్రయాణికులకు వాటిపై నమ్మకం లేకుండా చేసింది. గతేడాది ఆర్టీసీలో సమ్మె తర్వాత అధికారులు వాటిని పూర్తిగా డిపోలకే పరిమితం చేశారు. ఆ తర్వాత కోవిడ్ లాక్‌డౌన్‌తో పూర్తిగా మూలన పడేశారు. కాలం తీరకున్నా.. సాధారణంగా ఆర్టీసీ తన బస్సుల కాలం తీరిన తర్వాత కూడా వాడుతుంటుంది. చాలినన్ని బస్సుల్లేక డొక్కు బస్సులను వినియోగిస్తూనే ఉంది. కానీ ఇప్పుడు తుక్కుగా మారుస్తున్న వజ్ర బస్సుల కాలం తీరలేదు. తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో అధికారులు ఈ విషయం కూడా పేర్కొన్నారు. తక్కు కింద అమ్మకానికి సిద్ధమైన 65 బస్సులకు ఇంకా రూ.7,27,27,592 విలువైన ‘జీవితకాలం’ ఉందని పేర్కొన్నారు. అంటే.. తరుగు, ఇతర ఖర్చులు తీసేసినా అంత విలువ మేరకు ఇంకా వినియోగించాలన్న మాట. ఇప్పుడు వాటిని పక్కన పెడితే అంత నష్టం వాటిల్లినట్టే. ఆర్టీసీ కొత్తగా ప్రారంభించిన సరుకు రవాణా విభాగానికి వీటిని బదిలీ చేసి ఏసీ అవసరం ఉన్న సరుకులను తరలించేలా ప్రయత్నాలు చేసినా డిమాండ్ లేక పోవడంతో డిపోలకే పరిమితం అయ్యాయి. వినియోగం లేక క్రమంగా పాడవుతున్నాయన్న ఉద్దేశంతో చివరకు అమ్మేయాలని నిర్ణయించారు. తొలుత తుక్కు యార్డుకు తరలించాలని నిర్ణయించిన 65 బస్సులు 4 లక్షల కి.మీ వరకు తిరగ్గా.. మిగతా 35 బస్సులు అంత కూడా ప్రయాణించలేదు. ఇలా వాడేందుకు అవకాశం ఉన్నా ♦ప్రస్తుతం ఆర్టీసీలో బస్సుల కొరత తీవ్రంగా ఉంది. కొత్త బస్సులు కొనకపోవడమే దీనికి కారణం. ఇక ఏసీ బస్సులకు మరింత కొరత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వజ్ర బస్సుల్ని ఎలా వినియోగిస్తే బాగుంటుందో అనే విషయంలో సరైన కసరత్తు జరగలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ♦రాష్ట్రంలో కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ లాంటి అతికొద్ది జిల్లా కేంద్రాలకే ఏసీ బస్సులున్నాయి. మిగతా జిల్లా కేంద్రాలకు ఏసీ బస్సులకు డిమాండ్ ఉన్నా కొనే ఆర్థిక స్తోమత ఆర్టీసీకి లేదు. ఈ నేపథ్యంలో నగరానికి చేరువగా ఉన్న పట్టణాలకు మినీ బస్సుల్ని రెగ్యులర్ సర్వీసులుగా తిప్పితే ఆదరణ ఉంటుందన్న అభిప్రాయాన్ని ఆర్టీసీ సిబ్బందే వ్యక్తం చేస్తున్నారు. ♦శ్రీశైలం లాంటి పుణ్య క్షేత్రాలకు, యాదాద్రి కొత్త దేవాలయంలో దర్శనాలు మొదలయ్యాక నగరం నుంచి రద్దీ బాగా ఉంటుంది. వీటిని షటిల్ సర్వీసులుగా వాడాలన్న సూచన ఉంది. దీన్ని ఆర్టీసీ పట్టించుకోవటం లేదు. ♦కేరళ ప్రభుత్వం కొన్ని మినీ ఏసీ బస్సులను మొబైల్ దుకాణాలుగా మార్చి అద్దెకు ఇచ్చింది. అక్కడి నగరాల్లో వీటికి డిమాండ్ బాగా ఉంది. అలా ప్రైవేటు వ్యక్తులకు అద్దెకిస్తే ఆర్టీసీకి ఆదాయం వస్తుందన్న సూచనను కూడా అధికారులు బుట్టదాఖలు చేశారు. -
కోవిడ్ వ్యాక్సిన్ రవాణాకు వజ్ర?
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వ్యాక్సిన్ తరలింపునకు ఆర్టీసీ మినీబస్సులు ‘వజ్ర’ను వినియోగించేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం వ్యాక్సిన్ ప్రయోగాలు మూడోదశలో ఉన్నందున, మరో రెండుమూడు నెలల్లో అది అందుబాటులోకి వస్తుందన్న మాట వినిపిస్తోంది. ప్రజలందరికీ టీకాలు ఇవ్వాల్సి ఉన్నందున పెద్దమొత్తంలో వ్యాక్సిన్ రాష్ట్రం నలుమూలలకు తరలించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కూడా వేగంగా జరగాలి. ఇందుకోసం ఆర్టీసీ వజ్ర బస్సులు ఏమేరకు ఉపయోగపడతాయన్న విషయాన్ని ఆర్టీసీ పరిశీలిస్తోంది. నిపుణులకు బస్సులను చూపి నివేదిక తీసుకోనుంది. విమానాశ్రయంతో అనుసంధానం రెండురోజుల క్రితం ఆర్టీసీ జీఎంఆర్ ఎయిర్‌కార్గోతో ఒప్పందం చేసుకుంది. విమానాల ద్వారా వచ్చే సరుకును సంబంధిత గమ్యానికి చేర్చేందుకు ఆర్టీసీ ఆధ్వర్యంలోని కార్గో బస్సులను వినియోగించటం దీని ఉద్దేశం. ఎయిర్‌కార్గోలో మందులు, వ్యాక్సిన్ తరలింపునకు ఏసీ బస్సుల అవసరం ఉంది. వజ్ర బస్సులన్నీ ఎయిర్ కండీషన్ సదుపాయంతో ఉన్నవే. దీంతో వాటిని వాడాలని భావిస్తున్నారు. ప్రస్తుతానికి మందుల సరఫరా సాధారణంగానే ఉన్నా, కోవిడ్ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత భారీగా వాహనాల అవసరం ఉంటుంది. అంత డిమాండును తట్టుకునేలా బస్సులు సిద్ధం చేయగల సామర్థ్యం ఉందా అని ఎయిర్‌కార్గో ప్రశ్నించింది. సాధారణ మందులకు 15– 25 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే సరిపోతుంది. కానీ వ్యాక్సిన్‌కు 4 డిగ్రీలలోపే ఉండాలి. దీంతో నిపుణుల ఆధ్వర్యంలో వజ్ర బస్సుల ఫిట్నెస్, ఏసీ పనితీరును పరిశీలింపచేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. వ్యాక్సిన్ విషయంలో ఈ బస్సుల ఏసీ సామర్ధ్యం సరిపోదని తేలితే.. ఇతర మందులు, పండ్ల సరఫరాకు వాడతారు. ప్రయాణికుల సేవల నుంచి ఔట్ హైదరాబాద్‌లోని కాలనీల నుంచి వరంగల్, నిజామాబాద్, రామగుండం లాంటి పట్టణాలకు మినీ ఏసీ బస్సులను నడిపితే బాగుంటుందనే సీఎం కేసీఆర్ సూచన మేరకు ఆర్టీసీ దశలవారీగా వంద వజ్ర బస్సులను సమకూర్చుకుంది. కానీ జనాదరణ లేకపోవడంతో ఈ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. (చదవండి: మౌత్‌వాష్‌తో కరోనా కంట్రోల్) -
మొబైల్ కరోనా పరీక్షాకేంద్రాలుగా వజ్ర బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీకి గుదిబండగా మారి, నష్టాలు మూటగట్టిన వజ్ర మినీ బస్సులు కోవిడ్ పరీక్షల విషయంలో బాగా ఉపయోగపడుతున్నాయి. ప్రయోగాత్మకంగా ఇటీవల 3 వజ్ర ఏసీ బస్సులను కోవిడ్ సం చార పరీక్షాకేంద్రాలుగా మార్చారు. వాటిని రవాణామంత్రి పువ్వాడ అజయ్ సొంత జిల్లా ఖమ్మంలో వినియోగిస్తున్నారు. నిత్యం ఈ బస్సుల ద్వారా దాదాపు 750 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇవి సత్ఫలితాలనివ్వడంతో మిగతా బస్సులను కూడా సం చార ల్యాబ్‌లుగా మార్చాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఇప్పట్లో కోవిడ్ సమస్య సమసిపోయేలా లేకపోవటంతో మిగతాజిల్లాలకు కూడా వీటిని ల్యాబ్‌లుగా మార్చి వినియోగించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక్కో బస్సు మార్పిడికి రూ.1.15లక్షలు ఆర్టీసీలో వంద వరకు వజ్ర బస్సులున్నాయి. వీటిల్లో యాక్సిడెంట్లు అయినవి, మరమ్మతులకు నోచుకోనివి పోను 66 బస్సులు కండీషన్లో ఉన్నాయి. కోవిడ్ సమస్య ఉత్పన్నం కాకముందు వరకు ఆ బస్సులు నడిచాయి. అయితే వాటికి ప్రయాణికుల ఆదరణ తక్కువగా ఉండటం, నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉండి భారీ నష్టాలు తెచ్చిపెట్టాయి. దీంతో గతేడాది సమ్మె తర్వాత ఈ బస్సులను వేలం వేసి అమ్మేయాలని నిర్ణయించారు. విద్యాసంస్థలు వీటిని కొనే అవకాశం ఉండటంతో ధర కూడా మెరుగ్గానే పలుకుతుందని ఆర్టీసీ భావించింది. అయితే కోవిడ్ సమస్య కారణంగా ఈ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఇవి ఏసీ బస్సులు కావటంతో కోవిడ్ పరీక్షకు అనువుగా ఉంటాయని భావించి ప్రయోగాత్మకంగా మూడు బస్సులను ఆర్టీసీ వర్క్‌షాపులోనే కోవిడ్ సంచార ప్రయోగశాలలుగా మార్చారు. వాటిని ఖమ్మంకు కేటాయించటం తో అక్కడ సత్ఫలితాలనిస్తున్నాయి. ఒక్కో బస్సుల్లో ముగ్గురు టెక్నీషియన్లు ఉండేలా ఏర్పాటు చేశారు. బస్సు వెలుపల కరోనా అనుమానితులు నిలబడితే, కిటికీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రంధ్రాల ద్వారా టెక్నీషియన్లు నమూనాలు సేకరించేలా ఏర్పాటు చేశారు. ఇది సురక్షితంగా ఉండటంతో టెక్నీషియన్లు కూడా ఎలాంటి ఆందోళన లేకుండా నమూనాలు సేకరిస్తున్నారు. మినీ బస్సులు కావటంతో ఇరుకు ప్రాంతాలకు కూడా సులభంగా చేరుకోగలుగుతున్నాయి. కోవిడ్ సమస్య మరికొన్ని నెలలపాటు కొనసాగే అవకాశం ఉన్నందున మిగతా 63 బస్సులను కూడా సంచార ప్రయోగశాలలుగా మార్చి ఇతర జిల్లాలకు కేటాయించాలనే సూచనలు ప్రభుత్వానికి అందుతున్నాయి. త్వరలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. కోవిడ్ సమస్య సమసిన తర్వాత వేలం రూపంలో బస్సులను అమ్మేయబోతున్నారు. -
‘వజ్రాలను’ అమ్మేద్దాం!
సాక్షి, హైదరాబాద్: ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వజ్ర బస్సులు చేదు అనుభవాన్నే మిగిల్చడంతో వాటిని వదిలించుకునేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. గతంలో ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో ఈ అంశం ప్రస్తావనకు రావటంతో, వాటిని సరుకు రవాణా వాహనాలుగా మార్చాలని ఆయన ఆదేశించారు. కానీ అవి అందుకు యోగ్యం కాదని తేలడంతో వాటిని అమ్మకానికి పెట్టాలని అధికారులు ప్రతిపాదించారు. ఏసీ వసతితో ఉన్నందున సాఫ్ట్వేర్ కంపెనీలు, విద్యాసంస్థలు, ఇతర ప్రైవేట్ సంస్థలు వీటిని కొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒక్కో బస్సుకు దాదాపు రూ.10 లక్షల వరకు గిట్టుబాటు అయ్యే అవకాశం ఉందని సమాచారం. 60 బస్సులు సిద్ధం.. ప్రస్తుతం ఆర్టీసీ వద్ద వంద వజ్ర బస్సులున్నాయి. 2017లో 40 బస్సులతో వీటిని ప్రారంభించారు. ప్రయాణికుల వద్దకే బస్సులు వచ్చేలా సీఎం కేసీఆర్ ఈ విధానానికి రూపకల్పన చేశారు. కానీ ఆ విధానం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఫలితంగా రూ.12 కోట్ల మేర నష్టాలు వాటిల్లినట్టు అధికారులు తేల్చారు. అప్పట్లో ఒక్కోటి రూ.25 లక్షలు వెచ్చించి ఈ బస్సులను కొనుగోలు చేశారు. వీటిని కార్గోకు వినియోగించాలని తొలుత సీఎం ఆదేశించారు. కానీ ఏసీతో ఉన్న ఈ బస్సులను సరుకు రవాణాకు వాడితే నష్టమ ని అధికారులు తేల్చారు. పైగా అవి మినీ బస్సులు కావడంతో చిన్న చక్రాలతో ఉం టాయి. అందువల్ల సరుకు రవాణాకు అనుకూలం కాదని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో వాటిని అమ్మితేనే లాభం ఉంటుందని అంచనాకు వచ్చారు. ఉన్నవాటిలో 60 బస్సులు పూర్తి ఫిట్నెస్తో ఉన్నాయని గుర్తించారు. ఇప్పుడు వీటిని అమ్మకానికి పెట్టబోతున్నారు. త్వరలో దీనికి సంబంధించిన విక్రయ నోటిఫికేషన్ వెలువడనుంది. -
‘వజ్ర’కు సెలవు!
సాక్షి, హైదరాబాద్: బస్టాండ్ల వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కాలనీల్లోనే బస్సు ఎక్కే వసతి కల్పిస్తూ ప్రవేశపెట్టిన వజ్ర ఏసీ బస్సుకు ఆర్టీసీ టాటా చెప్పేసింది. వజ్ర సర్వీసును ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఏసీ వసతితో ఉండే ఈ మినీ బస్సులను ఇక సరుకు రవాణా బస్సులుగా మార్చాలని నిర్ణయించింది. మరికొద్ది రోజుల్లో వాటి సేవలను నిలిపివేయనుంది. ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు సదుద్దేశంతో ప్రారంభించిన ఆ సర్వీసులు కొన్ని లోపాల వల్ల ప్రయాణికుల ఆదరణకు నోచుకోలేదు. ఖాళీగా పరుగుపెడుతూ చివరకు రూ.12 కోట్ల మేర నష్టాలు మోసుకురావటంతో వాటిని వదిలించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతితో వజ్ర సర్వీసులను ఆర్టీసీ ఉపసంహరించుకుంటోంది. సరుకు రవాణాకు.. ఆర్టీసీని నిర్వహించటం సాధ్యం కాదని దాదాపు తేల్చేసి ఆ తర్వాత మనసు మార్చుకుని సంస్థను కొనసాగించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఇప్పుడు దానిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు సరుకు రవాణా సేవలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రైవేటు సంస్థతో కలసి పార్శిల్ సర్వీసును ఆర్టీసీ కొనసాగిస్తోంది. దాన్ని పూర్తిస్థాయి సరుకు రవాణాగా మార్చాలని సీఎం ఆదేశించారు. ఇందుకోసం తొలుత 1,200 బస్సులను సరుకు రవాణాకు కేటాయించాలని తాజాగా ఆర్టీసీ నిర్ణయించింది. నగరంలో నష్టాలు మోసుకొస్తున్నాయన్న ఉద్దేశంతో వేయి సిటీ బస్సులను ఉపసంహరించుకోవాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ వేయి బస్సులను సరుకు రవాణా విభాగానికి మార్చాలని దాదాపు నిర్ణయించింది. వాటికి మరో 200 బస్సులను చేర్చనుంది. అందులో భాగంగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న 58 వజ్ర ఏసీ బస్సులను కూడా వాటికే కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. వాటిల్లోని సీట్లను తొలగించి సరుకు రవాణాకు వీలుగా మార్చనున్నారు. ప్రభుత్వ గోదాములకు అనుబంధంగా.. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసేందుకు పెద్ద సంఖ్యలో గోదాములను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. వీటిల్లోకి సరుకు తరలించేందుకు వందల సంఖ్యలో లారీలను వినియోగిస్తున్నారు. ఇవన్నీ ప్రైవేటు వాహనాలే. ఇప్పుడు ఈ సరుకు రవాణాలో ఆర్టీసీ బస్సు సేవలను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత విభాగాలకు ఈమేరకు ఆదేశాలు అందనున్నాయి. ప్రైవేటు వాహనాలు బుక్ చేసుకుంటున్నట్టుగానే ఆర్టీసీ సరుకు రవాణా బస్సులను కూడా బుక్ చేసుకోబోతున్నారు. ఈ రూపంలో ఆర్టీసీకి భారీగానే ఆదాయం వస్తుందని అంచనా. దీంతోపాటు ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు కూడా నేరుగా సంబంధిత డిపోలకు వెళ్లి సరుకు రవాణా బస్సులను బుక్ చేసుకోవచ్చు. త్వరలోనే దీనికి సంబంధించిన ధరలను నిర్ణయించనున్నారు. వజ్ర స్వరూపం ఇది.. నగరం నుంచి ప్రధాన పట్టణాలకు కాలనీల మీదుగా నడిపేందుకు వజ్ర పేరుతో ఏసీ మినీ బస్సు సేవలను ఆర్టీసీ 2017 మే నెలలో ప్రారంభించింది. తొలుత 40, ఆ తర్వాత మరో 20 బస్సులు కొన్నారు. ముందుగా మెహిదీపట్నం, కుషాయిగూడ, మియాపూర్ డిపోలకు వీటిని కేటాయించారు. నగరం నుంచి వరంగల్, నిజామాబాద్‌కు ప్రారంభించారు. ఆ తర్వాత కరీంనగర్, గోదావరిఖనిలకు విస్తరించారు. కండక్టర్, టిమ్ యంత్రం లేకుండా నేరుగా ఆర్టీసీ యాప్ ద్వారా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునే విధానం ప్రవేశపెట్టారు. కానీ దీన్ని జనం ఆదరించలేదు. బస్సుల నాణ్యత కూడా సరిగా లేదని, ప్రయాణం ఇబ్బందిగా ఉందని ఫిర్యాదులొచ్చాయి. బస్టాండ్లకు వెళ్లకపోవటం పెద్ద మైనస్‌గా మారింది. ఇక గరుడ బస్ కంటే దీని టికెట్ ధర ఎక్కువగా ఉండటం మరో ప్రధాన ఫిర్యాదు. సిటీ డిపోల నుంచి తొలగించి వరంగల్, నిజామాబాద్ డిపోలకు కేటాయించినా తీరు మారలేదు. శ్రీశైలం, యాదగిరిగుట్ట, కర్నూలు లాంటి ప్రాంతాలకు నడిపినా.. చివరకు డిపోలకు వెళ్లేలా చేసినా.. యాప్‌తో సంబంధం లేకుండా నేరుగా డ్రైవరే టికెట్ ఇచ్చినా జనం వాటిని పట్టించుకోలేదు. వాటి రూపంలో రూ.12 కోట్ల మేర నష్టాలు రావడంతో వాటికి సెలవు చెప్పాల్సిన సమయం వచ్చింది. -
తరలిపోయిన వజ్ర బస్సులు
సాక్షి, నిజామాబాద్ : ఆర్టీసీ ‘వజ్ర’ం మెరవలేదు.. ఏసీ బస్సులు ప్రయాణికుల ఆదరణ పొందలేదు. రోడ్డు రవాణా సంస్థ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్యాసెంజర్లు ఎక్కక పోవడంతో ఆదాయం కరువైంది. ఫలితంగా వీటి నిర్వహణ డిపోలకు గుదిబండగా మారింది. ఈ బస్సులు నడపడం వల్ల నష్టాలే మిగులుతుండడంతో ఆర్టీసీ పునరాలోచనలో పడింది. ప్రయాణికుల ఆదరణ లేని ప్రాంతాల నుంచి ఈ ఏసీ బస్సులను ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ డిపోకు కేటాయించిన 11 బస్సుల్లో ఇప్పటికే తొమ్మిది బస్సులు తరలి పోయాయి. గంటకో బస్సు.. ఆర్టీసీ 60 వజ్ర బస్సులను కొనుగోలు చేసి, వీటిని ముఖ్యమైన డిపోలకు కేటాయించింది. నిజామాబాద్ డిపో–1కు 9, డిపో–2కు రెండు బస్సులు కేటాయించారు. ప్రయాణికులు నగరంలోని బస్టాండ్‌కు రాకుండా నిర్దేశిత బస్టాప్‌ల నుంచి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లేలా వీటిని ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని ముబారక్‌నగర్, అర్సపల్లి, వర్ని చౌరస్తా నుంచి హైదరాబాద్‌లోని మెహిదీపట్నం, కూకట్పల్లి ప్రాంతాలకు గంటకో బస్సు నడిపించాలని నిర్ణయించారు. 2017 మే నుంచి ఈ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఫుల్ ఏసీతో పాటు నాన్‌స్టాప్ బస్సులు కావడం, అతి వేగంగా వెళ్లే సౌకర్యం ఉండడంతో ప్రయాణికుల ఆదరణ బాగుంటుందని ఆర్టీసీ అంచనా వేసింది. ఆదాయం రాకనే.. వజ్ర బస్సులు ప్రయాణికులతో నిండుగా వెళ్తాయని భావించిన రోడ్డు రవాణ సంస్థ అంచనాలు తారుమారయ్యాయి. ఈ బస్సులకు ప్రయాణికుల ఆదరణ కరువైంది. ఒక్కోసారి ఒకరిద్దరు ప్రయాణికులతోనే హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. దీంతో లాభం సంగతి దేవుడెరుగు.. కనీసం డీజిల్ ఖర్చులు కూడా రాలేదు. ప్రతి ట్రిప్పుకూ నష్టాలే మిగిలాయి. ఇలా మొత్తంగా రూ.80 లక్షలకు పైగా ఆర్టీసీ నష్టపోయింది. ఈ నేపథ్యంలో వజ్ర బస్సుల విషయంలో అధికారులు పునరాలోచనలో పడ్డారు. వేరే డిపోలకు తరలింపు.. నిజామాబాద్ మినహా మిగతా రూట్లలో వజ్ర బస్సులకు మంచి ఆదరణ లభిస్తోంది. నిర్వహణ నష్టాలు లేకపోవడంతో ఆ రూట్లలో మరిన్ని బస్సులు ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ఆర్నెళ్ల క్రితం నిజామాబాద్ డిపో–1 నుంచి మూడు వజ్ర బస్సులు తరలించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే మరో మూడు బస్సులను హైదరాబాద్‌కు, మరో మూడింటిని కామారెడ్డి డిపోకు తరలించుకు పోయారు. మొత్తంగా 11 బస్సులకు గాను ప్రస్తుతం రెండు బస్సులు మాత్రమే నిజామాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. ఇవి కూడా నష్టాల్లో కొనసాగుతుండడంతో వీటిని కూడా తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రయాణికుల ఆదరణ లేకే.. నిజామాబాద్ డిపో–1 పరిధిలో మొత్తం 11 వజ్ర బస్సులు ఉండేవి. మా డిపో పరిధిలో ఇంద్ర, గరుడ కలిపి మొత్తం 40 ఏసీ బస్సులు బస్టాండ్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్నాయి. అందుకే ఈ వజ్ర బస్సులను ప్రయాణికులను ఆదరించలేదు. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, హైద్రాబాద్ డిపోల పరిధిలో ఈ బస్సులు సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్నాయి. ఇక్కడ నష్టాలను చూసి ఉన్నతాధికారులు వజ్ర బస్సులను ఇతర డిపోలకు తరలించారు. – ఆనంద్, డిపో–1 మేనేజర్ -
బస్టాండ్లలోకి ‘వజ్ర’ బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ మొండిపట్టు వీడింది. వజ్ర మినీ బస్సులను బస్టాండ్లలోకి అనుమతించాలని నిర్ణయించింది. ఇంతకాలం ముఖ్యమంత్రి ఆదేశం పేరుతో వాటిని బస్టాండ్లకు అనుమతించకుండా కాలనీల మీదుగా నేరుగా గమ్యస్థానం వెళ్లేలా ప్రణాళిక అమలు చేశారు. కానీ, ప్రయాణికులు లేక ఖాళీగా అవి ఉరుకులు పరుగులు పెడుతూ భారీ నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. దీంతో వాటిని కూడా సాధారణ బస్సుల్లాగా బస్టాండ్ల మీదుగా తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా తొలుత హైదరాబాద్–నిజామాబాద్ మధ్య తిరుగుతున్న వజ్ర బస్సుల్లో, మెహిదీపట్నం, హైదరాబాద్–2 డిపో పరిధిలో ఉన్న బస్సులను సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్, అటు నిజామాబాద్ బస్టాండ్లలోకి పంపుతున్నారు. ఈ ప్రయోగం మొదలుపెట్టిన నాలుగు రోజుల్లోనే వాటి ఆక్యుపెన్సీరేషియో పెరిగింది. వాస్తవాన్ని గుర్తించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇప్పుడు మిగతా బస్సులను కూడా బస్టాండ్లలోకి అనుమతించాలని భావిస్తున్నారు. సీఎం వద్దన్నారని... సాధారణ ఆర్టీసీ బస్సుల కోసం ప్రయాణికులు బస్టాండ్లకు వెళ్లి ఎక్కటం పరిపాటి. ఆ శ్రమ లేకుండా బస్సులే కాలనీలకు వస్తే సమీపంలోనే వాటిల్లో ఎక్కేందుకు అవకాశం ఉంటుందని భావించిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆ మేరకు ప్రణాళిక రూపొందించాల్సిందిగా అధికారులను గత సంవత్సరం ఆదేశించారు. దీంతో వజ్ర ఏసీ మినీ బస్సులను ఆర్టీసీ ఐదు నెలల క్రితం ప్రారంభించింది. ఇందులో కండక్టర్ ఉండరు, డ్రైవర్ టిమ్ యంత్రం ద్వారా టికెట్ ఇచ్చే అవకాశం ఉండదు. ప్రయాణికులు నేరుగా యాప్ ద్వారా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుని నిర్ధారిత ప్రాంతంలో ఎక్కాల్సి ఉంటుంది. నగదురహిత లావాదేవీని ప్రోత్సహించినట్టుగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆర్టీసీ దీనికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్– వరంగల్, హైదరాబాద్– నిజామాబాద్ మధ్య వీటిని ప్రారంభించింది. కానీ యాప్‌పై అవగాహన తక్కువ మందికి ఉండటంతో తొలిరోజు నుంచి ఇవి ఖాళీగా పరుగుపెట్టడం మొదలైంది. నెల తర్వాత రెండు చోట్ల ప్రైవేటు ఏజెన్సీలు టికెట్ ఇచ్చేలా నిబంధన మార్చారు. తర్వాత డ్రైవరే టికెట్ ఇచ్చే వెసులుబాటు తెచ్చారు. మరో నెల తర్వాత ప్రధాన బస్టాండ్ల సమీపంలో ఆగేవిధంగా నిబంధన మార్చారు. ఎంత చేసినా ఆక్యుపెన్సీ రేషియో 35 శాతాన్ని మించలేదు. నిబంధన మారిస్తే ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురవ్వాల్సిఉంటుందన్న భయంతో అధికారులు నష్టాన్ని భరిస్తూ వచ్చారు. కానీ, పరిస్థితి చేజారిపోతుండటంతో నిర్ణయం మార్చుకున్నారు. మెహిదీపట్నం, హైదరాబాద్–2 డిపో పరిధిలోని బస్సులు 4 రోజులుగా జూబ్లీబస్టాండ్, నిజామాబాద్ బస్టాండ్లలోకి వెళ్తున్నాయి. దీంతో ఆక్యుపెన్సీ రేషియో 50 శాతానికి చేరుకుంది. వీటి టికెట్ ధరలు తగ్గిస్తే ఇవి కూడా సాధారణ బస్సుల్లాగా కిక్కిరిసి తిరుగుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరంగల్ మార్గంలో తిరుగుతున్న బస్సులను కూడా బస్టాండ్లకు అనుమతిస్తే ఆక్యుపెన్సీ శాతం 60 శాతానికి చేరుకుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. త్వరలో అధికారులు ఆ నిర్ణయం కూడా తీసుకుంటారని తెలుస్తోంది. -
ఆటోను ఢీకొట్టిన వజ్ర బస్సు
యాదగిరిగుట్ట (ఆలేరు): యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్–వరంగల్ హైవేపై యాదగిరిగుట్ట మండలం బాహుపేట స్టేజీ సమీపంలో ప్రయాణికులతో వెళుతున్న ఆటోను వజ్ర ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఆటో వరంగల్ జిల్లా నుంచి ప్రయాణికులతో హైదరాబాద్ వైపునకు వెళుతుండగా.. వజ్ర ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి వరంగల్ వెళుతోంది. మృతుల్లో కాప్రా మండలం బాలాజీనగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ బర్మ రమేశ్ (35)తో పాటు అందులో ఉన్న శ్రీనివాస్(37), మరో ప్రయాణికుడు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ముగ్గురి వివరాలు తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. గాయపడిన ఐదుగురిని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆటోలో వెళుతున్న వారంతా వరంగల్ జిల్లాలో జరిగిన ఓ పంచాయితీకి వెళ్లి వస్తున్నట్లుగా తెలిసిందని పోలీసులు చెబుతున్నారు. మృతుల పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరగడంతో చాలా సేపు భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. విచారణకు ఆదేశించిన మంత్రి సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రమాదానికి కారణాలు గుర్తించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
ఈ ‘వజ్ర’o మాకొద్దు!
