Vajra
-
‘వజ్ర’ తుక్కవుతోంది
సాక్షి, హైదరాబాద్: వజ్ర .. ప్రజలకు చేరువగా కాలనీల్లోకే వచ్చి ఎక్కించుకుని వెళ్లేందుకు వీలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రారంభించిన ఆర్టీసీ మినీ ఏసీ బస్సు. ఇలాంటివి సంస్థ వద్ద 100 ఉన్నాయి. కానీ ఇప్పటికే కన్పించకుండా డిపోలకు పరిమితమైన ఈ బస్సులు ఇకపై ప్రయాణి కులకు దూరం కానున్నాయి. ఉన్నవి ఉన్నట్టుగా అమ్మేయాలని ఆర్టీసీ నిర్ణయించడమే ఇందుకు కారణం. అమ్మకానికి వీలుగా కొన్నిటిని తుక్కుగా నిర్ధారిస్తూ ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు డిపోల అధీనంలో ఉన్న బస్సులను హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఉన్న తుక్కు యార్డుకు తరలించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. తొలిదశలో 65 బస్సుల్ని తుక్కు కింద ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయనున్నారు. ఆ తర్వాత మిగతా 35 బస్సుల్ని కూడా విక్రయించనున్నారు. ఐదేళ్ల క్రితం ప్రారంభమై ఇంకా కాలం తీరని బస్సుల్ని సరిగా నిర్వహించలేక.. టోకున అమ్మేసేందుకు ఆర్టీసీ నిర్ణయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలా మొదలై.. సిటీ బస్సు కాకుండా దూర ప్రాంతానికి వెళ్లే ఆర్టీసీ బస్సెక్కాలంటే బస్టాండుకో లేదా ఎక్కడో ఉండే ఆర్టీసీ పాయింట్ వద్దకో వెళ్లాలి. అంతేకానీ క్యాబ్ లాగా అది మన ఇంటి సమీపంలోకి రాదు. కానీ బస్సు కూడా కాలనీలకు చేరువగా వెళ్లేలా ఆర్టీసీలో ఓ ఏర్పాటు ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ‘వజ్ర’ పేరుతో 2016–17లో ఆర్టీసీ ఓ మినీ బస్సు కేటగిరీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు వంద ఏసీ బస్సులను రెండు దశల్లో కొనుగోలు చేసింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్, వరంగల్‌కు నడిచేలా రూట్లు సిద్ధం చేసింది. ప్రయాణికులు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుని.. ఆ బస్సు రూట్లో వారుండే కాలనీకి దగ్గరగా ఉండే పాయింట్‌కు వెళ్లి ఎక్కేలా ఏర్పాటు చేశారు. నగదు లావాదేవీ లేకుండా ఆన్లైన్లోనే డబ్బు చెల్లించాలి. బస్సు ఏ పాయింట్‌కు, ఎన్ని గంటలకు వస్తుందో ముందుగానే ప్రయాణికుడి మొబైల్‌కు సమాచారం వెళ్లేలా ఏర్పాటు చేశారు. కానీ అంతా ఆన్‌లైన్‌తో కూడిన ఈ విధానానికి ప్రయాణికులు చేరువ కాకపోవటంతో అది కాస్తా ఫెయిల్ అయ్యింది. ప్రయాణికులకు ఎందుకు చేరువ కాలేదో, ఏ విధమైన మార్పులు చేయాలో గుర్తించని ఆర్టీసీ, కొంతకాలం అదే పద్ధతిలో బస్సులు నడిపి చివరకు ఆ పద్ధతి విరమించుకుంది. మిగతా బస్సుల మాదిరి బస్టాండ్లకే పంపేలా ఏర్పాటు చేసింది. కానీ గరుడ ప్లస్ టికెట్ ధరలను వీటికి అన్వయించటం, చిన్న బస్సు ఎక్కువ వేగంగా వెళితే వైబ్రేషన్‌కు గురవటం, ఏసీ సరిగా పనిచేయకపోవటం వంటి కారణాలతో ఇక్కడా ఆదరణ అంతంత మాత్రంగానే ఉంటూ వచ్చింది. ఈసారైనా లోపాలను సరిదిద్దడంపై సంస్థ దృష్టి పెడితే బాగుండేది. కానీ సర్వే కూడా సరిగా చేయకుండా వాటిని కొంతకాలం అలాగే తిప్పటం, జనం ఎక్కకుంటే డిపోలకే పరిమితం చేయటం ద్వారా ప్రయాణికులకు వాటిపై నమ్మకం లేకుండా చేసింది. గతేడాది ఆర్టీసీలో సమ్మె తర్వాత అధికారులు వాటిని పూర్తిగా డిపోలకే పరిమితం చేశారు. ఆ తర్వాత కోవిడ్ లాక్‌డౌన్‌తో పూర్తిగా మూలన పడేశారు. కాలం తీరకున్నా.. సాధారణంగా ఆర్టీసీ తన బస్సుల కాలం తీరిన తర్వాత కూడా వాడుతుంటుంది. చాలినన్ని బస్సుల్లేక చాలాకాలంగా డొక్కు బస్సులను వినియోగిస్తూనే ఉంది. కానీ ఇప్పుడు తుక్కుగా మారుస్తున్న వజ్ర బస్సుల కాలం తీరలేదు. తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో అధికారులు ఈ విషయం కూడా పేర్కొన్నారు. తక్కు కింద అమ్మకానికి సిద్ధమైన 65 బస్సులకు ఇంకా రూ.7,27,27,592 విలువైన ‘జీవితకాలం’ ఉందని పేర్కొన్నారు. అంటే.. తరుగు, ఇతర ఖర్చులు తీసేసినా అంత విలువ మేరకు ఇంకా వినియోగించాలన్న మాట. ఇప్పుడు వాటిని పక్కన పెడితే అంత నష్టం వాటిల్లినట్టే. ఆర్టీసీ కొత్తగా ప్రారంభించిన సరుకు రవాణా విభాగానికి వీటిని బదిలీ చేసి ఏసీ అవసరం ఉన్న సరుకులను వీటిల్లో తరలించేలా ప్రయత్నాలు చేసినా డిమాండ్ లేక పోవడంతో డిపోలకే పరిమితం అయ్యాయి. వినియోగం లేక క్రమంగా పాడవుతున్నాయన్న ఉద్దేశంతో చివరకు అమ్మేయాలని నిర్ణయించారు. తొలుత తుక్కు యార్డుకు తరలించాలని నిర్ణయించిన 65 బస్సులు 4 లక్షల కి.మీ వరకు తిరగ్గా.. మిగతా 35 బస్సులు అంత కూడా ప్రయాణించలేదు. ఇలా వాడేందుకు అవకాశం ఉన్నా.. ప్రస్తుతం ఆర్టీసీలో బస్సుల కొరత తీవ్రంగా ఉంది. కొత్త బస్సులు కొనకపోవడమే దీనికి కారణం. ఇక ఏసీ బస్సులకు మరింత కొరత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వజ్ర బస్సుల్ని ఎలా వినియోగిస్తే బాగుంటుందో అనే విషయంలో సరైన కసరత్తు జరగలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.రాష్ట్రంలో కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ లాంటి అతికొద్ది జిల్లా కేంద్రాలకే ఏసీ బస్సులున్నాయి. మిగతా జిల్లా కేంద్రాలకు ఏసీ బస్సులకు డిమాండ్ ఉన్నా కొనే ఆర్థిక స్తోమత ఆర్టీసీకి లేదు. ఈ నేపథ్యంలో నగరానికి చేరువగా ఉన్న పట్టణాలకు మినీ బస్సుల్ని రెగ్యులర్ సర్వీసులుగా తిప్పితే ఆదరణ ఉంటుందన్న అభిప్రాయాన్ని ఆర్టీసీ సిబ్బందే వ్యక్తం చేస్తున్నారు. అలాగే నిరంతరం రద్దీగా ఉండే శ్రీశైలం లాంటి పుణ్య క్షేత్రాలకు వీటిని వాడాలన్న సూచన కూడా పెండింగులో ఉంది. యాదాద్రి కొత్త దేవాలయంలో దర్శనాలు మొదలయ్యాక నగరం నుంచి రద్దీ బాగా ఉంటుంది. అప్పుడు వీటిని షటిల్ సర్వీసులుగా వాడాలన్న సూచన ఉంది. దీన్ని ఆర్టీసీ పట్టించుకోవటం లేదు. కేరళ ప్రభుత్వం కొన్ని మినీ ఏసీ బస్సులను మొబైల్ దుకాణాలుగా మార్చి అద్దెకు ఇచ్చింది. అక్కడి నగరాల్లో వీటికి డిమాండ్ బాగా ఉంది. అలా ప్రైవేటు వ్యక్తులకు అద్దెకిస్తే ఆర్టీసీకి ఆదాయం వస్తుందన్న సూచనను కూడా అధికారులు బుట్టదాఖలు చేశారు. టికెట్ బుక్ చేసుకుని.. ఆ బస్సు రూట్లో వారుండే కాలనీకి దగ్గరగా ఉండే పాయింట్‌కు వెళ్లి ఎక్కేలా ఏర్పాటు చేశారు. నగదు లావాదేవీ లేకుండా ఆన్లైన్లోనే డబ్బు చెల్లించాలి. బస్సు ఏ పాయింట్‌కు, ఎన్ని గంటలకు వస్తుందో ముందుగానే ప్రయాణికుడి మొబైల్‌కు సమాచారం వెళ్లేలా ఏర్పాటు చేశారు. కానీ అంతా ఆన్‌లైన్‌తో కూడిన ఈ విధానానికి ప్రయాణికులు చేరువ కాకపోవటంతో అది కాస్తా ఫెయిల్ అయ్యింది. ప్రయాణికులకు ఎందుకు చేరువ కాలేదో, ఏ విధమైన మార్పులు చేయాలో గుర్తించని ఆర్టీసీ, కొంతకాలం అదే పద్ధతిలో బస్సులు నడిపి చివరకు ఆ పద్ధతి విరమించుకుంది. మిగతా బస్సుల మాదిరి బస్టాండ్లకే పంపేలా ఏర్పాటు చేసింది. కానీ గరుడ ప్లస్ టికెట్ ధరలను వీటికి అన్వయించటం, చిన్న బస్సు ఎక్కువ వేగంగా వెళితే వైబ్రేషన్‌కు గురవటం, ఏసీ సరిగా పనిచేయకపోవటం వంటి కారణాలతో ఇక్కడా ఆదరణ అంతంత మాత్రంగానే ఉంటూ వచ్చింది. ఈసారైనా లోపాలను సరిదిద్దడంపై సంస్థ దృష్టి పెడితే బాగుండేది. కానీ సర్వే కూడా సరిగా చేయకుండా వాటిని కొంతకాలం అలాగే తిప్పటం, జనం ఎక్కకుంటే డిపోలకే పరిమితం చేయటం ద్వారా ప్రయాణికులకు వాటిపై నమ్మకం లేకుండా చేసింది. గతేడాది ఆర్టీసీలో సమ్మె తర్వాత అధికారులు వాటిని పూర్తిగా డిపోలకే పరిమితం చేశారు. ఆ తర్వాత కోవిడ్ లాక్‌డౌన్‌తో పూర్తిగా మూలన పడేశారు. కాలం తీరకున్నా.. సాధారణంగా ఆర్టీసీ తన బస్సుల కాలం తీరిన తర్వాత కూడా వాడుతుంటుంది. చాలినన్ని బస్సుల్లేక డొక్కు బస్సులను వినియోగిస్తూనే ఉంది. కానీ ఇప్పుడు తుక్కుగా మారుస్తున్న వజ్ర బస్సుల కాలం తీరలేదు. తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో అధికారులు ఈ విషయం కూడా పేర్కొన్నారు. తక్కు కింద అమ్మకానికి సిద్ధమైన 65 బస్సులకు ఇంకా రూ.7,27,27,592 విలువైన ‘జీవితకాలం’ ఉందని పేర్కొన్నారు. అంటే.. తరుగు, ఇతర ఖర్చులు తీసేసినా అంత విలువ మేరకు ఇంకా వినియోగించాలన్న మాట. ఇప్పుడు వాటిని పక్కన పెడితే అంత నష్టం వాటిల్లినట్టే. ఆర్టీసీ కొత్తగా ప్రారంభించిన సరుకు రవాణా విభాగానికి వీటిని బదిలీ చేసి ఏసీ అవసరం ఉన్న సరుకులను తరలించేలా ప్రయత్నాలు చేసినా డిమాండ్ లేక పోవడంతో డిపోలకే పరిమితం అయ్యాయి. వినియోగం లేక క్రమంగా పాడవుతున్నాయన్న ఉద్దేశంతో చివరకు అమ్మేయాలని నిర్ణయించారు. తొలుత తుక్కు యార్డుకు తరలించాలని నిర్ణయించిన 65 బస్సులు 4 లక్షల కి.మీ వరకు తిరగ్గా.. మిగతా 35 బస్సులు అంత కూడా ప్రయాణించలేదు. ఇలా వాడేందుకు అవకాశం ఉన్నా ♦ప్రస్తుతం ఆర్టీసీలో బస్సుల కొరత తీవ్రంగా ఉంది. కొత్త బస్సులు కొనకపోవడమే దీనికి కారణం. ఇక ఏసీ బస్సులకు మరింత కొరత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వజ్ర బస్సుల్ని ఎలా వినియోగిస్తే బాగుంటుందో అనే విషయంలో సరైన కసరత్తు జరగలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ♦రాష్ట్రంలో కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ లాంటి అతికొద్ది జిల్లా కేంద్రాలకే ఏసీ బస్సులున్నాయి. మిగతా జిల్లా కేంద్రాలకు ఏసీ బస్సులకు డిమాండ్ ఉన్నా కొనే ఆర్థిక స్తోమత ఆర్టీసీకి లేదు. ఈ నేపథ్యంలో నగరానికి చేరువగా ఉన్న పట్టణాలకు మినీ బస్సుల్ని రెగ్యులర్ సర్వీసులుగా తిప్పితే ఆదరణ ఉంటుందన్న అభిప్రాయాన్ని ఆర్టీసీ సిబ్బందే వ్యక్తం చేస్తున్నారు. ♦శ్రీశైలం లాంటి పుణ్య క్షేత్రాలకు, యాదాద్రి కొత్త దేవాలయంలో దర్శనాలు మొదలయ్యాక నగరం నుంచి రద్దీ బాగా ఉంటుంది. వీటిని షటిల్ సర్వీసులుగా వాడాలన్న సూచన ఉంది. దీన్ని ఆర్టీసీ పట్టించుకోవటం లేదు. ♦కేరళ ప్రభుత్వం కొన్ని మినీ ఏసీ బస్సులను మొబైల్ దుకాణాలుగా మార్చి అద్దెకు ఇచ్చింది. అక్కడి నగరాల్లో వీటికి డిమాండ్ బాగా ఉంది. అలా ప్రైవేటు వ్యక్తులకు అద్దెకిస్తే ఆర్టీసీకి ఆదాయం వస్తుందన్న సూచనను కూడా అధికారులు బుట్టదాఖలు చేశారు. -
సత్ఫలితాలిస్తున్న ‘వజ్ర’ పథకం
న్యూఢిల్లీ: దేశంలో నానాటికీ క్షీణిస్తున్న పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్ డీ) విభాగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ‘వజ్ర’ పథకం సత్ఫలితాన్నిస్తోంది. ఈ పథకం కింద దేశంలో పనిచేసేందుకు 260 మంది విదేశీ శాస్త్రవేత్తలు దరఖాస్తు చేసుకున్నారు. విజిటింగ్ అడ్వాన్స్డ్ జాయింట్ రీసెర్చ్(వజ్ర) పథకం కింద దేశంలో వివిధ సంస్థలు, విశ్వవిద్యాలయాల్లోని ఆర్ అండ్ డీ విభాగాల్లో పనిచేసేందుకు ఈ ఏడాది మేలో విదేశీ శాస్త్రవేత్తలను కేంద్రం ఆహ్వానించింది. శాస్త్రవేత్తలకు ఈ నెలలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి డిసెంబర్లో 70మందితో కూడిన తుదిజాబితాను రూపొందిస్తామని కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం కార్యదర్శి తెలిపారు. పథకం కింద ఏడాదికి 1000 మంది శాస్త్రవేత్తలను ఎంపిక చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. పథకం కింద శాస్త్రవేత్తలు గరిష్ఠంగా 3 నెలలు పనిచేయాలి. -
ఒక బస్సు.. ఇద్దరే ప్రయాణికులు!
ఖాళీగా పరుగులెడుతున్న ఏసీ ‘వజ్ర’ ఉప్పల్ కూడలి.. రాత్రి ఏడు దాటింది.. ఆర్టీసీ కొత్తగా ప్రవేశపెట్టిన వజ్ర ఏసీ బస్సొచ్చి ఆగింది. వరంగల్ వెళ్లాల్సిన ఆ బస్సులో ఇద్దరే ఉన్నారు. ఒక్కసారిగా ప్రయాణికులు ఎగబడ్డారు. కానీ.. డ్రైవర్ అనుమతించలేదు. ఇద్దరు ప్రయాణికులతోనే బస్సు ముందుకు కదిలింది. ఇది ఈ ఒక్క బస్సు కథ కాదు. హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్–నిజామాబాద్ మార్గంలో ఆర్టీసీ ప్రారంభించిన వజ్ర బస్సులన్నింటిదీ ఇదే వ్యథ. ఏమిటీ వజ్ర? బస్సు ఎక్కేందుకు బస్టాండుకు వెళ్లే పాత పద్ధతికి స్వస్తి పలికి, బస్సులే కాలనీలకు వచ్చే విధంగా ఏసీ మినీ బస్సులు ప్రారంభించాలన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశంతో ఆర్టీసీ ఇటీవల ‘వజ్ర’ బస్సులు ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి ప్రధాన పట్టణాలకు మినీ ఏసీ బస్సులు ప్రారంభించాలని గతేడాది జూన్‌లో జరిగిన ఆర్టీసీ సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో ఈ నెల ఆరంభంలో తొలివిడతగా 48 మినీ ఏసీ బస్సులను ఆర్టీసీ ప్రారంభించింది. వీటిలో 30 బస్సులను హైదరాబాద్–వరంగల్ మధ్య, 18 బస్సులను హైదరాబాద్–నిజామాబాద్ మధ్య నడుపుతున్నారు. ఇమ్లీబన్, జూబ్లీ బస్టాండ్లకు కాకుండా నిర్ధారించిన కాలనీల మీదుగా ఈ బస్సులు ప్రయాణిస్తాయి. మరేంటి సమస్య? టికెట్ కొని బస్సు ఎక్కే విధానం లేకపోవటమే ప్రధాన సమస్యగా మారింది. బస్సులో టికెట్ ఇచ్చే వీలు లేదు. ఆర్టీసీ కౌంటర్లలో ఇవ్వరు. కేవలం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ద్వారానే సీటు బుక్ చేసుకోవాలి. అలాగే వరంగల్ మార్గంలో ఉప్పల్ కూడలి, నిజామాబాద్ మార్గంలో సుచిత్ర కూడలిలోని ప్రైవేట్ ఆన్లైన్ రిజర్వేషన్ కేంద్రాల్లో అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో ప్రయాణికులకు అవగాహన లేక బుకింగ్స్ తక్కువగా ఉన్నాయి. రూట్ మ్యాపేంటి? మెహిదీపట్నం, మియాపూర్, కుషాయిగూడ, హైదరాబాద్–2ల నుంచి ఈ బస్సులు ఉదయం 4 గంటల నుంచే బయలుదేరుతున్నాయి. ఆయా డిపోల నుంచి ప్రధాన కాలనీల మీదుగా ముందుకు సాగుతాయి. ఉదాహరణకు మెహిదీపట్నం డిపో బస్సు వరంగల్ వెళ్లాలంటే.. మెహిదీపట్నం, ఆసిఫ్‌నగర్, విజయనగర్ కాలనీ, మాసబ్‌ట్యాంక్, లక్డీకాపూల్, లిబర్టీ, గగన్‌మహల్, హిమాయత్‌నగర్, నారాయణగూడ, నల్లకుంట, డీడీ కాలనీ, అంబర్‌పేట, రామంతాపూర్, ఉప్పల్ మీదుగా వెళ్తుంది. వరంగల్‌కు రూ.300, నిజామాబాద్‌కు రూ.350 టికెట్ ధరగా నిర్ణయించారు. యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే ఆ వివరాలు డ్రైవర్ వద్ద ఉండే ట్యాబ్‌లో కనిపిస్తాయి. ఏ కాలనీలో ఎవరు బుక్ చేసుకున్నారో, ఏ సమయంలో ఎక్కుతారో తెలుస్తుంది. డ్రైవర్ ఫోన్ నెంబరు ఇతర వివరాలు ప్రయాణికుడి మొబైల్‌కు మెసేజ్ ద్వారా అందుతాయి. ప్రస్తుత పరిస్థితి.. ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేషియో 15 నుంచి 18 శాతం ఉంది. 21 సీట్లుండే ఈ బస్సులో నలుగురైదుగురు, ఒక్కోసారి ఒక్కరు మాత్రమే ఉంటున్నారు. బుకింగ్స్‌పై అవగాహనలేని ప్రయాణికులు ఖాళీగా ఉన్న బస్సులను చూసి మార్గ మధ్యలో ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రయాణికులను డ్రైవర్ అనుమతించకపోవడంతో.. బస్సు ఖాళీగా ఉన్నా ఎందుకు ఎక్కనీయరంటూ డ్రైవర్లతో వాదనకు దిగుతున్నారు. వెరసి అటు వరంగల్, ఇటు నిజామాబాద్ మార్గంలో బస్సులు ఖాళీగా పరుగుపెడుతున్నాయి. వరంగల్, నిజామాబాద్‌లలోనూ ఇవే సమస్యలు ఉండటంతో ఖాళీగా హైదరాబాద్ వస్తున్నాయి. ఇలా చేస్తే బెటరేమో.. ► ఆర్టీసీ కౌంటర్లలో టికెట్లు జారీ చేసేలా ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు టికెట్ తీసుకోడానికి ఉపయోగం. ► ఇమ్లీబన్, జూబ్లీబస్టాండ్ల మీదుగా బస్సులను నడపొద్దని నిర్ణయించినందున వరంగల్ మార్గంలో తార్నాక, రామంతాపూర్, ఉప్పల్, ఘట్కేసర్ లాంటి చోట్ల, నిజామాబాద్ మార్గంలో ప్యారడైజ్, బోయిన్పల్లి, సుచిత్ర, కొంపల్లి లాంటి చోట్ల టికెట్లు జారీ చేసే ఏర్పాట్లు చేయాలి. లేదంటే డ్రైవర్ వద్దనే టికెట్ ఇష్యూయింగ్ మెషీన్ (టిమ్) ఉంచి టికెట్లు జారీ చేసే ఏర్పాటు చేయాలి. ► బస్సులు తిరిగే కాలనీల్లో వజ్ర బస్సులపై ప్రచారం చేపట్టాలి. – సాక్షి, హైదరాబాద్