కొత్త కారు కొంటున్నారా?: ఇలా చేస్తే.. ట్యాక్స్‌లో 50 శాతం తగ్గింపు | MoRTH Proposes 50 Percent Tax Refund For Scrapping Old Polluting Vehicles | Sakshi
Sakshi News home page

కొత్త కారు కొంటున్నారా?: ఇలా చేస్తే.. ట్యాక్స్‌లో 50 శాతం తగ్గింపు

Jan 27 2025 4:21 PM | Updated on Jan 27 2025 7:35 PM

MoRTH Proposes 50 Percent Tax Refund For Scrapping Old Polluting Vehicles

వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించాలంటే.. కాలుష్య కారకాలను తగ్గించాలి. దీనిని దృష్టిలో ఉంచుకుని రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఓ కీలక ప్రకటన చేసింది. పాత వాహనాలను స్క్రాప్ చేసి, కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తే ట్యాక్స్‌లో గరిష్టంగా 50 శాతం తగ్గింపు లభించనున్నట్లు వెల్లడించింది.

ప్రస్తుతం పాత వాహనాలను రద్దు (స్క్రాపేజ్) చేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తే.. వాహన పన్నులో 25 శాతం తగ్గింపు, వాణిజ్య వాహనాల విషయంలో 15 శాతం తగ్గింపు ఉంది. కానీ దీనిని 50 శాతానికి పెంచుతూ.. జనవరి 24న విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్‌లో మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

బిఎస్ 4 వాహనాల విక్రయాలు ఎప్పుడో ఆగిపోయాయి. ప్రస్తుతం బిఎస్ 6 వాహనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే 2000లో వాహనాలకు బిఎస్ 1 ఉద్గార ప్రమాణాలు తప్పనిసరి. ఆ తరువాత బిఎస్ 2 ప్రమాణాలు 2002లో అమలులోకి వచ్చాయి.

దేశంలో పాత వాహనాల సంఖ్య ఎక్కువ కావడం వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రవాణా మంత్రిత్వ శాఖ వాలంటరీ వెహికల్ మోడరనైజేషన్ ప్రోగ్రామ్ లేదా వెహికల్ స్క్రాపింగ్ పాలసీని ప్రారంభించింది. అంతే కాకుండా వెహికల్స్ స్క్రాపేజ్ కోసం వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీలను, ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లకు అనుమతిచ్చింది.

ఇదీ చదవండి: అదే జరిగితే.. బంగారం రేటు మరింత పైకి!

ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో స్కాపేజ్ స్టేషన్స్ ఉన్నాయి. వీటి ద్వారా మీ వాహనాన్ని స్కాపేజ్ చేసి, సర్టిఫికెట్ తీసుకుంటే.. కొత్త కారు కొనుగోలుపై పలు రాయితీలను పొందవచ్చు. ఇది కొత్త కారు కొనుగోలు చేయడానికి కొంత ఆర్థికంగా కూడా ఉపయోగపడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement