
కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' ఇటీవల దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థల సీఈఓలు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. స్క్రాపేజ్ పాలసీ కింద డిస్కౌంట్స్ అందించాలని ఈ సమావేశంలో పేర్కొన్నారు. దీనిని 'ఐషర్' కంపెనీ ఎట్టకేలకు అమలుపరుస్తున్నట్లు ప్రకటించింది.
ఇప్పుడు ఎవరైన మినీ ట్రక్కు, బస్సులను కొనుగోలు చేయాలనుకుంటే డిస్కౌంట్ పొందవచ్చు. ఎలా అంటే.. మీ దగ్గరున్న పాత వాహనాలను స్క్రాపేజ్ (తుక్కు) కింద మార్చి, దానికి సంబంధించిన సెర్టిఫికేట్ పొందాలి. ఆ తరువాత సర్టిఫికేట్‌ను కొత్త వాహనం కొనే సమయంలో కంపెనీలో (ఐషర్ కంపెనీ) చూపిస్తే.. 1.25 శాతం నుంచి 3 శాతం వరకు కొత్త వెహికల్ కొనుగోలుపైన రాయితీ పొందవచ్చు.
స్క్రాపేజ్ పాలసీ కింద పొందే రాయితీలను.. 2024 సెప్టెంబర్ 1 నుంచి చెల్లుబాటు అవుతుంది. ఇది వచ్చే రెండేళ్ళు లేదా తరువాత నోటీస్ వచ్చేవరకు అమలులో ఉంటుందని ఐషర్ కంపెనీ పేర్కొంది.
వెహికల్ స్క్రాపేజ్ పాలసీ కింద ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి, రోడ్డుపై పాతవాహనాల సంఖ్యను తగ్గించడానికి ఇది ఒక పరివర్తనాత్మక దశ అని వీఈ కమర్షియల్ వెహికల్స్ ఎండీ అండ్ సీఈఓ 'వినోద్ అగర్వాల్' పేర్కొన్నారు. కంపెనీ కూడా కస్టమర్లకు పూర్తిగా సహకరిస్తుందని ఆయన వెల్లడించారు.