- వజ్ర బస్సులపై డిపోల గగ్గోలు - నిర్వహించలేమంటూ ఆర్టీసీకి వేడుకోలు సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల ఆదరణ లేక ఇప్పటివరకు విఫలయత్నంగానే మిగిలిన వజ్ర మినీ ఏసీ బస్సులకు కొత్త ఇబ్బంది వచ్చి పడింది. ఆ బస్సులను తాము నిర్వహించలే మని, గ్రామీణ ప్రాంత డిపోలకు కేటాయించాలని వాటిని నిర్వహిస్తున్న 3 డిపోల అధికారులు చేతులెత్తేశారు. గత 3–4 నెలల్లో కొన్ని డిపోల్లో లాభాలు నమోదవడం.. మిగతా డిపోల పనితీరుపై అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్న తరుణంలో ఈ బస్సులు తమకు గుదిబండలుగా మారాయని వాపోతున్నారు. వజ్ర బస్సుల నష్టాలతో రేటింగ్స్‌లో వెనుకబడితే డిపోల పనితీరుకు మచ్చలా మిగులుతుందంటూ ఇటీవల విషయాన్ని యాజమాన్యానికి విన్నవించారు. 40 శాతం దాటని ఆక్యుపెన్సీ.. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని ముఖ్య పట్టణాలకు రాజధానిలోని కాలనీల మీదుగా నడిచేలా వజ్ర పేరుతో మినీ ఏసీ బస్సులను ప్రారంభించిన ఆర్టీసీ.. తొలుత వరంగల్, నిజామాబాద్‌లకు 60 బస్సులు మొదలెట్టింది. మియాపూర్, కుషాయిగూడ, మెహిదీపట్నం డిపోలకు బస్సులను కేటాయించారు. యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవడం, మధ్యలో ఎక్కేవారికి టికెట్ ఇవ్వకపోవటం, ధర ఎక్కువగా ఉండటం.. వంటి కారణాలతో తొలి రోజు నుంచే ప్రయాణికులకు బస్సులు చేరువ కాలేకపోయాయి. ఈ లోపాలపై పత్రికల్లో కథనాలు రావటంతో మార్పులు చేసినా ప్రయాణికులు ఆదరించడం లేదు. వాటి ఆక్యుపెన్సీ రేషియో 40 శాతానికి కూడా చేరువ కాలేకపోయింది. కిలోమీటరుకు రూ.తొమ్మిదే.. హైదరాబాద్‌లో ప్రతి కిలోమీటరుకు ఆదాయం (ఈపీకే) సగటున రూ.30 నుంచి రూ.32 మేర ఉంది. కానీ వజ్ర బస్సుల్లో రూ.9 వరకే పరిమితమైంది. డిపో ఆదాయంపై ఇది భారీ ప్రభావం చూపుతోంది. తాజాగా తెలంగాణ ఆర్టీసీలో కొన్ని డిపోలు లాభాల బాటపట్టడంతో వరుస సమీక్షలతో డిపోల పనితీరును యాజమాన్యం పర్యవేక్షిస్తోంది. నష్టాలను అధిగమించటమే గీటురాయిగా పనితీరు అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో వజ్ర బస్సుల నష్టాలతో ర్యాంకిం గ్లో వెనుకబడిపోతున్నామని డిపోల అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సిటీ డిపోలు లాభాల్లో లేవని, గ్రామీణ డిపోలు లాభాల్లో ఉన్నందున నిజామాబాద్, వరంగల్ డిపోలకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. బస్సుల వల్ల ఏడాదికి రూ.5 కోట్లు నష్టమొస్తొందని వారు పేర్కొన్నట్లు తెలిసింది. బస్సులను తమకు కేటాయించాలని వరంగల్ రీజియన్ అధికారులు గతంలో కోరినా, నగరంలోని కాలనీల మీదుగా నడపాలని సీఎం ఆదేశించటంతో సిటీకి కేటాయించారు. గరుడ కన్నా ఎక్కువే.. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు రాజధాని బస్సు టికెట్ ధర రూ.280, గరుడ ధర రూ.350 ఉండగా.. వజ్ర బస్సు ధర రూ.380గా ఉంది. బస్సుల టికెట్ ధరలు ఎక్కువగా ఉండటం, సాంకేతిక సమస్యలు వంటి కారణాలతో ప్రజలు ‘వజ్ర’ వైపు మొగ్గు చూపటం లేదు. మరోవైపు బస్సులు నిర్వహించలేమంటూ డిపోలు గగ్గోలు పెడుతున్నాయి. -
వజ్ర బస్సుల్లోనూ టికెట్!
ప్రధాన లోపాన్ని సరిదిద్దుకున్న ఆర్టీసీ - డ్రైవర్ల ట్యాబ్‌లకు ప్రింటర్లతో అనుసంధానం - ప్రయాణికుడు డబ్బు చెల్లించగానే ఫోన్‌కు మెసేజ్ - ‘సాక్షి’ వరుస కథనాలతో కదిలిన ఉన్నతాధికారులు సాక్షి, హైదరాబాద్: అనుభవం అయితే కానీ ఆర్టీసీ యాజమాన్యానికి వాస్తవం బోధపడలేదు. దేశంలోనే కొత్త ప్రయోగంగా అమల్లోకి తెచ్చిన వజ్ర బస్సుల విషయంలో చేతులు కాల్చుకున్న ఆర్టీసీ క్రమంగా దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. బస్సులో టికెట్ ఇచ్చే వీల్లేకుండా ప్రయాణికుల నుంచి ఆదరణ లేకుండా చేసుకున్న యాజమాన్యం ఎట్టకేలకు తన పొరపాటును గుర్తించింది. ఆన్లైన్ ద్వారానే కాకుండా నేరుగా మధ్యలో ఎక్కే ప్రయాణికులు డ్రైవర్ ద్వారా టికెట్ పొందేలా ఏర్పాటు చేసింది. ఇందుకు ప్రత్యేకంగా డ్రైవర్ల వద్ద ఉన్న ట్యాబ్‌లకు మినీ ప్రింటర్లను జత చేశారు. ప్రయాణికుడు డబ్బులివ్వగానే డ్రైవర్లే టికెట్ బుక్ చేసి టికెట్ ప్రింట్ అందజేస్తారు. దీన్ని బుధవారం నుంచే అమల్లోకి తెచ్చారు. పలు బస్టాండ్లలోకి అనుమతి.. ఈ సర్వీసులు మొదలైనప్పుడే డ్రైవర్లకు ట్యాబ్‌లు అందించారు. ముందుగా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి వివరాలు అందులో కన్పిస్తాయి. ప్రయాణికులు ఎక్కడ బస్సు ఎక్కుతారో వాటి ద్వారానే డ్రైవర్లకు తెలుస్తుంది. ఇప్పుడు ఆ ట్యాబ్‌ల ద్వారానే ప్రయాణికులకు టికెట్ జారీ చేసేలా ఏర్పాటు చేశారు. మధ్యలో బస్సెక్కిన ప్రయాణికులకు డ్రైవర్ ట్యాబ్‌లో టికెట్ బుక్ చేస్తాడు. టికెట్ వివరాలు ప్రయాణికుడి సెల్‌ఫోన్‌కు మెసేజ్ రూపంలో వెళుతుంది. టికెట్ కావాలంటే ఆ ట్యాబ్‌లకు అనుసంధానం చేసిన ప్రింటర్ల ద్వారా జారీ అవుతుంది. గతంలో బస్టాండుల్లోకి బస్సులు వెళ్లేవి కావు. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఇమ్లీబన్, జేబీఎస్‌ల వద్దకు బస్సులు వెళ్తున్నాయి. త్వరలో రామగుండం, గోదావరిఖనిలకు సర్వీసులు.. ఈ నెలాఖరున కానీ సెప్టెంబర్ మొదటివారంలో కానీ రామగుండం, గోదావరిఖనిలకు వజ్ర బస్సు సర్వీసులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు 8 చొప్పున 16 బస్సులను కేటాయించారు. ముందే చేసి ఉంటే.. వజ్ర ఏసీ బస్సులు హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్–నిజామా బాద్ మధ్య తిరుగుతున్నాయి. ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేషియో సగటున 30% మించట్లేదు. ఇప్పటివరకు యాప్ ద్వారానో, ఆన్లైన్లోనో, ఉప్పల్ కూడలి, సుచిత్ర కూడలిలో ఉన్న అధీకృత ఏజెంట్ వద్దే టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉండేది. మధ్యలో బస్సు ఎక్కితే తొలుత నో చెప్పినా ‘సాక్షి’ కథనాల ప్రభావంతో వారిని ఎక్కేందుకు అనుమతిస్తున్నారు. అయితే టికెట్ ఇవ్వకుండా ఏజెంట్ వద్దే కొనాలని కండీషన్ పెట్టారు. ఈ నిబంధనతో ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. క్రమంగా ఇది నష్టాలకు దారి తీస్తుండటంతో అధికారులు మేలుకున్నారు. వజ్ర బస్సు డ్రైవర్లు కూడా టికెట్ ఇచ్చేలా ఏర్పాటు చేశారు. డ్రైవర్లకు టిమ్ యంత్రాలు ఇవ్వాలని డిపో మేనే జర్లు మొదట్నుంచీ మొత్తుకుంటున్నా ఉన్నతాధికారులు పెడచెవిన పెట్టారు. -
వజ్ర బస్సులను ప్రారంభించిన సీఎం
-
వజ్ర బస్సులను ప్రారంభించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గురువారం వజ్ర బస్సులు ప్రారంభించారు. అలాగే ఆర్టీసీ ప్రత్యేక మొబైల్ యాప్‌ను కూడా ఆయన ఆవిష్కరించారు. ఇవాళ మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో వరంగల్, హైదరాబాద్-నిజామాబాద్ మధ్య వజ్ర బస్సులను సీఎం ఆరంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఆర్టీసీలో ప్రమాదాల శాతం తక్కువ అని, ఆర్టీసీపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందన్నారు. తాను రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ లాభాల్లో ఉందని ఆయన గుర్తు చేసుకున్నారు. మరిన్ని నగరాలకు వజ్ర బస్సులను ప్రవేశపెడతామని కేసీఆర్ తెలిపారు. వజ్ర బస్సులను కరీంనగర్, మంచిర్యాల, రామగుండం కూడా నడపాలని అన్నారు. అలాగే జీహెచ్ఎంసీ నుంచి రెగ్యులర్‌గా సిటీ ఆర్టీసీకి, ఆర్టీసీ అప్పులను ప్రభుత్వం నుంచి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. బడ్జెట్లో కేటాయించిన రూ.వెయ్యికోట్లు విడుదలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఏసీ మినీ వజ్ర బస్సులు 60, నాన్ ఏసీ మినీ పల్లెవెలుగు బస్సులు 50 ఉన్నాయి. సూపర్‌లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సులు 190 ఉన్నాయి. వేసవిలో రద్దీ పెరిగినందున కొత్త బస్సుల అవసరం ఎంతో ఉంది. ఇప్పటికే సగానికిపైగా వేసవి గడిచిపోయినందున మిగిలిన రోజుల రద్దీ కనుగుణంగా కొత్త బస్సులను వెంటనే డిపోలకు కేటాయించారు.