సంక్రాంతి బస్సుల్లో 10 నుంచి 12 వరకు.. అలాగే 19, 20 తేదీల్లో చార్జీల పెంపు
పెంచిన చార్జీలు ప్రత్యేక బస్సుల్లోనే అమలు
సాక్షి, హైదరాబాద్: పండుగపూట ప్రయాణికులను సురక్షి తంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. సంక్రాంతిని పురస్కరించు కుని 6,432 ప్రత్యేక బస్సులను నడపనుంది. పండుగ సందర్భంగా ఈ నెల 10, 11, 12 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని సంస్థ అంచనా వేస్తోంది. ఈ నేప థ్యంలో ఆయా రోజుల్లో ప్రత్యేక బస్సులను అందుబాటు లో ఉంచి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటోంది. అదేవిధంగా ఈ నెల 19, 20 తేదీల్లో తి రుగు ప్రయాణ రద్దీ దృష్ట్యా కూడా ప్రత్యేక బస్సులు ఏ ర్పాటు చేస్తోంది.
హైదరాబాద్‌లో ఎంజీబీఎస్, జేబీఎస్ బ స్‌స్టేషన్లు, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రా స్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు ప్రారంభమవుతాయి. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేసింది. కాగా, పండుగపూట నడిపే ప్రత్యేక బస్సుల చార్జీలను ఆర్టీసీ సవరించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒకటిన్నర రెట్ల వరకు ధరలను సవరిస్తున్నట్లు సంస్థ తెలిపింది. పెంచిన చార్జీలు ప్రత్యేక బస్సుల్లో మాత్రమే అమలు చేస్తారు.
ఈ నెల 10, 11, 12 తేదీలతో పాటు తిరుగు ప్రయాణ రద్దీ ఎక్కువగా ఉండే 19, 20 తేదీల్లో మాత్రమే సవరించిన చార్జీలను అమలు చేస్తామని, స్పెషల్ బస్సులు మినహా రెగ్యులర్ బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉంటాయని టీజీఎస్‌ఆర్‌టీసీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుంది. ఇదిలా ఉండగా పండుగలు, ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం www. tgsrtcbus. in వెబ్‌సైట్‌ను సందర్శించాలని టీజీఎస్‌ఆర్టీసీ వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040–69440000, 040–23450033 సంప్రదించాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment