సత్ఫలితాలిస్తున్న ‘వజ్ర’ పథకం | Visiting Advanced Joint Research (VAJRA) FacultyScheme | Sakshi
Sakshi News home page

సత్ఫలితాలిస్తున్న ‘వజ్ర’ పథకం

Published Mon, Oct 9 2017 3:45 AM | Last Updated on Mon, Oct 9 2017 3:45 AM

Visiting Advanced Joint Research (VAJRA) FacultyScheme

న్యూఢిల్లీ: దేశంలో నానాటికీ క్షీణిస్తున్న పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌ డీ) విభాగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ‘వజ్ర’ పథకం సత్ఫలితాన్నిస్తోంది. ఈ పథకం కింద దేశంలో పనిచేసేందుకు 260 మంది విదేశీ శాస్త్రవేత్తలు దరఖాస్తు చేసుకున్నారు. విజిటింగ్‌ అడ్వాన్స్‌డ్‌ జాయింట్‌ రీసెర్చ్‌(వజ్ర) పథకం కింద దేశంలో వివిధ సంస్థలు, విశ్వవిద్యాలయాల్లోని ఆర్‌ అండ్‌ డీ విభాగాల్లో పనిచేసేందుకు ఈ ఏడాది మేలో విదేశీ శాస్త్రవేత్తలను కేంద్రం ఆహ్వానించింది. శాస్త్రవేత్తలకు ఈ నెలలో స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించి డిసెంబర్‌లో 70మందితో కూడిన తుదిజాబితాను రూపొందిస్తామని కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం కార్యదర్శి తెలిపారు. పథకం కింద ఏడాదికి 1000 మంది శాస్త్రవేత్తలను ఎంపిక చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.  పథకం కింద శాస్త్రవేత్తలు గరిష్ఠంగా 3 నెలలు పనిచేయాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement